మ‌రో పాక్‌-ఇండియ‌న్ పెళ్లి.. ఈసారి వ‌ర్చువ‌ల్‌గా..!

మరో సరిహద్దు ప్రేమకథ, కరాచీకి చెందిన అమీనా మరియు జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్ ఇటీవల జోధ్‌పూర్‌లోని ఓస్వాల్ సమాజ్ భవన్‌లో వర్చువల్ వెడ్డింగ్‌ను నిర్వహించారు. అర్బాజ్ పోస్వల్ సమాజ్ భవనానికి చేరుకోగా, అమీనా పాకిస్తాన్ నుండి వర్చువల్గా తన పెళ్లి వేడుకల్లో పాల్గొని. వీసా పరిమితుల కారణంగా ఈ ఎంపిక జరిగింది. ఈ వివాహం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కానీ కలిసి జీవితాన్ని గడపాలని, ఇలా వర్చువల్ పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లి విశేషాలు:  అర్బాజ్ కుటుంబ […]

Share:

మరో సరిహద్దు ప్రేమకథ, కరాచీకి చెందిన అమీనా మరియు జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్ ఇటీవల జోధ్‌పూర్‌లోని ఓస్వాల్ సమాజ్ భవన్‌లో వర్చువల్ వెడ్డింగ్‌ను నిర్వహించారు. అర్బాజ్ పోస్వల్ సమాజ్ భవనానికి చేరుకోగా, అమీనా పాకిస్తాన్ నుండి వర్చువల్గా తన పెళ్లి వేడుకల్లో పాల్గొని. వీసా పరిమితుల కారణంగా ఈ ఎంపిక జరిగింది. ఈ వివాహం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కానీ కలిసి జీవితాన్ని గడపాలని, ఇలా వర్చువల్ పెళ్లితో ఒకటయ్యారు.

పెళ్లి విశేషాలు: 

అర్బాజ్ కుటుంబ సభ్యుల్లో ఒకరు పాకిస్థానీ అమ్మాయిని గతంలో వివాహం చేసుకున్నందున, అర్బాజ్ మరియు అమీనా కుటుంబాలు ముందు నుంచి బంధువులని తెలుస్తోంది. ముందుగా ఉన్న ఈ బంధం వారి బంధాన్ని మరింత పటిష్టం చేసింది. అమీనా కుటుంబం అర్బాజ్ కుటుంబానికి వివాహ విషయం గురించి మాట్లాడారు, అంతేకాదు వారు వెంటనే అంగీకరించారు. అయితే వర్చువల్ గా పెళ్లి జరిగినప్పటికీ వారికి తమ మత అధికారుల నుంచి పెళ్లి సర్టిఫికెట్ అందిందని చెప్పుకొచ్చారు.

అర్బాజ్ మరియు అమీనా ఇద్దరూ, అమీనాకు భారతీయ వీసాను పొందాలనే కోరికను వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వీసా ఇబ్బంది కారణంగా ఈ వర్చువల్ పెళ్లి జరిగినట్లు బంధువులు చెప్తున్నారు. అర్బాజ్ తండ్రి మహ్మద్ అఫ్జల్ మాట్లాడుతూ, తనకి మనవడు వరస అయ్యే చార్టర్డ్ అకౌంటెంట్, పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడని.. వారు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న విధానాన్ని చూసిన అమీనా కుటుంబం మా అబ్బాయిని పెళ్లి చేయమని కోరిందని, మేము దానిని అంగీకరించాము అంటూ చెప్పుకొచ్చాడు.

ఇలాంటివి మరెన్నో బోర్డర్ ప్రేమ కథలు: 

ఇటీవల భారత దేశంలో దృష్టిని ఆకట్టిన జంట సిమా- సచిన్ కథ. పాకిస్తాన్ కి చెందిన మహిళ సీమ తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి సచిన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం, పబ్జి ద్వారా పరిచయమే ఆ ఫేమను భారతదేశానికి రప్పించినట్లు వెల్లడించారు.  అంతేకాకుండా వారిద్దరూ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ గేమ్ ‘పబ్జి’ ద్వారా పరిచయమైనట్టు తెలిసింది. ప్రస్తుతం సీమ మరియు సచిన్ పెళ్లి బంధంతో ఒకటై, ప్రస్తుతం యూపీ లోని ఒక ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

అంజు-నస్రుల్లా:

34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా అనే వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ బోర్డర్ దాటింది. అయితే ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టిన అనంతరం పాకిస్తాన్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనకి లీగల్ గా పాస్పోర్ట్ కూడా ఉండడం వల్ల అక్కడ పాకిస్తాన్ పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.  అంజు కలవడానికి వెళ్ళిన తన ప్రియుడు నస్రుల్లా వైద్య రంగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఫేస్ బుక్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అంజు ఇస్లాం మతం తీసుకున్నందువలన పాకిస్తాన్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి అంజు-నస్రుల్లా జంటకి ల్యాండ్ ని బహుమతిగా కూడా ఇచ్చారు.