రష్యా లూనా కూలిపోవడంతో చంద్రుడిపై భారీ గుంత

దాదాపు 50 సంవత్సరాలలో రష్యా యొక్క మొట్టమొదటి మూన్ మిషన్, లూనా-25 ప్రోబ్, ఫ్రీ-ల్యాండింగ్ విన్యాసాల్లో ఒక సంఘటన తర్వాత చంద్రుని ఉపరితలంపై కూలిపోయింది. మాస్కో సమయం మధ్యాహ్నం 2:57 గంటలకు (11:57 GMT) ప్రోబ్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది అని, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది. ఈ ప్రోబ్ చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ల్యాండ్ కావాల్సి ఉంది. ఇది చంద్రుని ఉపరితలం మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్లింది.  ప్రమాదానికి గల […]

Share:

దాదాపు 50 సంవత్సరాలలో రష్యా యొక్క మొట్టమొదటి మూన్ మిషన్, లూనా-25 ప్రోబ్, ఫ్రీ-ల్యాండింగ్ విన్యాసాల్లో ఒక సంఘటన తర్వాత చంద్రుని ఉపరితలంపై కూలిపోయింది. మాస్కో సమయం మధ్యాహ్నం 2:57 గంటలకు (11:57 GMT) ప్రోబ్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది అని, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది. ఈ ప్రోబ్ చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ల్యాండ్ కావాల్సి ఉంది. ఇది చంద్రుని ఉపరితలం మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్లింది.

 ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రోస్కోస్మోస్ తెలిపారు. అయితే లూనా 25 కూలిపోవడంతో జాబిల్లిపై భారీ గొయ్యి పడినట్లు తెలుస్తోంది. దీన్ని గుర్తించిన అమెరికా నాసా.. లూనా 25 కూలిపోయిన ప్రాంతాన్ని ఫోటోలు తీసి విడుదల చేసింది. చంద్రయాన్ 3 తర్వాత నింగిలోకి దూసుకెళ్లిన లూనా 25.. చంద్రయాన్ కన్నా ముందు దిగేందుకు సిద్ధమై చివరి నిమిషంలో ఫెయిల్ అయింది.

చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 తర్వాత.. కొన్ని రోజులకు లూనా 25 ప్రయోగాన్ని రష్యా చేపట్టింది. అయితే చంద్రుడిపైకి దాదాపు 5 దశాబ్దాల తర్వాత రష్యా ఈ ప్రయోగాన్ని పంపించింది. అయితే చంద్రయాన్ 3 కంటే ముందే జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్ అయ్యేలా సిద్ధం చేసిన లూనా 25.. ఆఖరి నిమిషంలో ఫెయిల్ అయి.. చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. 

అయితే ఈ ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. దానికి సంబంధించి ఫోటోలను కూడా తీసి విడుదల చేసింది. లూనా 25 కూలిపోయిన ప్రాంతంలో భారీ గుంత ఏర్పడినట్లు నాసా విడుదల చేసిన ఫోటోల్లో వెల్లడవుతోంది.అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేటర్స్‌కు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ తీసిన ఫోటోలను తాజాగా నాసా విడుదల చేసింది. 

లూనా 25 కూలిపోవడంతో చంద్రుడిపై కొత్తగా గొయ్యి ఏర్పడిందని నాసా వెల్లడించింది. ఈ గుంత సుమారు 10 మీటర్ల వెడల్పు ఉందని తెలిపింది. అయితే ఈ గుంత లూనా 25 ల్యాండింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉందని పేర్కొంది. అయితే లూనా 25 కూలిపోవడం కారణంగానే అంత పెద్ద బిలం ఏర్పడి ఉండవచ్చని నాసా అనుమానం వ్యక్తం చేసింది. 

మరోవైపు.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే క్రమంలో చివరి నిమిషంలో లూనా 25 ప్రాజెక్టు విఫలమై క్రాష్ ల్యాండింగ్ కావడంతో రష్యా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఓ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.లూనా 25 ప్రయోగాన్ని ఆగస్టు 11 వ తేదీన రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. దాదాపు పది రోజుల పాటు ప్రయాణించిన లూనా 25 ల్యాండర్‌.. అప్పటివరకు బాగానే పని చేసింది. 

క్రాష్ ల్యాండింగ్ కావడానికి కొన్ని గంటల ముందు కూడా లూనా 25 చంద్రుడి ఫొటోలను పంపించింది. చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు రష్యా.. దాదాపు 47 ఏళ్ల తర్వాత ప్రయోగం చేపట్టింది. ఇందు కోసం లూనా 25 మిషన్‌ను చేపట్టిన రష్యా.. చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగడానికి ముందే.. ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రయత్నం చేసింది. అయితే చంద్రుడి ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ల్యాండర్‌లో టెక్నికల్ ఫెయిల్యూర్‌తో కూలిపోయింది.