కూతురి మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోనే దూకబోయిన తండ్రి

రాజస్థాన్‌లోని భిల్వారాలో విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లెదుటే చితిలో కాలిపోతుంటే ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. ఆ బిడ్డకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, కూతురిని కాపాడుకోలేదన్న బాధతో చితిలో దూకేందుకు ప్రయత్నించాడు ఆ తండ్రి. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా,  ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని మహాత్మా గాంధీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ గౌర్ తెలిపారు.  అసలు ఏం జరిగిందంటే.. భిల్వారా జిల్లాలోని […]

Share:

రాజస్థాన్‌లోని భిల్వారాలో విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లెదుటే చితిలో కాలిపోతుంటే ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. ఆ బిడ్డకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, కూతురిని కాపాడుకోలేదన్న బాధతో చితిలో దూకేందుకు ప్రయత్నించాడు ఆ తండ్రి. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా,  ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని మహాత్మా గాంధీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ గౌర్ తెలిపారు. 

అసలు ఏం జరిగిందంటే..

భిల్వారా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏండ్ల బాలిక తమకున్న పశువులను మేపడానికి ఆగస్టు 4వ తేదీ పక్కనున్న అడవిలోకి వెళ్లింది. రాత్రి అవుతున్నా.. బిడ్డ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దీంతో వెంటనే వారు అడవిలో వెతికేందుకు బయలుదేరారు. అయినా పాప ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అడవిలో, ఆ పక్కనున్న ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. 

ఆగస్టు 4న గ్రామంలోని చెరువులో సగం కాలిపోయిన శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. అయితే, అవి బాలికవే అని అనుమానిస్తున్నట్లు తెలిపారు. మిగతా డెడ్‌బాడీ పార్ట్స్ పక్కనున్న ఇటుక బట్టిలో కాలిపోయిన స్థితిలో గుర్తించారు. పశువులను మేపేందుకు వెళ్లిన మైనర్‌‌ బాలికపై అదే రోజు రాత్రి.. కొంత మంది దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత పక్కనున్న ఇటుక బట్టిలో బాలికను తగలబెట్టారని చెప్పారు. కాలిన డెడ్‌బాడీని పక్కనున్న చెరువులో పడేశారని, అయితే, మృతదేహం పూర్తిగా మంటల్లో కాలకపోవడంతో అవి చెరువులో బయటకు తేలాయని పేర్కొన్నారు. పోలీసులకు సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకే ఆధారాలను నిందితులు నాశనం చేశారన్నారు. అందుకే డెడ్‌బాడీని కాల్చి సమీపంలోని చెరువులో పారవేసినట్లు పోలీసులు తెలిపారు. 

నిందితులకు ఉరిశిక్ష పడేలా చేస్తాం..

కాగా, దీనిని అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న భిల్వారా ఎస్పీ ఆదర్శ సిద్ధూ.. నిందితులకు మరణశిక్ష పడేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితులందరికీ ఉరిశిక్షను వేయిస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు నిందితులుగా గుర్తించామని ఆయన తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మైనర్‌‌  బాలికను రేప్‌ చేసిన తర్వాత, డెడ్‌బాడీని మాయం చేసేందుకు ఆ మహిళలు సాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇద్దరు మగ నిందితుల భార్యలు ఉన్నారని, మరో నిందితుడి తల్లి, ఇంకో నిందితుడి సిస్టర్‌‌ కూడా ఉందని గుర్తించారు. కాగా, బాలికపై గ్యాంగ్‌ రేప్‌ చేసి, బతికి ఉన్నప్పుడే కాల్చి చంపారా..? లేక చనిపోయిన తర్వాత తగలబెట్టారా అని విషయాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఫొరెన్స్‌ రిపోర్ట్‌ వచ్చాకే ఈ వివరాలు తెలుస్తాయని ఎస్పీ వెల్లడించారు. 

 కాగా,భిల్వారా గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కొట్రాపోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్  ఆఫ్ పోలీస్ (ఏఎస్‌ఐ)ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఈ కేసు తీవ్ర సంచలనం రేగడంతో పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. రాజస్థాన్‌లో లా అండ్‌ అర్డర్‌‌ పరిస్థితిపై సభలో చర్చ జరగాలని అధికారపక్ష నేతలు పట్టుబట్టాయి. స్టేట్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు అరుణ్ చతుర్వేది మాట్లాడుతూ, రాజస్థాన్‌లో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతన్నా..పట్టించుకోకుండా, 2023 ఎన్నికల మేనిఫెస్టోను రెడీ చేసే పనిలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు.