ఇస్రో పేరు చెప్పి ఘ‌రానా మోసం

చంద్రయాన్-3 ఎప్పుడైతే విజయం సాధించిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇస్రో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇస్రో కీర్తిని పొగుడుతున్నారు. అది మాత్రమే కాకుండా ఈ మధ్య ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్టును కూడా ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో ఇంజనీర్లకు ఎక్కడికి పోయినా అరుదైన గౌరవం లభిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా కానీ కొంత మంది కేటుగాళ్లు ఇస్రో పేరు చెప్పి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఇస్రో అంతరిక్ష కేంద్రం పేరు […]

Share:

చంద్రయాన్-3 ఎప్పుడైతే విజయం సాధించిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇస్రో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇస్రో కీర్తిని పొగుడుతున్నారు. అది మాత్రమే కాకుండా ఈ మధ్య ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్టును కూడా ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో ఇంజనీర్లకు ఎక్కడికి పోయినా అరుదైన గౌరవం లభిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా కానీ కొంత మంది కేటుగాళ్లు ఇస్రో పేరు చెప్పి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఇస్రో అంతరిక్ష కేంద్రం పేరు చెప్పి అమాయకుల వద్ద నుంచి కోట్లలో రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ షాక్ కు గురయ్యారు. అరే మరీ ఇలా కూడా చేస్తారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

సైబర్ నేరగాళ్లకు అడ్డేది?? 

దేశంలో ఏ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే దానిని అడ్డు పెట్టుకుని సామాన్యులను మోసం చేయడం సైబర్ మోసగాళ్లకు అలవాటు అటువంటిది ప్రస్తుతం ఇస్రోను అడ్డుపెట్టుకుని మోసాలు చేస్తున్నారు. రూపాయి కాదు రెండు కాదు కొంత మంది మోసగాళ్లు పూనేకు చెందిన వ్యక్తిని ఏకంగా రూ. కోటికి మోసం చేశారు. ఈ మోసం లేటుగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేటుగాళ్ల మీద కేసులు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే… 

పూనేకు చెందిన ఓ 40 సంవత్సరాల రైతును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అతడు సామాన్యుడు చదువు రాని వాడు కూడా కాదు. ఆ వ్యక్తికి సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా ఉంది. అంతటి వ్యక్తినే చీటర్స్ మోసం చేశారు. అటువంటి వ్యక్తికి కూడా 250 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రాంజ్ కుండ అని చెప్పి మోసం చేశారు. ఈ కుండను కలిగి ఉంటే ఇస్రో దానిని దాదాపు రూ. 200 కోట్లకు కొంటుందని నమ్మబలికారు. ఆ వ్యక్తి వద్ద నుంచి విడతల వారీగా రూ. 1.13 కోట్లను వసూలు చేశారట. 2014-2018 మధ్య ఈ తతంగం మొత్తం నడిచింది. అంతే కాకుండా అతడు ఈ కుండ మీద పరీక్షల కోసం కొంత మొత్తం వెచ్చించాడట. ఇక చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 

అనుమానితులపై కేసులు

దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం నలుగురిని చీటర్స్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లోహెగావ్‌కు చెందిన రఫీక్ తంబోలిని  గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని బారామతి సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తైడే పేర్కొన్నారు. అలాగే కొంధ్వాకు చెందిన షిరాజ్ షేక్ పన్సారే, లాతూర్ జిల్లాకు చెందిన ఉమేష్ ఉమాపురే, సాంగ్లీకి చెందిన ధనాజీ పాటిల్ వారి కోసం గాలింపు చేపట్టినట్లు కూడా తెలిపారు. 

పెరుగుతున్న మోసాలు

ఇస్రో పేరు ప్రస్తుతం మార్మోగడంతో దానిని అడ్డం పెట్టుకుని మోసాలు చేసే వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకోసం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇస్రో అది చేస్తుంది ఇది చేస్తుంది అని అంటే ఎవరూ నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఇస్రో ఎటువంటి పని చేసినా కానీ మొత్తం సమాచారం ఇస్రో అఫిషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని తెలుపుతున్నారు. అవసరం అయితే ఆ వెబ్సైట్ ను ఫాలో కావాలని ఇస్రో ఏం చేస్తుందనేది మొత్తం తెలుస్తుందని, అంతే కానీ ఇటువంటి కేటుగాళ్ల మాయలో పడి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఇటువంటి కేటుగాళ్లు దేశంలోని ఏదో ఒక మూలలో రెచ్చిపోతూనే ఉన్నారు. ఎటువంటి జ్ఞానం లేని అమాయకులతో పాటు జ్ఞానం ఉన్న వారిని కూడా మోసం చేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు.