రాఖీ కట్టేందుకు 8 కిమీ న‌డిచిన‌ బామ్మ

అన్నా చెల్లెల అనుబంధం జన్మజన్మల సంబంధం అంటూ ఒక రచయిత రాసిన పాట అక్షరాలా నిజం. జీవితంలో ఎంత హడావిడిలో ఉన్నా, సంపాదించే క్రమంలో మన బంధాలను మాత్రం మర్చిపోకూడదు. సంవత్సరంలో ఒక్కరోజైనా సరే తమ అన్నదమ్ములను కలుసుకునేందుకు చెల్లెలు ఆప్యాయంగా పలకరించేందుకు రాఖీ పండుగ సందర్భంగా చాలా మంది దూర దేశాల నుంచి కూడా రావడం జరిగింది.  రాఖీ కట్టేందుకు కాలినడకన 8 కిలోమీటర్లు:  రాఖీ పండుగ సందర్భంగా బక్కవ్వ అనే 80 సంవత్సరాల వృద్ధురాలు […]

Share:

అన్నా చెల్లెల అనుబంధం జన్మజన్మల సంబంధం అంటూ ఒక రచయిత రాసిన పాట అక్షరాలా నిజం. జీవితంలో ఎంత హడావిడిలో ఉన్నా, సంపాదించే క్రమంలో మన బంధాలను మాత్రం మర్చిపోకూడదు. సంవత్సరంలో ఒక్కరోజైనా సరే తమ అన్నదమ్ములను కలుసుకునేందుకు చెల్లెలు ఆప్యాయంగా పలకరించేందుకు రాఖీ పండుగ సందర్భంగా చాలా మంది దూర దేశాల నుంచి కూడా రావడం జరిగింది. 

రాఖీ కట్టేందుకు కాలినడకన 8 కిలోమీటర్లు: 

రాఖీ పండుగ సందర్భంగా బక్కవ్వ అనే 80 సంవత్సరాల వృద్ధురాలు కొత్తపల్లి గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన తన తమ్ముడు ఉండే కొండయ్య పల్లి చేరి రక్షాబంధన్ నాడు తాను ఎంతో ఆప్యాయంగా చూసుకునే తమ్ముడికి రాఖీ కట్టి సంతోషాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం 80 సంవత్సరాల వృద్ధురాలు రాఖీ కట్టేందుకు ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కాలి నడకన వెళ్తున్న దారిలో, ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ బామ్మ ని అడగగా.. ఆమె తన తమ్ముడిని కలవడానికి రాఖీ కట్టేందుకు వెళుతున్నానని, కాలినడకన ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. తన తమ్ముడు పేరు గౌడ మల్లేషమని, ప్రతి రాఖీ పండక్కి తాను కాలినడకన తన తమ్ముడు నివసిస్తున్న కొండయ్య పల్లి వెళ్లి రాఖీ కడుతుందని చెప్పింది. ఇలా ఒక అక్క తన తమ్ముడి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. 

తమ్ముడికి కిడ్నీ దానం ఇచ్చిన అక్క: 

రాయపూర్ త్రిక్రపార ప్రాంతంలో నివసిస్తున్న షీలా బాయ్ పాల్ అనే మహిళకు, తన తమ్ముడు ఓం ప్రకాష్ అంటే అపారమైన ప్రేమ. అయితే గత సంవత్సరం ఓం ప్రకాష్ దంగర్కు కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే ఒక కిడ్నీ 80 శాతం డామేజ్ అయినట్లు. మరొకటి 90% వరకు డ్యామేజ్ అయిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక ఆయన బ్రతకాలంటే కేవలం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ మాత్రమే మార్గం అంటూ హాస్పటల్ ఇచ్చిన సలహాను కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా గుజరాత్ లో ఉన్న ఒక హాస్పిటల్ లో చేర్పించారు. 

కానీ ఓం ప్రకాష్ కు సరిపోయే కిడ్నీ దొరకడం కష్టమని కిడ్నీ దాతలు ముందుకు వస్తే తప్పిస్తే ఓం ప్రకాష్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరపడం కుదరదని చెప్పారు డాక్టర్లు. ఇంకేముంది తమ్ముడు అంటే అపారమైన ప్రేమ ఉన్న షీలా బాయ్ తన కిడ్నీ ఇచ్చేందుకు స్వతహాగా ముందుకొచ్చింది. కుటుంబ సభ్యులు కూడా తమ్ముడు మీద ఉన్న అక్క ప్రేమను చూసి చలించిపోయారు. డాక్టర్లు షీలాబాయికి పరీక్షలన్నీ చేశారు, మొత్తం పరీక్షలు చేయగా, ఆమె కిడ్నీ తన తమ్ముడికి సరిపోతుంది అనే సంతోషకరమైన వార్త చెప్పారు. 

అయితే సంవత్సరం నుంచి బాధపడుతున్న ఓం ప్రకాష్ ఎట్టకేలకు కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం దొరికింది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం డాక్టర్లు సెప్టెంబర్ 3న ఆపరేషన్ జరుగుతుందని చెప్పగా.. ఓం ప్రకాష్ అలాగే తన అక్క షీలా బాయ్ గుజరాత్ లో సర్జరీ కోసం వేచి ఉన్నారు. ఈ రక్షాబంధన్ నాడు, తన తమ్ముడికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి తన ప్రేమను చాటి చెప్పింది షీలాబాయి. అంతేకాకుండా తన తమ్ముడంటే తనకి ఎంతగానో ఇష్టమని తను సంతోషంగా నూరేళ్లు జీవించాలని తను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడిందని చెప్పకువచ్చింది. రక్షాబంధన్ నాడు ప్రత్యేకించి షీలా బాయ్ అలాగే తన తమ్ముడు ఓం ప్రకాష్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు. అంతేకాకుండా తన తమ్ముడికి రక్షాబంధన్ కట్టి తను నూరేళ్లు సంతోషంగా ఉండాలని దీవించింది అక్క.