పులుల జనాభాలో 75% భారత్ లోనే

భారతదేశంలో 2018 నుండి 2022 కాలంలో పులుల సంఖ్య 23.5% పెరిగింది. దీంతో భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 3682 కు చేరుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 785 పులులు ఉండగా కర్ణాటక లో 563, మహారాష్ట్ర లో 444 పులులు ఉన్నాయి. 2006 లో భారతదేశంలో 1411 పులులు ఉండగా 2018 లో 2197 పులులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన అంచనా ప్రకారం అప్పటికి […]

Share:

భారతదేశంలో 2018 నుండి 2022 కాలంలో పులుల సంఖ్య 23.5% పెరిగింది. దీంతో భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 3682 కు చేరుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 785 పులులు ఉండగా కర్ణాటక లో 563, మహారాష్ట్ర లో 444 పులులు ఉన్నాయి. 2006 లో భారతదేశంలో 1411 పులులు ఉండగా 2018 లో 2197 పులులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన అంచనా ప్రకారం అప్పటికి 3167 పులులు ఉన్నాయి. 

మధ్య భారతం మరియు పశ్చిమ కనుమలలోనే 2526 పులులు ఉన్నట్లు, రాష్ట్రాల వారీగా అంచనా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక పులి సాంద్రత కలిగిన ప్రాంతంగా ఇవి నిలిచాయి. గ్లోబల్ టైగర్ ఫోరం (GTF) గణాంకాల ప్రకారం భారత్ మరియు నేపాల్ దేశాల్లో పులుల సంఖ్య రెట్టింపు అవుతుంది అని తెలిసింది. నేషనల్ పార్కు ల పరంగా చూస్తే ఉత్తరాఖండ్ లోని కార్బెట్ నేషనల్ పార్క్ లో అత్యదికంగా 260 పులులు, అస్సాం లోని కాజిరంగా నేషనల్ పార్క్ లో 104 పులులు ఉన్నాయి. అత్యంత పులుల సాంద్రత కలిగిన టైగర్ రిజర్వ్ లుగా ఈ రెండు కొనసాగుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా 2016 సంవత్సరంలో 3890 పులులు ఉండగా 2023 నాటికి ఆ సంఖ్య 5575 కు పెరిగింది. అయితే వీటిలో దాదాపుగా 3167 పులులు ( Tigers )భారతదేశంలోనే ఉండడం గమనార్హం. పులుల సంరక్షణ కు భారత ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటుంది. NTCA నివేదికల ఆధారంగా పులుల ఆవాసాలకు దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు కొత్త చోటుకు మార్చబడ్డాయి. 

ఉత్తరాది రాష్ట్రాల్లో పులుల సంఖ్య పెరుగుతూ ఉండగా దక్షిణాది రాష్ట్రాలు అయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో వీటి సంఖ్య క్షీణించడం ఆందోళనకరంగా ఉంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో టైగర్ రిజర్వ్ ల బయట పులుల సంఖ్య తగ్గుతూ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ శాతం మాత్రమే వృద్ది కనిపించింది. 

టైగర్ రిజర్వ్ (Tiger Reserve) ప్రాంతంలో మానవుల సంచారాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది, టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న కుటుంబానికి పునరావాసం కల్పించడం కోసం 15 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. ప్రపంచంలో ఇలాంటి పథకం అందించే ఏకైక దేశం భారతదేశం మాత్రమే. అటవీ విస్తీర్ణం పెరగడం కూడా పులుల పెరుగుదల కు తోడ్పడుతుంది అని ఉత్తరాఖండ్ లోని అటవీ ప్రధాన సంరక్షణ అధికారి పరాగ్ మధుకర్ వెల్లడించారు. 

భారత ప్రభుత్వం పులుల సంరక్షణ చర్యలు చేపట్టిన తర్వాత ఇప్పుడు చిరుత పులుల సంరక్షణ చర్యలు కూడా చేపట్టింది, విదేశాల నుండి కొన్ని చిరుతలను తీసుకుని రాగా వాటిలో కొన్ని అనారోగ్య కారణాలతో మరణించాయి. ప్రస్తుతం ఆ కారణాలను విశ్లేషిస్తున్నారు చిరుత పులుల సంరక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు.