Uttarakhand: 70 గంటలు గడిచినా వీడని ఉత్కంఠ..

కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన

Courtesy: Canva

Share:

Uttarakhand: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్(Tunnel) ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్లు(Rescue team) అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు(Landslides) విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది. దీంతో టన్నెల్(Tunnel) బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది.

సొరంగం(Tunnel)లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకురావడానికి సొరంగం లోపల 900 ఎంఎం పైపును అమర్చడం ద్వారా మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం మూడు రోజులుగా జరుగుతోంది. టన్నెల్‌‌ను బ్లాక్ చేసిన 21 మీటర్ల శ్లాబ్ను తొలగించినప్పటకీ, 19 మీటర్ల పాసేజ్ను ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్కు అవసరమైన కొత్త డ్రిల్లింగ్ మిషన్(Drilling mission), ఇతర సామగ్రిని న్యూఢిల్లీ నుంచి ఎయిర్ లిఫ్ట్(Air lift) ద్వారా రప్పించే చర్చలు చేపట్టారు.

టన్నెల్లోకి చెత్తాచెదారం వస్తూనే ఉంది.. సొరంగంలోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోకి చెత్తా చెదారం(Garbage spread) నిరంతరం వచ్చి చేరుతోంది. దీంతో సొరంగంలోని చెత్తాచెదారాన్ని శుభ్రపరిచే పని కూడా దెబ్బతింటోంది.దీనికి ముందు, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులందరినీ బుధవారం కల్లా సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ఉత్తరాఖండ్ జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ రుహెలా(Abhishek Ruhela) చెప్పారు. అయితే, మంగళవారం రాత్రి తిరిగి కొండచరియలు విరిగిపడటంతో కొత్త డ్రిల్లింగ్ మిషన్తో తిరిగి పనులు చేపట్టబోతున్నట్టు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) తెలిపింది. దీంతో సహాయక పనుల్లో జరుగుతున్న జాప్యంతో పలువురు కార్మికుల కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాకీటాకీతో రెస్క్యూ సిబ్బంది(Rescue team) సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడామని, సుమారు ఐదు నుండి ఆరు రోజులు జీవించేందుకు సొరంగం విభాగంలో తగినంత ఆక్సిజన్ ఉందని ఎస్డీఆర్ఎఫ్(NDRF) అధికారి రంజిత్ కుమార్ సిన్హా(Ranjit Kumar Sinha) చెబుతున్నారు.

మంగళవారం మిషన్బిగించిన అనంతరం జల్నిగమ్ఇంజినీర్లు(Jal Nigam Engineers) రాత్రి 9.15 గంటల ప్రాంతంలో యంత్రంతో డ్రిల్లింగ్‌(Drilling) ప్రారంభించగా, చెత్తాచెదారం రావడంతో కొంతసేపటి తర్వాత ఆపాల్సి వచ్చింది. సొరంగంలోని శిథిలాలను తొలగించిన తర్వాత మళ్లీ యంత్రాన్ని ప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి సొరంగంలో చిక్కుకున్న కూలీల్లో కొందరి ఆరోగ్యం(Health) విషమించినట్లు సమాచారం. జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం.. చిక్కుకున్న కూలీల్లో జార్ఖండ్‌‌ (15 మంది), యూపీ(8 మంది), ఒడిశా(ఐదుగురు), బీహార్‌‌ (నలుగురు), బెంగాల్‌‌ (ముగ్గురు), యూపీ(ఇద్దరు), అస్సాం(ఇద్దరు), హిమా చల్‌‌ ప్రదేశ్‌‌ (ఒకరు) వారు ఉన్నారు.

రెస్క్యూ సిబ్బంది(Rescue personnel) పని స్టార్ట్ చేసిన వెంటనే.. ముందుగా ఆక్సిజన్‌‌ను లోపలికి సరఫరా చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఆదివారం రాత్రంతా విశ్రాంతి లేకుండా పనిచేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తొలుత కార్మికులతో వైర్‌‌‌‌లెస్‌‌ ద్వారా కమ్యూనికేట్ అయినట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్(Circle Officer Prashant Kumar) చెప్పారు. పైన తాగు నీటిని, కొద్దిపాటి ఆహారాన్ని సరఫరా చేయడానికి మార్గం ఏర్పాటు చేశారు.

అధికారులు ఎప్పటికప్పుడు వాకీటాకీలో కార్మికులతో మాట్లాడారు. ఆహారం, నీరు, ఆక్సిజన్, ఎలక్ట్రిసిటీని సరఫరా చేస్తున్నారు. తాము సురక్షితంగా ఉన్నామని వర్కర్లు చెబుతున్నారని ఎన్‌‌హెచ్‌‌ఐడీసీఎల్(NHIDCL) తెలిపింది. ‘‘అందరూ సేఫ్‌‌గానే ఉన్నారు. అందరినీ సేఫ్గా తీసుకొచ్చేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. మాకు ప్లాన్ , ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాంఅని ఎన్‌‌హెచ్‌‌ఐడీసీఎల్ డైరెక్టర్ అన్షు మనీశ్ ఖాల్కో(Anshu Manish Khalko) తెలిపారు.