పక్క దారిలో స్కూల్ అడ్మిషన్స్

అయితే చదువు అనేది ప్రతి ఒక్కరికి సమానమని మనకు తెలుసు. అదే కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టి, చదువుకోలేని స్తోమత ఉన్న విద్యార్థులు, స్కూల్స్ పెట్టే అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఒకవేళ పాస్ అయితే వారికి అందులో సీటు దొరుకుతుంది. అంటే ఉచితంగా చదువుకోవడం లేదంటే కట్టాల్సిన ఫీజులో కొంత మొత్తంలో కోట ప్రకటించడం జరుగుతుంది. అయితే కొంతమంది సంపన్న తల్లిదండ్రులు, కోటా తరుపున వచ్చే సీట్లను కూడా పక్కదారిలో సంపాదించారని […]

Share:

అయితే చదువు అనేది ప్రతి ఒక్కరికి సమానమని మనకు తెలుసు. అదే కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టి, చదువుకోలేని స్తోమత ఉన్న విద్యార్థులు, స్కూల్స్ పెట్టే అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఒకవేళ పాస్ అయితే వారికి అందులో సీటు దొరుకుతుంది. అంటే ఉచితంగా చదువుకోవడం లేదంటే కట్టాల్సిన ఫీజులో కొంత మొత్తంలో కోట ప్రకటించడం జరుగుతుంది. అయితే కొంతమంది సంపన్న తల్లిదండ్రులు, కోటా తరుపున వచ్చే సీట్లను కూడా పక్కదారిలో సంపాదించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

అసలు ఏం జరిగింది: 

ప్రతి ఎటా కొన్ని పాఠశాలలు విద్యార్థుల కోసం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్కూల్ నిర్వహించే ఎగ్జామ్ లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళకి కోటా తరుపున అడ్మిషన్ కూడా లభిస్తుంది. కేవలం ఉత్తీర్ణులైన వాళ్లకి మాత్రమే ఈ కోట అందుబాటులో ఉంటుంది. అయితే అహ్మదాబాద్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ లో 20 మంది విద్యార్థులు స్కూల్ నిర్వహించిన RTE కోటా తరుపున ఉన్న 20 అడ్మిషన్లను ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొంత మంది తప్పుదారిలో అడ్మిషన్స్ సంపాదించుకున్నట్లు సమాచారం అందింది. 

విచారణలో ఏం తెలిసింది: 

RTE కోటా కిందకి వచ్చే కొన్ని అడ్మిషన్స్ 20 మంది విద్యార్థులకు ఆసరాగా నిలుస్తుందని స్కూల్ భావించి 20 మందికి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది పక్కదారిలో అడ్మిషన్స్ సంపాదించుకున్నారని తెలిసి ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా అడ్మిషన్స్ పొందిన విద్యార్థుల మొత్తం డీటెయిల్స్ తీసుకోగా, అసలు విషయాలు బయటపడ్డాయి. అందులో కొంతమంది విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్, అడ్మిషన్ ఎలిజిబిలిటీకి తగినది కానప్పటికీ వారికి అడ్మిషన్స్ లభించినట్లు నిజం బయటపడింది. 

అయితే అడ్మిషన్స్ పొందిన విద్యార్థుల డీటెయిల్స్ ప్రకారం, తమ తల్లిదండ్రుల ఇన్కమ్ టాక్స్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెక్ చేయడం జరిగింది. అయితే తమ పిల్లల పూర్తి డీటెయిల్స్ లో అవకతవకలు జరిగినట్లు తెలిసింది. సంపన్న తల్లిదండ్రులు తమ పిల్లల కోసం దొంగ దారిలో అడ్మిషన్స్ సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే అసలు విషయం బయటపడిన తర్వాత, స్కూల్ యాజమాన్యం ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రుల మీద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆఫీసులో అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 

విపుల్ కేశవ్‌లాల్ పర్మార్, వపరాణి సంజయ్ కుమార్ ఘనశ్యామ్, సునీల్ అనిల్ కుమార్ తల్రేజా, రాజ్‌పుత్ గణపత్సిన్హ్ కిషోసిన్, ఉపేంద్ర సింగ్ రాజేంద్ర సింగ్ రాథోడ్, ప్రియాంక్ రసిక్ ప్రజాపతి మరియు కౌశిక్ రామన్ సోలంకి మీద గాంధీనగర్ పోలీస్ స్టేషన్లోనే కాకుండా డీఈవో ఆఫీస్ లో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. 

తల్లితుండ్రుల వార్షిక ఆదాయం ఎంత ఉండాలి: 

నిజానికి RTE కోటా కింద స్కూల్ లో అడ్మిషన్ పొందేందుకు, విద్యార్థుల తల్లితండ్రుల వార్షిక ఆదాయం నిజానికి 3.5 లక్షల కన్నా తక్కువ ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 20 మంది విద్యార్థులలో ఏడుగురు విద్యార్థులకు వారి తల్లితండ్రుల ఇన్కమ్ టాక్స్ ఫైల్ చెక్ చేసిన తర్వాత, ఆ సంపన్న తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.5 లక్షలకు పైగా ఉన్నట్లు తెలిసింది. అయితే కోట ద్వారా కేవలం ఫీజులు కట్టలేని పిల్లల కోసమే అడ్మిషన్స్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కొంతమంది తల్లిదండ్రులు తమ వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ అని చెప్పి కోట ద్వారా వచ్చే అడ్మిషన్స్ సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు పబ్లిక్. అంతేకాకుండా ఇలా పక్కదారిలో కోట అడ్మిషన్ పొందుతే, అసలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న తెలివైన విద్యార్థులకు అన్యాయం చేసినట్లే అవుతుంది. అందుకే తల్లితండ్రుల మీద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు