2023లో 691 జీవిత ఖైదుల విడుద‌ల‌

హత్యకు గురైన క‌వ‌యిత్రి (పోయ‌టెస్) మధుమితా శుక్లా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి, ఆయన భార్య మధుమణి శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు. దీనికి సంబంధించి ఇటీవల, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన జైళ్ల శాఖ, 16 సంవత్సరాల శిక్షను పూర్తి చేసుకున్న దంపతులకు, ఉపశమనంపై రాష్ట్ర 2018 విధానాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ముందస్తుగా విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  విడుదలైన జీవిత ఖైదీ:  మధుమిత శుక్ల […]

Share:

హత్యకు గురైన క‌వ‌యిత్రి (పోయ‌టెస్) మధుమితా శుక్లా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి, ఆయన భార్య మధుమణి శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు. దీనికి సంబంధించి ఇటీవల, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన జైళ్ల శాఖ, 16 సంవత్సరాల శిక్షను పూర్తి చేసుకున్న దంపతులకు, ఉపశమనంపై రాష్ట్ర 2018 విధానాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ముందస్తుగా విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

విడుదలైన జీవిత ఖైదీ: 

మధుమిత శుక్ల హత్యకు సంబంధించి అమరమని త్రిపాఠి ఆయన భార్య మధుమని త్రిపాఠి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వారు శిక్ష పూర్తవకముందే వారి ఇద్దరినీ కూడా రిలీజ్ చేయాలని ఉత్తర్ ప్రదేశ్ శాఖ జైళ్ల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వారిద్దరూ రిలీజ్ అవ్వడం జరిగింది. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి గురించి అమర్మని త్రిపాఠి కొడుకు, అమ్మన్మని మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంగా ఉన్నారని, కానీ కొన్నాళ్ల వరకు డాక్టర్ల సంరక్షణలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంట గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీలో చేరారు. అమన్మణి త్రిపాఠి 2017 నుండి 2022 వరకు మహరాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. 

వృద్ధాప్యం కారణంగా ఉపశమనం: 

ఈ జంట విడుదలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా శుక్రవారం నిరాకరించింది. ఎందుకంటే, దంపతుల వృద్ధాప్యం మరియు మంచి ప్రవర్తనను కూడా కోర్టు వారికి గుర్తు చేసింది, ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ. అమరమణికి 66 ఏళ్లు, మధుమణికి 61 ఏళ్లు, ఇద్దరు విడుదలైనప్పటికీ, వారు బిఆర్‌డి మెడికల్ కాలేజీలోనే కొన్నాళ్లు ఉంటారు అని కుష్వాహ చెప్పారు. తమ తల్లిదండ్రులకు విడుదల చేసి ఉపశమనాన్ని కల్పించినందుకు కోర్టు వారికి అలాగే జైల్లో శాఖకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అమర్మని కొడుకు అమన్ మని. 

నిధి శుక్ల ఆవేదన: 

గర్భవతిగా ఉన్న మధుమితను 2003 మే 9న లక్నోలోని పేపర్ మిల్ కాలనీలో కాల్చి చంపారు దుండగులు. అయితే కొన్ని నెలలు విచారణ అనంతరం, అమరమణి త్రిపాఠి సెప్టెంబరు 2003లో మధుమితనును హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో భాగంగా మధుమిత శుక్ల సోదరీ నిధి శుక్ల న్యాయ పోరాటం కోసం తిరగని కోర్టు లేదు. శుక్రవారం దంపతులిద్దరూ విడుదలయ్యారని తెలిసిన నిధి శుక్ల, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు యావజ్జీవ శిక్షపడినప్పటికీ దంపతులిద్దరూ ఎలా విడుదలయ్యారు అంటూ మధుమిత సోదరి, నిధి శుక్ల ప్రశ్నించారు. ముందస్తు విడుదల కోసం త్రిపాఠి కుటుంబం అధికారులను తప్పుదోవ పట్టించారని కూడా ఆమె ఆరోపించారు. 

2023 లో ఉత్తరప్రదేశ్ జైలు నుంచి రిలీజ్ అయిన ఖైదీలు: 

27 ఏళ్ల ఐఐఎం లక్నో గ్రాడ్యుయేట్ మంజునాథ్‌ను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న లల్లా గిరి రిలీజ్ అయిన ఖైదీలలో ఒకరు. గిరి జనవరిలో విడుదలయ్యాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ మేనేజర్ గా పనిచేసిన మంజునాథ్ 2005 నవంబర్ 19న లఖింపూర్ ఖేరీలోని పెట్రోల్ పంపులో అవకతవకలు ఉన్నాయని గుర్తించిన తర్వాత సీల్ చేస్తానని బెదిరించడంతో, మంజునాథ్ ని కాల్చి చంపేశాడు గిరి.

మంజునాథ్ హత్య కేసులో గిరితో పాటు మరో ఏడుగురికి జీవిత ఖైదు శిక్షని అనుభవిస్తున్నారు. ప్రధాన నిందితుడు పవన్ మిట్టల్ అలియాస్ మోను మిట్టల్, ఇతర నిందితులు దేవేష్ అగ్నిహోత్రి, రాకేష్ ఆనంద్, రాజేష్ వర్మలు బరేలీ జైలులో ఉన్నారు.