ఉత్తరప్రదేశ్ ఆస్పత్రిలో 60 మంది గర్భిణీలకు HIV

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జనాభా ఈ వ్యాధి బారిన పడి, ప్రతి ఎటా చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే, ఈ వ్యాధికి సరైన చికిత్స అనేది లేకపోవడం వల్ల. ఈ వ్యాధి మరి ఏదో కాదు హెచ్ఐవి మహమ్మారి. అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఒక హాస్పిటల్లో 60 మంది గర్భిణీలకు హెచ్ఐవి సోకడం కలకలం రేపుతోంది. అసలు విషయం:  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 60 మందికి పైగా గర్భిణీ స్త్రీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా […]

Share:

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జనాభా ఈ వ్యాధి బారిన పడి, ప్రతి ఎటా చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే, ఈ వ్యాధికి సరైన చికిత్స అనేది లేకపోవడం వల్ల. ఈ వ్యాధి మరి ఏదో కాదు హెచ్ఐవి మహమ్మారి. అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఒక హాస్పిటల్లో 60 మంది గర్భిణీలకు హెచ్ఐవి సోకడం కలకలం రేపుతోంది.

అసలు విషయం: 

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 60 మందికి పైగా గర్భిణీ స్త్రీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. మహిళలకు హెచ్‌ఐవీ ఎలా సోకిందో తెలుసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గత 16 నెలల్లో 60 మంది గర్భిణీ స్త్రీలు హెచ్‌ఐవి బారిన పడినట్లు ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఆరోగ్య శాఖకు చెందిన ఒక టీం కూడా దీనిపై నిఘా ఉంచిందని అధికారి తెలిపారు.

మీరట్‌లోని లాలా లజపత్ రాయ్ మెడికల్ కాలేజ్‌లోని యాంటీ-రెట్రోవైరల్ థెరపీ (ART) సెంటర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, లాలా లజపత్ రాయ్ లో ఎప్పటినుంచో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొంతమంది 81 ప్రెగ్నెంట్ లేడీస్, ప్రస్తుతం డెలివరీకి సిద్ధంగా ఉండడంతో వారందరికీ హెచ్ఐవి పరీక్ష నిర్వహించడం జరిగింది. అందులో సుమారు 60 మంది స్త్రీలకు హెచ్ఐవి సోకినట్లు నిర్ధారించారు హాస్పిటల్ సిబ్బంది.

అయితే హాస్పిటల్ కి వచ్చినా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే హెచ్‌ఐవి-పాజిటివ్ బారిన పడినట్లు తెలిసిందో, వారిలో కనీసం 35 మంది బాధిత మహిళలు పిల్లలకు జన్మనిచ్చారు. ART సెంటర్ నివేదిక ప్రకారం, 2022-23 మధ్య, మీరట్‌లోని లాలా లజపత్ రాయ్ మెడికల్ కాలేజీలో గర్భిణీ స్త్రీలలో 33 కొత్త HIV కేసులు నమోదయ్యాయి. జూలై 2023 వరకు 13 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఇప్పుడు, 35 మంది గర్భిణీ స్త్రీలు ఇప్పటికే హెచ్‌ఐవి బారిన పడినట్లు గుర్తించారు.

బాధిత మహిళలందరూ మెడికల్ కాలేజీలోని ఏఆర్‌టీ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని, బాగానే ఉన్నారని మెడికల్ కాలేజీ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం పుట్టిన శిశువుల ఆరోగ్యం గురించి ఏఆర్‌టీ సెంటర్ నోడల్ అధికారి మాట్లాడుతూ, 18 నెలలు నిండిన తర్వాత పిల్లలకు మళ్ళీ హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

అనంతరం మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. మీరట్‌లోని లాలా లజ్‌పత్‌ రాయ్‌ మెడికల్‌ కాలేజీలో 60 మంది మహిళల్లో హెచ్‌ఐవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే అందరూ మహిళలు, అదేవిధంగా పుట్టిన పిల్లలతో సహా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం ఈ కేసు విషయంపై విచారణ జరుగుతున్న టీం ఏర్పాటు చేసిన అధికారులు మాట్లాడుతూ, బాధిత మహిళల పూర్తి వివరాలు తమ వద్ద లేవని..  బాధిత మహిళల వివరాలు, అదే విధంగా వారికి హెచ్‌ఐవి ఎలా వచ్చిందనే కారణాలను తెలుసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం అని సిఎంఓ ప్రసాద్ తెలిపారు.

HIV ఎలా వ్యాపిస్తుంది: 

మరొకరి రక్తం ఎక్కించుకోవడం ద్వారా, అక్రమ సంబంధాల కారణంగా HIV వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా ఇది సెక్స్ సమయంలో సోకొచ్చు, ఒకరికి వాడిన ఇంజక్షన్ మరొకరికి వాడడం ద్వారా, టాటూలు అంటే పచ్చబొట్లు ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ప్రసవ సమయంలో లేదా తల్లి తమకు పుట్టిన పిల్లలకు పాలివ్వడం ద్వారా కూడా తల్లి నుండి బిడ్డకు HIV సోకే అవకాశం ఉంటుంది.