రేప్ కేసు.. 58 ఏళ్ల వ్య‌క్తికి 20 ఏళ్ల శిక్ష‌

చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను క్లియర్ చేసేందుకు స్పెషల్ కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే, భవాని నగర్కి చెందిన ఒక 58 ఏళ్ల వ్యక్తికి, టి.అనిత జడ్జ్ అండర్లో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది.  శిక్ష ఎందుకు పడింది:  ఆడుతూ పాడుతూ తిరగాల్సిన విద్యార్థిని హఠాత్తుగా స్కూలుకు వెళ్ళను అని చెప్పేసరికి తల్లితండ్రులు ముందుగా మందలించినప్పటికీ తర్వాత ఆ అమ్మాయి ఎందుకు స్కూల్ కి వెళ్ళను అంటుందో […]

Share:

చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను క్లియర్ చేసేందుకు స్పెషల్ కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే, భవాని నగర్కి చెందిన ఒక 58 ఏళ్ల వ్యక్తికి, టి.అనిత జడ్జ్ అండర్లో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది. 

శిక్ష ఎందుకు పడింది: 

ఆడుతూ పాడుతూ తిరగాల్సిన విద్యార్థిని హఠాత్తుగా స్కూలుకు వెళ్ళను అని చెప్పేసరికి తల్లితండ్రులు ముందుగా మందలించినప్పటికీ తర్వాత ఆ అమ్మాయి ఎందుకు స్కూల్ కి వెళ్ళను అంటుందో ఆరా తీశారు. ఈ క్రమంలోనే అసలు నిజాలు బయట పడ్డాయి. చాలాసార్లు తమ తల్లిదండ్రులు అమ్మాయిని స్కూలుకు ఎందుకు వెళ్ళను అంటున్నావు అని అడిగినప్పటికీ సమాధానం ఇవ్వలేదు. అయితే ఒక రోజు ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని తల్లితండ్రులు షాక్ అయ్యారు. 

వారిది నిరుపేద కుటుంబం, చదివించలేని దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబంలో ఒక అమ్మాయిని చదివించేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే అక్కడే తమకు తెలిసిన వాళ్లు కూడా ఉండటంతో మరేం పర్లేదు అనుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. అయితే ఆ స్కూల్లోనే చేస్తున్న ఒక 58వ వ్యక్తి, ఆ నిరుపేద కుటుంబానికి దగ్గర బంధువు కావడంతో, స్కూల్ చదువుతున్న ఆ అమ్మాయిని పలుసార్లు తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది. అయితే చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపించి ఆ చిన్న అమ్మాయిని రేప్ చేసి వంచించాడు ఆ వ్యక్తి. 

ఆ అమ్మాయిని చాలాసార్లు ఆ పెద్దాయన తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇలా కొనసాగుతూ ఉండగా, ఒకనాడు అమ్మాయి హఠాత్తుగా స్కూల్ కి వెళ్ళను అని చెప్పడంతో తల్లితండ్రులు ఎందుకు అని ఆరా తీశారు, అప్పుడే అసలు నిజం ఆ అమ్మాయి చెప్పింది. స్కూల్లో పనిచేస్తున్న తన బంధువు తనని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు చాలా సార్లు వంచించినట్లు, తల్లిదండ్రులకు చెప్పింది. 

తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని పోలీసులు ముందు చెప్పగ. వారు ఆ 58 ఏళ్ల వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి కోర్టులో కేసు నడుస్తుండటంతో ఎట్టకేలకు, కేసు రీ ఓపెన్ చేసి 58 ఏళ్ల వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా 5,000 రూపాయల ఫైన్ విధించారు. 

అన్యాయం జరిగిన ఆ అమ్మాయికి నాలుగు లక్షల పరిహారాన్ని అందించారు. ఈ సంఘటన హైదరాబాదులో భవాని నగర్ లో చోటు చేసుకుంది. 

అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి: 

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. సహాయం చేస్తూ మరోపక్క వంచించాలనే దారుణానికి పాల్పడిన వ్యక్తికి ఎట్టకేలకు శిక్ష పడింది. కానీ ఇలా ఎన్నో చోట్ల చోటు చేసుకుంటుంది. కొన్ని సంఘటనలు బయటికి వస్తున్నాయి మరెన్నో సంఘటనలు కనుమరుగైపోతున్నాయి. అన్ని చూస్తుంటే అసలు భారతదేశం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి.

Tags :