టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లు, 10 ఉత్తమ టైగర్ నేషనల్ పార్కులు

​క్రూర మృగాలలో ముఖ్యమైనది పులి. చూపులో గాంభీర్యాన్ని, జీవనంలో రాజసాన్ని కలిగి ఉన్న ఈ జంతువు అంతరించిపోతూ ఉండడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్టు టైగర్ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలే ఈ కార్యక్రమం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మాంసాహార జంతు సంరక్షణ కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కార్యక్రమ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ పులుల కూటమిని ప్రారంభించారు. […]

Share:

​క్రూర మృగాలలో ముఖ్యమైనది పులి. చూపులో గాంభీర్యాన్ని, జీవనంలో రాజసాన్ని కలిగి ఉన్న ఈ జంతువు అంతరించిపోతూ ఉండడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్టు టైగర్ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలే ఈ కార్యక్రమం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మాంసాహార జంతు సంరక్షణ కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కార్యక్రమ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ పులుల కూటమిని ప్రారంభించారు. పులుల సంరక్షణ కార్యక్రమానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణేన్ని విడుదల చేశారు. భారతదేశంలోని 10 ఉత్తమ టైగర్ నేషనల్ పార్కులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్క్ భారతదేశంలోని ప్రధాన వన్యప్రాణి అభయారణ్యాల్లో ఒకటి. దీన్ని నాలుగు జోన్లుగా విభజించారు. అవే ముక్కి, కన్హా, కిస్లీ, సార్హి. ఈ నాలుగింటిలో ముక్కి, కన్హా అటవీ ప్రాంతాలు చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా పర్యాటకులు పులులను చూసే అవకాశం ఉంటుంది. 

​బాంధవ్‌గర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

మధ్య ప్రదేశ్‌లోని బాంధవ్‌నగర్ నేషనల్ పార్క్ లో పెద్ద పులులను చూడటానికి అనువైన ప్రదేశం. ఈ ఉద్యానవనంలోని చాలా భాగం ప్రకృతి సోయగాలతో నిండి ఉంది. ఈ ప్రకృతి దృశ్యాలన్నీ పెద్ద పులులు తిరుగాడే చోటే ఉన్నాయి. దాంతో పర్యాటకులు అడవి మధ్యలోకి వెళ్లకముందే పులులను చూసే వీలు ఉంటుంది. 

ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛతీస్‌గఢ్‌లోని టాప్ 3 టైగర్ హాట్ స్పాట్‌లలో ఒకటి. డిసెంబర్‌లో పులులను గుర్తించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ ఉద్యానవనం మంచి ప్రజాదరణ పొందింది. సుదూర ప్రాంతాల నుండి సందర్శకులు కూడా ఇక్కడికి వస్తారు.

​రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్

రాజస్థాన్‌లోని రణథంబోర్ జాతీయ ఉద్యానవనం కూడా ప్రధాన పులుల సంరక్షణా అభయారణ్యాల్లో ఒకటి. ఇక్కడ పులుల సంఖ్య ఎక్కువ ఉంటుందని వినికిడి. రణతంబోర్ నేషనల్ పార్క్‌లో సఫారీ రైడ్ చేస్తే పర్యాటకులు తప్పకుండా పెద్ద పులులను దగ్గరి నుండి చూసే అవకాశం ఉంది. 

గిర్ నేషనల్ పార్క్, గుజరాత్

 గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించడం ద్వారా గంభీరమైన సింహాలు, పులులు, సమృద్ధిగా ఉన్న జాతులను మీరు చూడాలనుకున్నప్పుడు ఈ నేషనల్ పార్క్ కి తప్పకుండా వెళ్ళండి.  ఇది మీ జీవితంలోని అత్యంత ఉత్కంఠభరితమైన సాహసాల కోసం సిద్ధం చేసుకోండి.

​తడోబా – అంధేరి టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని తడోబా – అంధేరీ పులుల సంరక్షణా కేంద్రాన్ని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. టైగర్స్ ను చూడాలనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ ప్లేస్ అంత గొప్పగా ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది.

సత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

సాత్పురా నేషనల్ పార్క్ పులుల కేంద్రాలలో ఒకటి, కానీ ఆశ్చర్యకరంగా అద్భుతమైన పులుల జనాభాకు నిలయంగా ఉంది. శక్తివంతమైన పులులతో పాటు ఇసుకరాయి శిఖరాలు, గోర్జెస్, లోయలు  అడవులతో కూడిన అద్భుతమైన భూభాగాన్ని కూడా మీరు చూడవచ్చు. ఈ ప్రదేశం రమణీయంగా ఉంటుంది.

​పిలిభిత్ టైగర్ రిజర్వ్, ఉత్తరప్రదేశ్

ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో అత్యధిక పులులు కలిగిన ప్రసిద్ధ అభయారణ్యంగా పేరొందింది. ఇక్కడ పులులు సంఖ్య ఎక్కువగా ఉండడంతో కోర్ జోన్ బయట నుంచి కూడా పులులను చూడొచ్చనే సమాచారం. ఇక్కడి పులులను చెరకు పులులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి చెరకు తోటల్లో కనిపిస్తాయని వినికిడి. 

పెంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

పెంచ్ నేషనల్ పార్క్ రాష్ట్రంలోని పెంచ్ నది నుండి దాని పేరు వచ్చింది. ఇటీవల జాతీయ పార్కు నుండి అద్భుతమైన వన్యప్రాణుల అభయారణ్యంగా మార్చారు. ఈ ఉద్యానవనం పులుల జాతులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 40 పులుల జాతులు ఉండడంతో ప్రసిద్ధి చెందింది. సాహసోపేతమైన పులులను గుర్తించే అనుభవానికి ఉత్తమ సమయం డిసెంబర్ నెల.

​జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్: 

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా అత్యంత అరుదైన అభయారణ్యం. ఈ ఉద్యానవనం కూడా పలు జోన్లుగా విభజించారు. ఇక్కడ  మీరు పెద్దపులులను చూసే అవకాశం ఉంటుంది. అయితే, అన్ని జోన్లలోనూ పులులు కనిపించవు. జిమ్‌కార్బెట్‌లో మీరు పులులను చూడాలంటే ధికాలా, బిజ్రానీ జోన్లకు వెళ్లాల్సిందే.