ఐదు రాష్ట్రాలలో నవంబర్ నుంచి ఎన్నికలు జరిగే అవకాశం

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రానున్న 2 రోజుల్లో సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  నవంబర్ నుంచి ఎన్నికలు జరిగే అవకాశం:  రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 మరియు 10 మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ వర్గాలు తెలిపాయి. […]

Share:

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రానున్న 2 రోజుల్లో సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

నవంబర్ నుంచి ఎన్నికలు జరిగే అవకాశం: 

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 మరియు 10 మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ వర్గాలు తెలిపాయి. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలు 2018లో ఎన్నికల మాదిరిగానే, ఒకే దశలో ఓటు వేయచ్చని EC వర్గాలు తెలిపాయి.

మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండచ్చు. అక్టోబర్ 10 నుంచి 15 మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మిజోరాం శాసన సభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగియనున్నాయి

కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తెలంగాణలో పాలించగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల సన్నాహాలను EC పరిశీలించింది.

ఎన్నికల కసరత్తు సజావుగా సాగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం శుక్రవారంసమావేశాన్ని ఏర్పాటు చేసింది. జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాట్లాడడం జరిగింది. 

జ‌మిలి ఎన్నిక‌లలు:

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జ‌మిలి ఎన్నిక‌లు 2024లో కాకుండా 2029లో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే జ‌మిలి ఎన్నిక‌ల ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. 2024లోనే జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని బీజేపీ ప్లాన్ వేసింది. కానీ ఇది అంత సులువు కాదు. రాజ్యాంగ ప‌రంగా ఎన్నో స‌వ‌ర‌ణ‌లు చేస్తేనే జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది.

లోక్‌సభ, అసెంబ్లీలు మరియు స్థానిక ఉమ్మడి ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి లా ప్యానెల్ ఒక ముందస్తు వినూత్న మెకానిజం రూపొందిస్తున్నట్లు, ఇప్పుడు ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు నిర్వహిస్తున్న దాదాపు ఒకే విధమైన కసరత్తు విషయంలో ఖర్చు తగ్గించడానికి అదే విధంగా, ఎక్కువ మంది వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా తగ్గించేందుకు ఆలోచన జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. .

కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కానందున ఏకకాల ఎన్నికలపై లా కమిషన్ నివేదిక పూర్తిగా రావడానికి సమయం పట్టొచ్చు అని పేర్కొన్నారు. 2029 నుండి రాష్ట్ర మరియు లోక్‌సభ ఎన్నికలు రెండూ కలిసి నిర్వహించేలా వివిధ అసెంబ్లీ ఎన్నికలను సమకాలీకరించడానికి, జస్టిస్ రీతూ రాజ్ అవస్థి ఆధ్వర్యంలోని కమిషన్, శాసనసభల పదవీకాలాన్ని తగ్గించడం లేదా పెంచే అవకాశం ఉందని వెల్లడించారు.

పదేపదే పోలింగ్ బూత్‌లకు వెళ్లే పని లేకుండా: 

లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను సమకాలీకరించిన తర్వాత, రెండు ఎన్నికలకు ఓటు వేయడానికి ఓటర్లు కేవలం ఒక్కసారి మాత్రమే పోలింగ్ బూత్‌లకు వెళ్లేలా చూసేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించారు. అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలు దశలవారీగా జరుగుతుండడం వల్ల, రెండు ఎన్నికల కోసం ఓటర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసేందుకు కమిషన్ విధివిధానాలను రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు.