ఒకే రోజు 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క రోజులోనే 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. భారతీయ రైల్వే ఒకేరోజులో 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి. గతంలో ఒకేరోజు 2 వందే భారత్ రైళ్లను  ప్రారంభించిన రికార్డ్ ఉంది. ఈసారి ఏకంగా 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించింది భారతీయ రైల్వే. మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ భోపాల్ లోని రాణి కళాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ రైళ్లను […]

Share:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క రోజులోనే 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. భారతీయ రైల్వే ఒకేరోజులో 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి. గతంలో ఒకేరోజు 2 వందే భారత్ రైళ్లను  ప్రారంభించిన రికార్డ్ ఉంది. ఈసారి ఏకంగా 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించింది భారతీయ రైల్వే. మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ భోపాల్ లోని రాణి కళాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా, మరో మూడు రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో రెండు, కర్ణాటకలో ఒకటి, బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఒక రైలు, ముంబై గోవా రూట్ లో మరో వందే భారత్  రైలును ప్రారంభించారు . ఇప్పటివరకు భారతదేశంలో 18 వందే భారత్ రైళ్లు తిరుగుతుండగా తాజాగా ప్రారంభించిన 5 వందే భారత్ రైళ్లతో ఈ సంఖ్య 23 కి చేరుకుంది.

అత్యాధునిక సదుపాయాలు కలిగిన సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒకే రోజు 5 వందే భారత్ రైలు పట్టాలెక్కయి. మధ్యప్రదేశ్ రాజధానిలో ప్రధాని మోదీ జండా ఊపి వీటిని ప్రారంభించారు. పలు రాష్ట్రాలలోనే ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగు భాయ్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్ ,జ్యోతి ఆదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి భోపాల్ ఎయిర్పోర్ట్ నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కు ప్రధాని హెలికాప్టర్లో రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు . దాంతో రోడ్డు మార్గం ద్వారా ఆయన స్టేషను చేరుకున్నట్లు భాజపా రాష్ట్ర మీడియా ఇంచార్జ్ ఆశిష్ అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకేసారి రెండు వందే భారత్ రైలు ప్రారంభించడంతో ప్రాధాన్యత నెలకొంది.

తాజాగా ప్రారంభమైన వందే భారత్ రైళ్ల రూట్స్ చూస్తే.. మధ్యప్రదేశ్లో ఒకేరోజు రెండు వందే భారత్ రైలు ప్రారంభమయ్యాయి. భోపాల్ జబల్పూర్ ,  భోపాల్ ఇండోర్ వరకు 2 వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ భూపాల్ వందే భారత్ ట్రైన్ అందుబాటులో ఉంది. కర్ణాటకలో రెండో వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు బెంగళూరు నుంచి హుబ్లీ మీదగా ధార్వాడ్ వరకు వెళ్తుంది.  ముంబై గోవా మధ్య వందే భారత్ రైలు ప్రారంభం అయింది. ముంబై గోవా వందే భారత్ ట్రైన్ ఇప్పటికే ప్రారంభం కావలసి ఉండగా ఒడిశా రైలు ప్రమాదం కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ముంబై నుంచి గాంధీనగర్, సోలాపూర్ ,సాయి నగర్ షిరిడి , నాగపూర్ బిలాస్ రోడ్లలో వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి.

ఇక బీహార్ జార్ఖండ్లకు ఇదే మొదటి బందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది రాంచి రూట్ లో వందే భారత్ ట్రైన్ ప్రారంభమైంది. ఈ రెండు నగరాల మధ్య 6 గంటల్లో ప్రయాణించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖపట్నం, సికింద్రాబాద్ తిరుపతి రూట్ లలో వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి.