గుజరాత్ లో భవనం కూలి ఐదుగురు దుర్మరణం

శుక్రవారం గుజరాత్ జామ్నగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పెద్ద మూడంతస్తుల భవనం కూలి పిల్లవాడితో సహా నలుగురు చనిపోవడం జరిగింది. మొత్తం ఇందులో 10 మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ముగ్గురుని శిథిలాల కింద నుంచి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటికి తీయడం జరిగింది. మూడు అంతస్తుల భవనం కూలిన వెంటనే అందులోంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఐదుగురిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చారు.  అధికారులు చెప్తున్న దాన్నిబట్టి ఈ భవనం 30 సంవత్సరాల క్రితం […]

Share:

శుక్రవారం గుజరాత్ జామ్నగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పెద్ద మూడంతస్తుల భవనం కూలి పిల్లవాడితో సహా నలుగురు చనిపోవడం జరిగింది. మొత్తం ఇందులో 10 మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ముగ్గురుని శిథిలాల కింద నుంచి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటికి తీయడం జరిగింది. మూడు అంతస్తుల భవనం కూలిన వెంటనే అందులోంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఐదుగురిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చారు. 

అధికారులు చెప్తున్న దాన్నిబట్టి ఈ భవనం 30 సంవత్సరాల క్రితం నాటిది. కానీ ఇటువంటి సంఘటన జరగడం నిజంగా గమనార్హం అని చెప్పుకోవాలి. 

అసలు భవనాలు ఎందుకు కుప్పకూలుతున్నాయి: 

భవనాలు అకస్మాత్తుగా కుప్పకూలడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఇందులో ముఖ్య కారణం పురాతన భవనం అయి ఉంటే కూలిపోయేటప్పుడు సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు కారణంగా పాత భవనాలు నానిపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోవచ్చు. ఒక్కోసారి పాత భవనాలు కాకుండా, నెల, రెండు నెలల ముందు కట్టిన భవనాలు కూడా కూలిపోవడానికి గల కారణం నాసిరకం మెటీరియల్ వాడి బిల్డింగ్ కట్టడం. ఏది ఏమైనప్పటికీ బిల్డింగ్ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలం ఇంకా రాకముందే పురాతన భవనాల్లో ఉండేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్డింగ్ పైకప్పు మీద లేదంటే, పక్కన గోడలకి, ఎక్కడైనా పగుళ్ళు ఏర్పడినట్లయితే, వాటిని బాగు చేసుకోవడం ఎంత ఉత్తమం. ఎందుకంటే వర్షాలు కురవడం కారణంగా, ముఖ్యంగా ఈ పగుళ్ల ద్వారా నీరు చేరి, బిల్డింగ్ని బలహీనపరిచే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా మరీ పురాతనమైన భవనాలైతే గనక తప్పకుండా రనోవేషన్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం. 

ఎందుకంటే, చిన్న చిన్న తప్పులు రేపు పెద్ద పెద్ద ప్రమాదానికి కారణం అవ్వచ్చు, ప్రాణాలు మీదకి తెచ్చుకోవడం కంటే వర్షాకాలం ముందుగానే చిన్న చిన్న మరమ్మత్తులు చేసుకోవడం ద్వారా, ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. చాలామంది చిన్న చిన్న విషయాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎండాకాలంలోనే బిల్డింగ్ మరమ్మతులు చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఎండాకాల సమయంలో ప్రతి ఒక్క ఇంటి పైకప్పు బాగా పొడిగా అయిపోవడం కారణంగా, వర్షం పడగానే వెంటనే పైకప్పు నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా పైకప్పు మీద పెయింట్ వేసుకోవడం ద్వారా కూడా నీటిని పీల్చుకోకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా పైకప్పు నీరు పీర్చడం కారణంగానే బిల్డింగ్ ఒక్కోసారి బలహీనపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఛాన్స్ తీసుకోకుండా వర్షాలు కురవక ముందే బిల్డింగ్ అణువణువు చెక్ చేసుకోవడం, ఒకవేళ పైకప్పు రెనోవేషణ్ అవసరం ఉంటే తప్పకుండా చేయించుకోవడం చేయాలి. చాలామంది డబ్బు విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు, కానీ ఎంత లేట్ చేస్తే ప్రాణానికి అంత ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. రెనోవేషణ్ కి సంబంధించి, ముందు నుంచే ఒక ప్లాన్ వేసుకోవాలి, దానికోసం సేవింగ్స్ కూడా ఉండడం మంచిది. ఈ వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో కాస్త లోన్ తీసుకొని ఇంటిని బాగు చేయించుకోవడం కూడా మంచి ఆలోచన. ఎందుకంటే, డబ్బు తిరిగి వస్తుంది కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు.