శ్రీశైలం దేవాలయానికి 4500 ఎకరాలు

50 ఏళ్ల పోరాటం తర్వాత 4,500 ఎకరాల భూమి.. ఏపీలోని రెండవ అత్యంత ధనిక దేవాలయం ఇదే 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండో ధనిక దేవాలయానికి ఎట్టకేలకు 4,500 ఎకరాల భూమి లభించింది. శ్రీశైలం దేవస్థానానికి రూ.2,000 కోట్లకు పైగా విలువైన 4,500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అంగీకరించింది. రాష్ట్రంలో తిరుమల తర్వాత శ్రీశైలం ఆలయం రెండో ధనిక దేవాలయంగా ఉంది. ఇది నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ […]

Share:

50 ఏళ్ల పోరాటం తర్వాత 4,500 ఎకరాల భూమి..

ఏపీలోని రెండవ అత్యంత ధనిక దేవాలయం ఇదే

50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండో ధనిక దేవాలయానికి ఎట్టకేలకు 4,500 ఎకరాల భూమి లభించింది. శ్రీశైలం దేవస్థానానికి రూ.2,000 కోట్లకు పైగా విలువైన 4,500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అంగీకరించింది. రాష్ట్రంలో తిరుమల తర్వాత శ్రీశైలం ఆలయం రెండో ధనిక దేవాలయంగా ఉంది. ఇది నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతంలో ఉంది. ఆలయ సమీపంలోని విలువైన భూమిపై హక్కుల కోసం గత ఐదు దశాబ్దాలుగా అటవీ శాఖ, ఎండోమెంట్ శాఖ మధ్య పరస్పర పోరు నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వివాదాస్పద స్థలంపై ఆలయ యాజమాన్యానికి హక్కులు ఉన్నట్లు రుజువు చేసే కొన్ని చారిత్రక రికార్డులు చూపించారు. దశాబ్దాల నాటి వివాదాన్ని పరిష్కరించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ వివాదంతో సెటిల్‌మెంట్‌కు గానీ, అటవీశాఖకు గానీ ప్రయోజనం లేదని తెలిపారు.

హైటెక్ సర్వే

వివాదాన్ని పరిష్కరించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై మధు సూదన్ రెడ్డి రాష్ట్ర సీనియర్ అధికారులను నియమించారు. దీంతో పాటు ఆలయ వాస్తవాలను తెలుసుకునేందుకు పురావస్తు శాఖ సహాయాన్ని కూడా వాళ్లు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వేను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు ఈ వివాదాన్ని కూడా పరిశీలించారు. ఈ పరిశోధనలో ఆయన కూడా పాల్గొన్నారు. ప్రత్యేక బృందాల్లో రెవెన్యూ, అటవీ, ఎండోమెంట్‌, సర్వే, భూ రికార్డుల అధికారులు ఉన్నారు. పురావస్తు శాఖ పెద్ద మొత్తంలో పత్రాలను అధ్యయనం చేసింది. అధునాతన పద్ధతులను ఉపయోగించి క్షేత్ర స్థాయి సర్వేలను కూడా నిర్వహించింది. ఇందు కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. దీంతో అనేక నెలల పరిశోధన తర్వాత ప్రత్యేక బృందాలు వివాదాస్పద భూమికి యజమాని బ్రమరాంబ మల్లికార్జున స్వామి అని నిర్ధారించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆ భూమి దేవస్థానం ఆధీనంలో ఉందని అనుమానం రాకుండా నిర్ధారిస్తున్నామని ఆయన అన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత దేవాలయానికి భూములు దక్కడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

భూమిని అప్పగించే ప్రక్రియ పూర్తయింది

మంత్రుల బృందంలో దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఆలయ నిర్వహణకు భూమిని అధికారికంగా అప్పగించాలని ఎండో మెంట్ మంత్రి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌ను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయాన్ని ప్రతిపాదించేందుకు ఆలయ అధికారులతో అధికారికంగా ఒప్పందం కుదుర్చు కోవాలని స్థానిక డివిజనల్ ఫారెస్ట్ అధికారిని మధు సూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానం ఈఓ ఎస్‌ లవన్న, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అలన్‌ చోంగ్‌ టెరాన్‌ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇందులో 4,500 ఎకరాల భూమిపై తన హక్కులను ఆలయ అధికారులకు అప్పగించేందుకు అటవీ శాఖ అంగీకరించింది. దీంతో కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న భూ పోరాటం ఒక కొలిక్కి వచ్చింది. మంత్రులు మాట్లాడుతూ.. దేశాలయానికి దక్కాల్సిన 4500 ఎకరాల భూముల బదిలీ ప్రక్రియ ముగిస్తుందని, ఇప్పటి నుంచి ఆ భూములు దేవాలయానికి చెందుతాయని వాళ్లు అన్నారు.