రామమందిరానికి 400 కిలోల తాళం

రామయ్య జన్మ భూమి అయోధ్యలో రాములోరు త్వరలో కొలువుదీరనున్నాడు. రామాలయం శరవేగంగా రెడీ అవుతుంది. మరోవైపు ప్రారంభదినోత్సవ తేదీని ఖరారు చేసి.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న రామమందిరానికి అలీఘర్‌కు చెందిన ఓ కళాకారుడు 400 కిలోల తాళాన్ని తయారు చేశాడు. అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు.. రాముడి  గొప్ప భక్తుడు, సత్య ప్రకాష్ శర్మ ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన […]

Share:

రామయ్య జన్మ భూమి అయోధ్యలో రాములోరు త్వరలో కొలువుదీరనున్నాడు. రామాలయం శరవేగంగా రెడీ అవుతుంది. మరోవైపు ప్రారంభదినోత్సవ తేదీని ఖరారు చేసి.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న రామమందిరానికి అలీఘర్‌కు చెందిన ఓ కళాకారుడు 400 కిలోల తాళాన్ని తయారు చేశాడు.

అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు.. రాముడి  గొప్ప భక్తుడు, సత్య ప్రకాష్ శర్మ ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన తాళం సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడ్డాడు, తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, కీ అని పేర్కొన్నారు. దానిని ఈ సంవత్సరం చివర్లో రామ మందిర అధికారులకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు.

చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్‌ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. 

ఈ తాళం … ప్రత్యేకత 

ఈ తాళం గురించి చెప్పాలంటే.. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో అలీఘర్‌లో జరిగిన వార్షిక ప్రదర్శనలో కూడా ఈ తాళం ప్రదర్శించబడింది. ఇప్పుడు శర్మ ఈ తాళంలో చిన్న మార్పు చేసి ఆపై అలంకరించే విషయంలో నిమగ్నమై ఉన్నారు. తాళంలో ఏ లోపం ఉండకూడదని శర్మ కోరుకుంటున్నారు.ఈ తాళం తయారు చేసే సమయంలో  సత్య ప్రకాష్ శర్మ భార్య రుక్మిణి దేవి పూర్తి సహకారం అందించారు అని ఆయన తెలిపారు. 

సత్య ప్రకాష్ శర్మ భార్య మాట్లాడుతూ… 

 ఇంతకు ముందు ఆరు అడుగుల పొడవు, మూడడుగుల వెడల్పుతో తాళం తయారు చేశామని.. అయితే కొందరు పెద్ద తాళం తయారు చేయమని సలహా ఇచ్చారు అని ఆమె తెలిపారు . ఆ తర్వాత భారీ తాళం తయారీకి సంబంధించిన పని మొదలుపెట్టాం అని ఈ తాళం తయారీకి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చయిందని శర్మ తెలిపారు.

 అలీఘర్ తాళాలకు పేరుగాంచిన నగరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇంత ముందు ఎవరూ తయారు చేయనటువంటి భారీ తాళాన్ని తయారు చేసి రామమందిరానికి భారీ తాళం వేయాలని అనుకున్నామని పేర్కొన్నారు దంపతులు. ఈ తాళం తయారీ కోసం వీరు దాచుకున్న జీవిత పొదుపు మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన వార్షిక అలీఘర్ ఎగ్జిబిషన్‌లో తాళం ప్రదర్శించబడింది అని  మరియు తన సృష్టికి చిన్న చిన్న మార్పులు చేయడం మరియు అలంకారాలను జోడించడంలో బిజీగా ఉన్న శర్మ, ఇది పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు 

తాళం ఎక్కడ వినియోగిస్తారో చూడాలి అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు తెలిపారు.

45 ఏళ్లుగా వ్యాపారంలో నిమగ్నమై ఉండగా, తన కుటుంబం ఒక శతాబ్దానికి పైగా చేతితో తాళాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉందని శర్మ చెప్పారు.

జనవరిలో అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠ

వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రాయాలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. జనవరి 21, 22, 23 తేదీల్లో రామయ్య విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సాధువులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారని రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుందని, జనవరి నెలలో ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. అయోధ్యలో జరిగే పవిత్రాభిషేక మహోత్సవానికి విచ్చేసే భక్తులకు దాదాపు నెల రోజుల పాటు ఉచిత భోజనం అందించాలని ట్రస్టు యోచిస్తోంది. ప్రతిరోజూ 75 వేల నుంచి లక్ష మంది వరకు అన్నదానం చేసే అవకాశం ఉందని ట్రస్ట్‌ పేర్కొంది.