రాష్ట్రంలో 313 అరుదైన పక్షి జాతులు.. దేశంలోనే 12వ స్థానం..

బర్డ్ వాచర్లు 313 అరుదైన పక్షి జాతులను గమనించి వాటి ఫోటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ “ఈ బర్డ్‌” లో నమోదు చేశారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకుల కంటే ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం. తిరుపతి ఐఐటి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ఏలూరు సిఆర్ఆర్ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్ లో  ఈ గణనలో పాల్గొన్నాయి.. ఫిబ్రవరి 17 […]

Share:

బర్డ్ వాచర్లు 313 అరుదైన పక్షి జాతులను గమనించి వాటి ఫోటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ “ఈ బర్డ్‌” లో నమోదు చేశారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకుల కంటే ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం.

తిరుపతి ఐఐటి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ఏలూరు సిఆర్ఆర్ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్ లో  ఈ గణనలో పాల్గొన్నాయి.. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఐఎస్ఇఆర్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం రాష్ట్రంలో గ్రేట్ బాక్ యార్డ్ బోర్డ్ కౌంటుగా పిలిచే ప్రపంచ పక్షుల గణన నిర్వహించారు.. 

313 జాతుల పక్షులు..

ఈ గణనలో దేశవ్యాప్తంగా 1067 జాతుల పక్షులు నమోదు అవ్వగా.. మన రాష్ట్రం 313 జాతుల్ని నమోదు చేసి.. దేశంలో 12వ స్థానంలో నిలిచింది.  బర్డ్ వాచర్లు పక్షులను గమనించి వాటి ఫోటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ “ఈ బర్డ్‌” లో నమోదు చేశారు. 

8 రకాల గుడ్లగూబలు..

రాష్ట్రంలో పలు అరుదైన పక్షి జాతుల్ని బర్డ్ వాచర్స్ గుర్తించారు. గోధుమ రంగు అడవి గుడ్లగూబ (బ్రౌన్ వుడ్ ఓల్), ఎలుక గద్ద (కామన్ బజార్డ్ ), నల్ల బాజా (బ్లాక్ బాజా) వంటి అరుదైన పక్షులు కనిపించాయి.  తిరుపతి   ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు సుదీర్ఘకాలం తర్వాత నల్ల బాజను గుర్తించగా.. రాజమండ్రిలో బర్డ్ వాచర్ మోహన్ శ్రీకర్ గోధుమ రంగు అడవి గుడ్లగూబను రికార్డు చేశారు. విజయవాడలో ఎలుక గద్ద పక్షి రాష్ట్రంలో రెండోసారి రికార్డ్ అయింది.  రాష్ట్రవ్యాప్తంగా 8 రకాల గుడ్లగూబలు రికార్డు అయ్యాయి.. 

గణనలో 84 మంది బర్డ్ వాచర్స్..

విజయవాడ నేచర్ క్లబ్‌లో ఉన్న పలువురు వైద్యులు, పరిశ్రామిక వేత్తలు, విద్యార్థులు, కొందరు సిటిజెన్లు ఒక గ్రూపుగా ఏర్పడి విజయవాడ పరిసరాల్లో 60 రకాల పక్షులను నమోదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రకాశం జిల్లా ప్రాంతంలో 100 జాతులకు పైగా పక్షుల్ని రికార్డు చేశారు. రాష్ట్రంలోని రాజమండ్రి బర్డ్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపు సభ్యులుగా ఉన్న డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా నుంచి 25 జాతుల పక్షులను రికార్డు చేశారు. విశాఖపట్నంలో స్థానిక ఎన్జీవోలు, డబ్ల్యు సిటిఆర్ అడవి శాఖలో కలిసి బర్డ్ వాక్‌లు నిర్వహించాయి. 180 శాతుల పక్షులను నమోదు చేశారు. అనంతపురంలో 160 రకాల పక్షులు కొల్లేరు పక్షుల అభయారణ్యంలో 90 రకాల పక్షులు నమోదయ్యాయి. మొత్తం 84 మంది బర్డ్ వాచర్స్ ఈ గణనలో పాల్గొన్నారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకుల కంటే ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం.

బర్డ్ కౌంట్ ఇండియా తుది ఫలితాలు..

రాష్ట్రంలో ఇప్పటివరకు 940 జాతుల పక్షులు రికార్డ్ అవ్వగా.. ఈ గణనలో వాటిలో 65% పక్షులు నమోదు అయ్యాయి. ఎక్కువ మంది ప్రకృతిని అనుసంధానం చేయడం, పక్షులను చూడాలని అభిరుచితో ఉన్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో యేటా ఈ గణనను నిర్వహిస్తున్నారు.  ఈ ఫలితాలు ప్రాథమికంగా ఇచ్చినవి. కానీ బర్డ్ కౌంట్ ఇండియా త్వరలో తుది ఫలితాలను వెల్లడిస్తుంది. గ్రేట్ బ్యాక్ యాడ్ బోర్డ్ కౌంట్‌లో రికార్డయినా పలు రకాల పక్షులు చూపరులను ఆకట్టుకున్నాయి.