సూడాన్‌లో చిక్కిన 31 మంది కర్ణాటక హిక్కి పిక్కి గిరిజనులు

ఇతర దేశాల్లో మాదిరిగానే సూడాన్‌లో కూడా కొందరు భారతీయులు ఉన్నారు. ఉద్యోగనిమిత్తం సూడాన్ వెళ్ళిన భారతీయ మాజీ సైనికోద్యోగి ఒకరు తాజా ఘర్షణల్లో బులెట్ తగిలి చనిపోయారు. పరిస్థితులు కొద్దిగానైనా కుదుటపడితే కానీ, ఎవరెవరు, ఎంత మంది చనిపోయారు? అనేది బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం సుమారు 4వేల మంది భారతీయులు సూడాన్ లో ఉన్నట్లు అధికారిక సమాచారం. వారిలో కొన్ని దశాబ్దాల క్రితమే సూడాన్ వెళ్ళి స్థిరపడినవారు సుమారు 1200 మంది ఉంటారని […]

Share:

ఇతర దేశాల్లో మాదిరిగానే సూడాన్‌లో కూడా కొందరు భారతీయులు ఉన్నారు. ఉద్యోగనిమిత్తం సూడాన్ వెళ్ళిన భారతీయ మాజీ సైనికోద్యోగి ఒకరు తాజా ఘర్షణల్లో బులెట్ తగిలి చనిపోయారు. పరిస్థితులు కొద్దిగానైనా కుదుటపడితే కానీ, ఎవరెవరు, ఎంత మంది చనిపోయారు? అనేది బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం సుమారు 4వేల మంది భారతీయులు సూడాన్ లో ఉన్నట్లు అధికారిక సమాచారం. వారిలో కొన్ని దశాబ్దాల క్రితమే సూడాన్ వెళ్ళి స్థిరపడినవారు సుమారు 1200 మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ళ నుంచి బయటకు రావద్దని సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు విజ్ఞప్తి చేసింది. కర్ణాటకకు చెందిన హక్కి పిక్కి తెగకు చెందిన 31 మంది గిరిజనులు చిక్కుకుపోయారు.. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సూడాన్ లో చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి కేంద్రం కృషి చేయాలని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు.

సూడాన్‌లో మిలిటరీ, పారామిలిటరీ మధ్య జరుగుతోన్న ఘర్షణలో ఇప్పటివరకు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.  వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పటికే అక్కడి వారిని బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. సూడాన్‌లో  కర్ణాటకకు చెందిన 31 మంది హక్కీ పిక్కీ తెగకు చెందిన గిరిజనులు చిక్కుకున్నారు. వారిని భారతదేశానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ  అధికార బీజేపీపై  విమర్శలు గుప్పించింది.

సూడాన్‌లో  31 మంది హక్కీ పిక్కీ గిరిజన తెగకు చెందినవారు ఉన్నారు.  ఘర్షణతో అక్కడ వారికి తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని.. ఆ  అంశాన్ని కాంగ్రెస్ పార్టీ  ప్రస్తావిస్తోంది. సూడాన్‌లో  ఉన్న గిరిజనులను ఎందుకు స్వదేశం తీసుకురావడం లేదని ప్రశ్నిస్తోంది. కేంద్రంలో ఉన్న మోడీ, రాష్రంలో ఉన్న సీఎం బొమ్మై ప్రభుత్వాలకు కన్నడ ప్రజలు  అంటే నచ్చదు అని మండిపడింది. సూడాన్ నుంచి వారిని ముందే ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది.

సూడాన్‌లో ఉన్న గిరిజనులను వారి కర్మకు వదిలేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. ప్రహ్లాద్ జోషి, శోభ కర్లందాజే, బీజేపీ ఎంపీలు ఎక్కడ అని అడిగారు. సీఎం బొమ్మై మిమ్మల్ని చూసి సిగ్గేస్తోందని అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 

గిరిజనులను సురక్షితంగా స్వదేశం తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం బొమ్మై, ప్రధాని మోదీని, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కోరారు. ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోవాని, చాలా ఆలస్యం చేసిందని మండిపడ్డారు. గిరిజనులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నామని బీజేపీ చెబుతోంది. మరోవైపు సూడాన్‌లో వరసగా మూడోరోజు కూడా హింసాత్మక ఘటన జరిగాయి.

ఉత్తరాఫ్రికా దేశమైన సూడాన్ పరిస్థితి భారత ప్రభుత్వానికి ఈ  కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. సూడాన్‌లో చెలరేగిన అంతర్యుద్ధం మధ్యలో, పరిస్థితి నిరంతరం మరింత దిగజారుతోంది. అదే సమయంలో, ఈ పోరాటంలో హిక్కి పిక్కి తెగ వారితో పాటుగా మూడు వేల మందికి పైగా భారతీయుల భద్రతా సంక్షోభం తీవ్రమైంది. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా భారీ పోరాట ప్రాంతంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబసీలోని అధికారులు, సిబ్బంది ఇంటి నుంచే పని చేయాల్సి వస్తోంది. పోరాటాల కారణంగా చాలా తక్కువ విద్యుత్ మరియు కమ్యూనికేషన్ మార్గాలు మిగిలి ఉన్నాయి. అదే సమయంలో, భారతీయులకు ఏదైనా ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేయడం కూడా చాలా కష్టంగా మారింది.