బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు

ప్రతి సంవత్సరం ఎంతో మంది బోరుబావిలో పడి చిన్న పిల్లలు తమ ప్రాణాల్ని కోల్పోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మాత్రం బోరుబావిలో పిల్లలు పడిపోవడం మాత్రం ఆగట్లేదు. ఇటీవల బీహార్ నలంద జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. 40 అడుగుల బోరుబావిలో మూడు సంవత్సరాల వయసున్న బాలుడు పడిపోగా ఐదు గంటల వ్యవతిలో బాలుని కాపాడారు రెస్క్యూ టీం.  కాపాడిన NDRF:  సమాచారం ప్రకారం, బీహార్ నలంద జిల్లాలో ఒక రైతు బోరుబావిని తవ్వాడు, […]

Share:

ప్రతి సంవత్సరం ఎంతో మంది బోరుబావిలో పడి చిన్న పిల్లలు తమ ప్రాణాల్ని కోల్పోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మాత్రం బోరుబావిలో పిల్లలు పడిపోవడం మాత్రం ఆగట్లేదు. ఇటీవల బీహార్ నలంద జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. 40 అడుగుల బోరుబావిలో మూడు సంవత్సరాల వయసున్న బాలుడు పడిపోగా ఐదు గంటల వ్యవతిలో బాలుని కాపాడారు రెస్క్యూ టీం. 

కాపాడిన NDRF: 

సమాచారం ప్రకారం, బీహార్ నలంద జిల్లాలో ఒక రైతు బోరుబావిని తవ్వాడు, కానీ ఆ బోరుబావిని ముయ్యడం మాత్రం మర్చిపోయాడు, ఆ రైతు చేసిన పొరపాటే ఒక పిల్లవాడి ప్రాణం ఐదు గంటలు బోరుబావిలో పోరాడేల చేసింది. ఆడుకోవడానికి వెళ్లిన మూడేళ్ల బాలుడు శివమ్‌ ఆడుకుంటూ, అనుకోకుండా రైతు తెరిచి ఉంచిన బోరిబావిలో పడిపోయాడు. శివమ్‌తో ఆడుకుంటున్న తోటి పిల్లలు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో నగర పంచాయతీ నలంద వైస్ ప్రెసిడెంట్ నళిన్ మౌర్య సహకరించారు. 

అయితే రెస్క్యూ టీం కష్టం మీద తాము పంపించిన డివైసెస్ ద్వారా బోరుబావిలో ఉన్న పిల్లవాడు సురక్షితంగా ఉన్నట్లు మొదట సమాచారం అందించారు. అంతేకాకుండా, చిన్నారి క్షేమంగా బతికే ఉన్నాడని, అతని గొంతు తమకు వినిపిస్తుందని సర్కిల్ ఆఫీసర్ శంభు మండల్ తెలిపారు. పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ ప్రశాంత్ గౌరవ్, బోరు బావిలో ఉన్న శివం పరిస్థితిపై పూర్తి ఆరోగ్య పరిస్థితి అందించారు, అంతేకాకుండా పిల్లవాడికి అవసరమైన ఆక్సిజన్ తగిన స్థాయిలో అందించినట్లు పేర్కొన్నారు. అయితే సుమారు అయిదు గంటలు కృషి చేసి శివంని రెస్క్యూ టీం వారు ప్రాణాలతో బోరుబావి ప్రమాదం నుంచి రక్షించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌కు ఖచ్చితమైన ప్రణాళిక మరియు అంకితభావం ఉండడం వల్లే బాలుడు త్వరగా బయటపడ్డాడు అని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే అధికారులు వెంటనే స్పందించిన కారణంగానే బాలుడు సురక్షితంగా బయటపడినట్లు చెప్తున్నారు స్థానికులు. చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు కృషి చేశామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఘటనపై సీనియర్‌ అధికారికి కూడా మాట్లాడటం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పలువురు పర్సోత్తం అధికారులు సంఘటనా వెంటనే స్థలానికి చేరుకున్నారు.

బోరు బావుల విషయంలో నిర్లక్ష్యం: 

అయితే ప్రస్తుతం బోరుబావి సంఘటన దేశంలో కొత్త కాదు. ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలు బోరుబావిలో పడి చనిపోతున్నారు. బోరుబావి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఏటా చెబుతున్నప్పటికీ ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరిగిన బోరు బావి ఘటన లో, కేవలం 5 గంటల సమయంలోనే పిల్లవాడిని రక్షించడం జరిగింది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కష్టం కూడా అవ్వచ్చు. పిల్లల ప్రాణాలు పోయే అవకాశం ఉండొచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కానీ అసలు పిల్లవాడు బోరుబావిలో పడడానికి కారణమైన ఓపెన్ బోరుబావిలను మూసేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద ఉంది. ఇలాంటి సంఘటనలు ప్రతి ఏటా జరుగుతున్నప్పటికీ నిర్లక్ష్యమే దీనికి కారణం అవుతుంది. అందుకే ఈ సంఘటనతో అయినా సరే, బోరు బావికి సంబంధించిన రక్షణ తీసుకుంటారని కోరుకుందాం.