ప్రధానమంత్రి సభకి బయలుదేరుతూ ప్రమాదానికి గురైన బస్సు

ఈమధ్య తరచూ ప్రమాదకరమైన వార్తలు వింటూనే ఉన్నాము, ఎక్కడో ఒక చోట ఎదో ఒక అనర్ధం  చోటు చేసుకుంటూనే ఉంది. ఈమధ్యనే జరిగిన బాలాస్ పూర్ రైలు ప్రమాద ఘటన మన అందరిని ఎంత తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సంఘటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మధ్య ప్రదేశ్ లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి సుమారుగా 25 మంది ప్రయాణికులు సజీవ దహనమైన […]

Share:

ఈమధ్య తరచూ ప్రమాదకరమైన వార్తలు వింటూనే ఉన్నాము, ఎక్కడో ఒక చోట ఎదో ఒక అనర్ధం  చోటు చేసుకుంటూనే ఉంది. ఈమధ్యనే జరిగిన బాలాస్ పూర్ రైలు ప్రమాద ఘటన మన అందరిని ఎంత తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సంఘటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మధ్య ప్రదేశ్ లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి సుమారుగా 25 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన మన హృదయాలను కలిచివేసింది. ఇది ఈ రెండు సంఘటనలే మర్చిపోలేకున్నాము అనుకుంటే ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాయిపూర్ లో ఒక మహాసభ ని ఏర్పాటు చేసాడు. ఈ సభకి దేశం లోని నలుమూలల నుండి బీజేపీ పార్టీ కార్యకర్తలు వేలాది గా తరలి వచ్చి విజయవంతం చేసారు.

లారీని వేగంగా ఢీకొట్టడం వల్ల జరిగిన దుర్ఘటన:

అయితే బిలాస్ పూర్ నుండి 40 మంది బీజేపీ కార్యకర్తలతో తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్యలో బయలుదేరిన ఒక బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో బండి తోలడం, అతను కునుకు వెయ్యడం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ముగ్గురు కార్యకర్తలు మరణించగా, ఆరు మంది కార్యకర్తలు తీవ్రమైన గాయాలపాలయ్యారు. చికిత్స పొందుతున్న ఆ ఆరు మందిలో ముగ్గురి పరిస్థితి తీవ్రమైన విషమం గా ఉంది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఈ బస్సు లారీ ని వెనుక నుండి చాలా బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన లో డ్రైవర్ కూడా చనిపోయాడు. క్షతగాత్రులను వెంటనే సమీపం లో ఉన్నటువంటి బిలాస్ పూర్ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయం లో భారీ వర్షం కూడా వచ్చిందట. దానికి డ్రైవర్ కూడా నిద్ర మత్తులో ఉండడం, అతను కునుకు వెయ్యడం తో ఈ ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు.

మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయిల ఆర్ధిక సహాయం :

ఇక జరిగిన ఈ ప్రమాదం పై బీజేపీ పార్టీ ముఖ్య నాయకులూ చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఈ ఘటనపై ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడుతూ ‘ ఎంతో మంచి ఉద్దేశ్యం తో ప్రదన మంత్రి మోడీ గారు చేపట్టిన కార్యక్రమానికి బయలుదేరుతూ మా కార్యకర్తలు ఇలా ప్రమాదానికి గురై చనిపోవడం నన్ను తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్టీ బలోపేతం అయ్యేందుకు చనిపోయిన ఆ ఇద్దరు కార్యకర్తలు ఎంతో కృషి చేసారు, ఎన్నో సందర్భాలలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారు. అలాంటి కార్యకర్తలను కోల్పోవడం అనేది మేము చేసుకున్న దురదృష్టం. చనిపోయిన వారి కుటుంబానికి నాలుగు లక్షల రూపాయిలు ఆర్ధిక సహాయం అందించడమే కాకుండా, వాళ్లకి ఏ రాజమైన అవసరం వచ్చినా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. వారి ఆత్మలు ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థనలు చేద్దాము’ అంటూ ఈ సందర్భంగా ఆయన ఎంతో ఎమోషనల్ గా ప్రసంగించారు.  ఇక గాయపడిన ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని అధికారులకు చాలా బలమైన స్ట్రిక్ట్ ఆర్డర్స్ ని జారీ చేసారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. మరోపక్క సోషల్ మీడియా లో కూడా నెటిజెన్స్ ఈ దుర్ఘటన పై సంతాపం వ్యక్తపరుస్తున్నారు.