జమ్ము కాశ్మీర్ దగ్గరలో భూకంపం

భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో సోమవారం రాత్రి 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  భూకంపం ఎప్పుడు సంభవించింది:  భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ […]

Share:

భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో సోమవారం రాత్రి 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

భూకంపం ఎప్పుడు సంభవించింది: 

భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. రాత్రి 10.07 గంటలకు భూకంపం వచ్చినట్లు నివేదికల ప్రకారం తెలిసింది. 

జమ్ము కాశ్మీర్ కి భూకంపాలు మామూలు అయిపోయాయి: 

ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి 17న కరెక్ట్ గా జమ్మూ కాశ్మీర్ కత్రా ప్రాంతంలోనే భూకంపం సంభవించినట్లు భూకంపకేంద్రం స్పష్టం చేసింది. రాక్టర్ స్కేలు మీద 3.6గా భూకంపం సంబంధించినట్లు అధికారులు తెలిపారు. అయితే అప్పట్లో కాత్రాకు 97 కిలోమీటర్ల దూరంలో తూర్పున భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది. అయితే ఈ భూకంపం ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించినట్లు తెలుస్తోంది. 

దశాబ్దాల తర్వాత అత్యధిక భూకంపం ఇక్కడే సంభవించింది: 

6 ఫిబ్రవరి 2023న, టర్కీ మరియు ఉత్తర మరియు పశ్చిమ సిరియాలో, ఉదయం 04:17కు, రాక్టర్ స్కేలు మీద 7.8 భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం గాజియాంటెప్‌కు పశ్చిమ-వాయువ్యంగా 37 కిమీ (23 మైళ్ళు) దూరంలో ఉంది. ఎన్నో దశాబ్దాల తర్వాత సంభవించిన అతి పెద్ద భూకంపం ఇది. దీని తర్వాత 13:24కి మళ్లీ మరోసారి రెక్టర్ స్కేల్ మీద 7.7 భూకంపం వచ్చింది. ఈ భూకంపం మొదటిసారి వచ్చిన భూకంపా కేంద్రం దగ్గర నుంచి 95 కిమీ (59 మైళ్ళు) ఉత్తర-ఈశాన్య దిశలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ అతిపెద్ద భూకంపం కారణంగా సుమారు 10,000 మంది మరణించడం జరిగింది.

రాక్టర్ స్కేలు మీద 7.8 భూకంపం టర్కీలో 1939 ఎర్జింకన్ భూకంపం తర్వాత అతిపెద్దది. 1668 నార్త్ అనటోలియా భూకంపం తర్వాత దేశ చరిత్రలో సంయుక్తంగా రెండవ అత్యంత పెద్ద భూకంపం టర్కీ భూకంపం. లెవాంట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపాలలో ఇది కూడా ఒకటి. ఇది ఈజిప్ట్ మరియు టర్కీలో ఉన్న బ్లాక్ సి వరకు భూకంప తీవ్రత నెలకొంది. ఆ తర్వాత మూడు వారాల్లో 10,000 కంటే ఎక్కువ ప్రకంపనలు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.

జర్మనీ పరిమాణంలో దాదాపు 3,50,000 కిమీ2 (1,40,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణం అంత చాలా ఎక్కువ నష్టం జరిగింది. అయితే టర్కీలో సంభవించిన ఈ అతి పెద్ద భూకంపానికి సుమారు టర్కీలో నివసిస్తున్న 16 శాతం మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఐక్యరాజ్యసమితి నుండి వచ్చిన అభివృద్ధి నిపుణుల ఇచ్చిన నివేదికల ప్రకారం, సుమారు 1.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు అంచనా వేశారు.