మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో 25 మంది సజీవ దహనం

మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పై ప్రయాణిస్తున్న ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం తో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన కోట్లాది మంది హృదయాలను కలిచి వేసింది. అసలు విషయం లోకి వెళ్తే, ప్రమాదానికి గురైన బస్సు యావత్మల్ నుండి పూణే వైపు వెళ్తున్న సమయం లో తెల్లవారు జామున రెండు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సులో మొత్తం 33 […]

Share:

మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పై ప్రయాణిస్తున్న ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం తో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన కోట్లాది మంది హృదయాలను కలిచి వేసింది. అసలు విషయం లోకి వెళ్తే, ప్రమాదానికి గురైన బస్సు యావత్మల్ నుండి పూణే వైపు వెళ్తున్న సమయం లో తెల్లవారు జామున రెండు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సులో మొత్తం 33 ప్రయాణికులు ఉండగా, అందులో 25 మంది ప్రయాణికులు చనిపోయారని పోలీసులు చేసిన విచారణలో బయటపడింది. మరో 8 మందికి తీవ్రమైన గాయాలు అవ్వగా వారిని సమీపం లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు చాలా యాక్టీవ్ గా స్పందించి , ఘటన స్థలంపై చేరుకొని సేవ కార్యక్రమాలు మొదలు పెట్టడం హర్షణీయం.

బస్సు టైరు పేలిపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది : డ్రైవర్ 

ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ ప్రాణాలతోనే బయటపడ్డాడు. అతడిని పోలీసులు విచారించగా, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ‘రోడ్డు మీద బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా ముందు టైరు పేలడం తో బస్సు నేరుగా స్తంభానికి ఢీకొట్టి, ఆ తర్వాత పల్టీలు కొట్టింది. అప్పుడు బస్సులో నెమ్మదిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు మెలుకవతో ఉండుంటే ఇంతమంది చనిపొయ్యే వాళ్ళు కాదు. రెండు గంటలు అవ్వడం తో అందరు ఘాడమైన నిద్రలో ఉండడం వల్ల ఆలస్యం గా స్పందించారు. ఈ లోపు .జరగాల్సిన దుర్ఘటన జరిగిపోయింది’ అంటూ డ్రైవర్ చెప్పుకొచ్చాడు. మృత దేహాలు బాగా కాలిపోవడం తో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ క్రమం లో పోలీసులు మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అందచేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక ప్రాణాలతో బయటపడ్డ 8 మంది ప్రయాణికుల పరిస్థితి కూడా విషమం గానే ఉందట.

మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయిలు ప్రకటించిన ముఖ్య మంత్రి :

ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్  నాథ్ సిందే చాలా తీవ్రమైన విచారం ని వ్యక్త పరిచాడు. ఘటన స్థలం కి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది అనేది పోలీసులను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆయన మీడియా ముందు మృతుల కుటుంబానికి తన తరుపున సానుభూతి తెలుపుతూ చనిపోయిన ప్రతీ మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇక ప్రమాదం లో ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రులకు మెరుగని వైద్యం అందించాల్సిందిగా  అధికారులను ఆదేశించారు. ప్రశాంతం గా నిద్రపోతూ ప్రయాణిస్తున్న సమయం లో మెలుకవ నుండి తేరుకునేలోపే సజీవ దహన అవ్వడం అనేది, ఎంత నరకప్రాయంగా చావో అత్త చేసుకోవచ్చు. పాపం చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇది ఊహించుకొని ఎంతలా బాధపడి ఉంటారో. సజీవ దహనం అయినా వారిలో చిన్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్లు ఉన్నారు, అప్పుడే పెళ్ళైన జంట కూడా ఉంది. ఇంత మంది ప్రాణాలు రెప్పపాటు సమయం లో గాలిలో కలిసిపోయాయి అనే వార్త వింటుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. అయితే పోలీసులు దీనిపై మరింత పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ సమయం లోనే బస్సు టైరు ఎందుకు పేలింది?, ప్రయాణం మొదలయ్యే ముందు అన్నీ చెక్ చేసుకున్నారా లేదా?, బండి రూల్స్ ప్రకారం ఉన్న లిమిట్ స్పీడ్ లోనే రన్ అయ్యిందా లేదా అనే కోణం లో  విచారణ జరుపుతున్నారు.