కార్గిల్ విజయ్ దివస్.. నేటికి 24 ఏళ్ళు

భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం 1999 మే 3న ప్రారంభమై.. జూలై 26న ముగిసింది. అందుకే జూలై 26న విజయ్ దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.  తీవ్రమైన యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్నిగుర్తుచేసుకుందాం.. . పాకిస్థాన్‌పై విజయవంతమైన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు. ఇదే రోజున రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో భారత ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులర్పిస్తారు. ఇప్పుడు జరుపుకునేది 24వ విజయ్  […]

Share:

భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం 1999 మే 3న ప్రారంభమై.. జూలై 26న ముగిసింది. అందుకే జూలై 26న విజయ్ దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.  తీవ్రమైన యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్నిగుర్తుచేసుకుందాం.. . పాకిస్థాన్‌పై విజయవంతమైన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు. ఇదే రోజున రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో భారత ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులర్పిస్తారు. ఇప్పుడు జరుపుకునేది 24వ విజయ్  దివస్. కార్గిల్ దివస్ ప్రతి భారతీయ హృదయంలో దేశభక్తి జ్వాలని వెలిగిస్తుంది, మనది ఐక్యమైన జాతి అని గుర్తుచేస్తుంది, మన రేపటి కోసం ప్రతిదీ ఇచ్చిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. 1999 కార్గిల్ యుద్ధం జరిగి 2023 నాటికి 24 ఏళ్లు పూర్తయ్యాయి. జమ్ముకశ్మీర్ లోని కార్గిల్ సెక్టార్ లో పాక్ కు వ్యతిరేకంగా భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్ ‘ నిర్వహించింది.

 కార్గిల్ యుద్ధం..

కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న దురద్దేశంతో పాకిస్తాన్ సైన్యం ట్రైబల్ మిలీషియా మద్దతుతో ‘ఆపరేషన్ బదర్’ అనే పేరిట చొరబాటుదారులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. చొరబాటుదారులు కార్గిల్ యొక్క ద్రాస్‌లోని జాతీయ రహదారిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి కశ్మీర్ లోయను లడఖ్‌కు కలిపే కీలక రహదారిపై పట్టు సాధించారు. తర్వాత పాకిస్థానీ చొరబాటుదారులు కాశ్మీర్ లోయ ప్రాంతంలోకి ప్రవేశించి దానిని ఆక్రమించుకోవాలని చూశారు. 

1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం మెుదలైంది. భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే మిషన్ ప్రారంభించిన దాదాపు రెండు నెలలపాటు గడ్డకట్టే చలిలో పోరాడింది. ఈ యుద్దంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భారత్ కు చెందిన 527 మంది సైనికుల అమరులయ్యారు. దాదాపు 1000 మది పాకిస్థానీ సైనికులు మృతి చెందారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి.. తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది భారత్. దీనికు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ను జరుపుకుంటారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం కార్గిల్ వార్ మెమోరియల్ ను లడక్ సమీపంలోని ద్రాస్ టౌన్ లో ఏర్పాటు చేశారు.

కార్గిల్ యుద్ధానికి ముందు పరిస్థితి:

1998-1999 శీతాకాలంలో సియాచిన్ గ్లేసియర్ ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పాకిస్తాన్ సైన్యం రహస్యంగా కార్గిల్ సమీపంలో దళాలకు శిక్షణ ఇవ్వడం మరియు పంపడం ప్రారంభించింది. వారు పాక్ సైనికులు కాదని, ముజాహిదీన్లు అని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ వివాదంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం, తద్వారా సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకురావడం, కశ్మీర్ వివాదం కోసం చర్చలు జరిపేందుకు భారత్ ను బలవంతం చేయడం పాక్ ప్రధాన ఉద్దేశం.

3 మే 1999న, కార్గిల్‌లోని స్థానిక గొర్రెల కాపరి ఈ ప్రాంతంలోని పాకిస్తానీ సైనికులు మరియు తీవ్రవాదుల గురించి భారత సైన్యాన్ని అప్రమత్తం చేశారు ఆ తరువాత ఆరోజున పాక్ సైనికులు దాదాపు 5 మంది భారత సైనికులను హతమార్చారు.

అప్పుడు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది. కార్గిల్‌లో భారత ఆర్మీకి చెందిన మందుగుండు సామాగ్రి నిక్షేపాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. 1999 మే 26న భారత సైన్యం వైమానిక దాడులు చేసింది. IAF, MiG-27 కూలిపోయింది, 4 ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మరణించారు. ఎజెక్ట్ చేస్తున్న పైలట్‌ను పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా పట్టుకుంది.మే 31న అటల్ బిహారీ వాజ్‌పేయి కార్గిల్‌లో యుద్ధం లాంటి పరిస్థితిని ప్రకటించారు.

పాకిస్తాన్ ప్రమేయాన్ని చూపించే పత్రాలను భారత సైన్యం విడుదల చేసింది.అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాక్ సైనికులను వెనక్కి రప్పించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కోరారు. బిల్ క్లింటన్ నవాజ్ షరీఫ్‌ను కలిశారు మరియు కార్గిల్ నుండి పాకిస్తాన్ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్తాన్ PM ప్రకటించారు.

11 జూలై 1999న, పాకిస్తాన్ సేనలు తిరోగమనం ప్రారంభించాయి మరియు బటాలిక్‌లోని అనేక శిఖరాలను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.1999 జూలై 14న ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైందని భారత సైన్యం ప్రకటించింది. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసింది, అందుకే ఈ రోజును ‘కార్గిల్ విజయ్ దివస్’గా పరిగణిస్తారు.