ఢీ కొట్టుకోబోయిన రెండు విమానాలు

విమాన ప్రయాణం అంటే అందరికీ ఒకటే వణుకు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది అని అంటారు. కానీ విమాన ప్రయాణం చేస్తే ఖర్చు మాత్రమే కాదు లక్ కూడా ఉండాలి. మనకు లక్ కనుక లేకపోతే మన ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే విమాన ప్రయాణం అదృష్టంతో కూడుకున్నదని అంతా కామెంట్లు చేస్తారు. దీనికి సాక్ష్యంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలను ఉటంకిస్తూ అనేక మంది విమాన ప్రయాణాలను బంద్ చేసిన […]

Share:

విమాన ప్రయాణం అంటే అందరికీ ఒకటే వణుకు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది అని అంటారు. కానీ విమాన ప్రయాణం చేస్తే ఖర్చు మాత్రమే కాదు లక్ కూడా ఉండాలి. మనకు లక్ కనుక లేకపోతే మన ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే విమాన ప్రయాణం అదృష్టంతో కూడుకున్నదని అంతా కామెంట్లు చేస్తారు. దీనికి సాక్ష్యంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలను ఉటంకిస్తూ అనేక మంది విమాన ప్రయాణాలను బంద్ చేసిన వారున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇవన్నీ కామనే అని విమాన ప్రయాణం చేస్తుంటారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ ఘటనలో రెండు విమానాలు ఒక దాన్ని మరొకటి గుద్దుకునేంత దగ్గరికి వచ్చాయి. 

అలర్ట్ చేసిన కెప్టెన్

ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా కంపెనీకి చెందిన రెండు విమానాలు గుద్దుకునేంత దగ్గరికి వచ్చాయి. కానీ విమానం నడుపుతున్న ఒక మహిళా పైలెట్ అలెర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానాలు కనుక గుద్దుకుంటే భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. చంద్రయాన్-3 సక్సెస్ అవుతుందా? లేదా? అని యావత్ దేశం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వేళ జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయంలో మధ్యాహ్నం వేళలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులతో పాటు ఈ వార్తను విన్న సామాన్యులు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ విమానాల్లో దాదాపు 300 మందికి పైగా సిబ్బంది ఉన్నారని సమాచారం.

ATC లోపం వల్లే ఇదంతా… 

బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరాలంటే డ్రైవర్ వెనకా ముందు చూసుకుని అవసరమైతే కండక్టర్ సాయం తీసుకుంటాడు. అదే రైల్వే స్టేషన్ నుంచి రైలుకు స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వగానే ముందుకు కదులుతుంది. కానీ విమానాల విషయంలో మాత్రం అలా జరగదు. విమానాల వ్యవస్థను కంట్రోల్ చేసేందుకు డీజీసీఏ ఆధ్వర్యంలో ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనే వ్యవస్థ రన్ అవుతుంది. ఈ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే ఎటువంటి ప్లెయిన్ అయినా సరే టేకాఫ్ కావడానికి సిద్దం అవుతుంది. విమానాలు తమ రూట్ ను మార్చుకోవాలన్నా కానీ ATC అనుమతి తీసుకోవడం తప్పనిసరి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా పైలెట్లు తమ సొంత నిర్ణయాలు తీసుకునేందుకు చాన్స్ లేదు. అటువంటి సిట్యుయేషన్ లో కూడా వారు ATC అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. అటువంటి ATC మిస్టేక్స్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అందర్నీ భయబ్రాంతులకు గురి చేసిన ఈ ఢిల్లీ ఘటనలో తప్పంతా ATCదే అని అంతా అంటున్నారు. ATC విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా అవాక్కయ్యారు. ఏంటిది ATC కూడా ఇలా చేస్తే ఇక ప్రయాణికుల భద్రతకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు?

ఒకటి ల్యాండింగ్ మరొకటి టేకాఫ్

అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో వచ్చిన విస్తారా కంపెనీకి చెందిన విమానం రన్ వే మీద ల్యాండ్ అయింది. దానికి ATCలో ఉన్న అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆ విమాన పైలెట్ ఫ్లైట్ ను ల్యాండ్ చేశాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎయిర్ పోర్ట్ అన్న తర్వాత రోజుకు కొన్ని వందలాది విమానాలు ల్యాండ్ అవుతుంటాయి. అయితే అదే రన్ వేపై ఢిల్లీ-బాగ్ డోగ్రా విమానానికి కూడా ATC అధికారులు టేకాఫ్ కు అనుమతి ఇచ్చారు. ఇది కూడా విస్తారా కంపెనీకి చెందిన విమానమే కావడం గమనార్హం. ఇలా రెండు విమానాలకు ఒకే రన్ వే మీదకి ATC అధికారులు పర్మిషన్ ఇచ్చారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన విమానం ఇంకా పార్కింగ్ ప్లేస్ కు చేరుకోకుండానే వేరే విమానానికి ఆ రన్ వే మీద టేకాఫ్ పర్మిషన్ ఎలా ఇస్తారని ఇది తెలిసిన వారంతా మండిపడుతున్నారు. 

కాపాడిన కెప్టెన్

ఇలా ATC అధికారులు చేసిన మిస్టేక్ ను అహ్మదాబాద్-ఢిల్లీ విమానంలో ఉన్న 45 సంవత్సరాల కెప్టెన్ సోనూ గిల్ గుర్తించింది. వారు తప్పు చేశారని గుర్తించిన కెప్టెన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ATC అధికారులను అలెర్ట్ చేసింది. దీంతో తేరుకున్న ATC అధికారులు నష్ట నివారణ చర్యలను చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగినపుడు విమానాలు కేవలం 1.8 (1800 మీటర్లు) కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. 1.8 కి.మీ ఏమంత పెద్ద దూరం కాదు. మనం నడిచి వెళ్తే అది పెద్ద దూరమేమో కానీ ఫుల్ స్పీడ్ లో ఉండే విమానాలకు అంతే కాకుండా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ఉన్న రన్ వే మీద అది నిమిషాల్లో చేరుకునే గమ్యస్థానం.