మ‌ణిపూర్‌లో పెరుగుతున్న హింస

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను బట్టలు విప్పి, ఊరేగించి, అందరి ముందు అవమానకరంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిగిన ఘటన రోజే, మరో సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కంగ్‌పోక్పి జిల్లాలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. మునుపటి సంఘటన జరిగిన ప్రదేశానికి, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్ వాష్‌లో పనిచేస్తున్న 21 మరియు 24 ఏళ్ల ఇద్దరు యువతులు, మణిపూర్ లో జరుగుతున్న హింసకు బలి […]

Share:

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను బట్టలు విప్పి, ఊరేగించి, అందరి ముందు అవమానకరంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిగిన ఘటన రోజే, మరో సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కంగ్‌పోక్పి జిల్లాలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. మునుపటి సంఘటన జరిగిన ప్రదేశానికి, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్ వాష్‌లో పనిచేస్తున్న 21 మరియు 24 ఏళ్ల ఇద్దరు యువతులు, మణిపూర్ లో జరుగుతున్న హింసకు బలి అయిపోయారు. వారిద్దరిని అక్కడ కొంతమంది హింసకు కారణమైన వాళ్ల చేత అత్యాచారానికి గురై హత్యకు గురయ్యారు. 

అందిన సమాచారం ప్రకారం:

నివేదికల ప్రకారం, కార్ వాష్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన పురుషులు దాడి చేశారు. భయానక సంఘటనను చూసిన కార్ వాష్ లో పనిచేస్తున్న మరొక వ్యక్తి, గుంపులుగా వచ్చిన మగవారిలో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నట్లు, వాళ్లే మగవాళ్ళని ప్రేరేపించే, కార్ వాష్ లో పనిచేస్తున్న ఆ ఇద్దరు మహిళలపై దాడి జరిగేలా చూసినట్లు చెప్తున్నారు. 

బాధితురాలి బంధువు అందించిన సమాచారం ప్రకారం ప్రకారం, మే 4న 100 మందికి పైగా మెయిటీ పురుషులు మరియు మహిళలు, అందరూ కలిసి ఇద్దరు మహిళల కోసం వెతకారు. అయితే చివరికి కార్ వాష్ లో పని చేస్తున్నారని తెలిసి, అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు మహిళలపైనా దాడి చేసే, లైంగికంగా వేధింపులకు గురిచేసి  చంపేశారు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంపులుగా వచ్చిన వారు, ఆ ఇద్దరు మహిళలు దాక్కున్న గదిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దుండగులు లైట్లు ఆఫ్ చేసి, వారి అరుపులను అణిచివేసేందుకు నోటికి బట్టకట్టి, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సుమారు ఒకటిన్నర గంటల పాటు, బాధితులు ఈ హింసపూరితమైన కష్టాలను భరించారు, ఆ తర్వాత వారిని బయటకు లాగి ఒక సామిల్ దగ్గర పడేశారు. వారి బట్టలు చిరిగిపోయాయి, వారి జుట్టు బలవంతంగా కత్తిరించారు. తర్వాత వారు జరిగిన హింస కారణంగా రక్త మడుగులో చనిపోయినట్లు తెలుస్తోంది.

అయితే మొదట్లో వారిని వెతికే క్రమంలో ముఖ్యంగా, ఈ సంఘటన అవమానకరంగా ఉంటుందని, బంధువులు ఆ ఇద్దరు మహిళల గురించి గుర్తింపులు చెప్పడానికి భయపడ్డారు. అందుకే ఆ ఇద్దరు మహిళల గురించి ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే, బాధితుల్లో ఒకరి తల్లి మే 16వ తేదీన సైకుల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి ధైర్యం చేసింది. ఆమె కుమార్తె మరియు ఇతర మహిళను “అత్యాచారం మరియు దారుణంగా హింసించిన తర్వాత దారుణంగా హత్య చేశారు” అని FIRలో పేర్కొంది. ఆ తర్వాత కేసు ఇంఫాల్ జిల్లాలోని పోరంపట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం జరిగింది. బాధితుల మృతదేహాలను ఇంకా వెలికితీయాల్సి ఉందని, వారి ఆచూకీ తెలియరాలేదని, పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. దుండగుల సంఖ్య 100-200 వరకు ఉంటుందని ఫిర్యాదు ప్రకారం అంచనా వేశారు.

ఈ సంఘటనలు మణిపూర్‌లో పెద్ద పెద్ద అల్లర్లకు దారి తీస్తున్నాయి. మణిపూర్ లోని కుకీ గిరిజన గుంపులకు మరియు గిరిజనేతర గుంపుల మైతేయి మధ్య ఘర్షణలు మే 3 నుండి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కనీసం 125 మంది మరణించారు అంతేకాకుండా 40 వేల మంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం.