మాస్టర్స్ డిగ్రీలోకి మొదటి తెలంగాణ‌ ట్రాన్స్ జెండర్

భారతదేశంలోనే కాకుండా మరెన్నో దేశాలలో ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం పోరాటాలు ఇప్పటికీ జరుపుతున్నారు. ముఖ్యంగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకునే విషయంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పోరాడి ప్రస్తుతం ఎన్నో రంగాలలో స్థిరపడ్డారు కొంతమంది ట్రాన్స్ జెండర్లు. తమని చిన్న చూపు చూస్తూ, కేవలం పూట గడవడానికి అడుక్కునే వారిలా తమని భావిస్తున్న చాలామందికి, అందరికన్నా ఎత్తుకు ఎదిగి చూపిస్తున్నారు కొంతమంది ట్రాన్స్ జెండర్లు. మాస్టర్స్ చేస్తున్న ట్రాన్స్ జెండర్ రూత్ జాన్ […]

Share:

భారతదేశంలోనే కాకుండా మరెన్నో దేశాలలో ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం పోరాటాలు ఇప్పటికీ జరుపుతున్నారు. ముఖ్యంగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకునే విషయంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పోరాడి ప్రస్తుతం ఎన్నో రంగాలలో స్థిరపడ్డారు కొంతమంది ట్రాన్స్ జెండర్లు. తమని చిన్న చూపు చూస్తూ, కేవలం పూట గడవడానికి అడుక్కునే వారిలా తమని భావిస్తున్న చాలామందికి, అందరికన్నా ఎత్తుకు ఎదిగి చూపిస్తున్నారు కొంతమంది ట్రాన్స్ జెండర్లు.

మాస్టర్స్ చేస్తున్న ట్రాన్స్ జెండర్ రూత్ జాన్ పాల్: 

హైదరాబాద్‌లోని ESIC మెడికల్ కాలేజీలు మరియు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో MD చేయడానికి ఎంపికయ్యారు డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్. దేశంలో మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులో ప్రవేశం పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు కొయ్యల రూత్ జాన్ పాల్. డాక్టర్ రూత్ ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH)లో HIV/AIDSతో వ్యవహరించే ART విభాగంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె అభివృద్ధి గురించి సంతోషంగా ఉన్నప్పటికీ, ఒకవైపు సంతోషంగా లేనట్లు తెలుస్తోంది.

ఎందుకంటే తనకి గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రంలో ప్రత్యేకించి కోర్సు చేయాలని ఉన్నప్పటికీ, తనకి ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు పాథాలజీలో మాత్రమే ఆప్షన్స్ ఎంపిక చేసుకునే అవకాశం దొరికింది అంటూ చెప్పుకొచ్చింది రూత్ జాన్ పాల్. ట్రాన్స్‌పర్సన్‌గా అడ్మిషన్ పొందుతున్నందుకు సంతోషంగా ఉంది, కానీ ఇది తాను ఇష్టపడే కోర్సు కాదు అని పిజి అడ్మిషన్ పొందడానికి న్యాయ పోరాటంలో ఉన్న డాక్టర్ రూత్ సౌత్ అన్నారు.

ఆమె కేవలం షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళగా మాత్రమే గుర్తింపు పొందింది, అయితే ఆమె గుర్తింపులో ట్రాన్స్‌వుమన్ కూడా చేర్చేందుకు, ఆమె నేషనల్ మెడికల్ కమిషన్ మరియు కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS)కి వ్యతిరేకంగా ఒక కేసుతో పోరాడుతోంది.

ఆగస్టు 25న ప్రారంభమయ్యే రెండో రౌండ్ కౌన్సెలింగ్ లో, గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ రూత్‌కు, రెండు ముఖ్యమైన అనుభవాలు ఆమె డాక్టర్ కావాలనే నిర్ణయానికి పునాదులు వేసినట్లు తెలుస్తోంది.

అందుకే డాక్టర్ అవ్వాలనుకున్న రూత్: 

కేవలం ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తను కొంతమంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను కలిసిన వారిలో HIV మరియు క్షయవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కూడా ఉన్నారు. అయితే వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఎన్ని హాస్పిటల్స్ తిరిగినప్పటికీ ఆమెకు చేదు అనుభవం ఎదురైందని ట్రాన్స్ జెండర్ కారణంగానే తనకి సరైన వైద్యం దొరకక ఆమె కష్టాలను చూసిన తాను చివరికి ఆమె మరణించడం కూడా చూశాను అని డాక్టర్ రూత్ చెప్పారు.

అంతేకాకుండా వ్యాధుల కారణంగా, సరైన చికిత్స అందకుండా చనిపోయిన ఆమె గురించి మాట్లాడిన మరో వ్యక్తి, అసలు సమాజం తనలాంటి వారిని ఎలా నిర్లక్ష్యం చేసిందనే దాని గురించి తన వేదనను వ్యక్తం చేసిందని.. ముఖ్యంగా ఈ విషయాలు తనని బాగా ప్రభావితం చేసిందని రూత్ తన అనుభవాలు చెప్పింది. అంతేకాకుండా, ఆ చిన్న వయస్సులోనే చికిత్స దొరకక మరి ఏ ట్రాన్స్ జెండర్ వ్యక్తులు మరణించకూడదని నిర్ణయించుకున్నట్లు, తప్పకుండా ట్రాన్స్జెండర్లకు తనవైపు నుంచి చికిత్స చేయడానికి డాక్టర్‌ని కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది డాక్టర్ రూత్. ముఖ్యంగా ఆర్థిక స్థోమత విషయంలో తాను ఎంతగానో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది, చిన్నతనంలో సరైన విద్య తీసుకునేందుకు తమకు ఆర్థిక స్తోమత లేకపోవడం కారణమే అని, అయితే ఎటువంటి అవరోధాలు ఎదురైనప్పటికీ తాను కచ్చితంగా డాక్టర్ అయితీరాల్సిందిగా అప్పుడే నిర్ణయించుకున్నట్లు తన అభిలాషను బయటపెట్టింది డాక్టర్ రూత్.