ఉత్తరప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌లు

దేశవ్యాప్తంగా భారీ  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.  కొన్ని చోట్ల పిడుగుపడి మృతి చెందిన కేసులు కూడా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కురిసిన భారీ […]

Share:

దేశవ్యాప్తంగా భారీ  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 

కొన్ని చోట్ల పిడుగుపడి మృతి చెందిన కేసులు కూడా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. 

లక్నో, బారాబంకితో సహా అనేక ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. చాలా ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిది. సెప్టెంబర్‌‌ 14 (గురువారం) వరకు దేశంలోని పలు ప్రాతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. 

ఒడిశాలో అతి భారీ వర్షాలు..

ఒడిశాలోని పలు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. అలాగే, ఉత్తరాఖండ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, తూర్పు మధ్యపరదేశ్‌, విదర్భ, చత్తీస్‌గఢ్‌, జార్ఖడ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌‌, మిజోరాం త్రిపురలోని ఐసోలేటేడ్ ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 

అండమాన్‌, నికోబార్‌‌ దీవుల్లోని పలు ప్రాంతాల్లో  పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశంఉంది. తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌, తూర్పు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, చత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌‌, జార్ఖండ్‌, ఒడిశాలోని తీర ప్రాతాల్లోని పలు ప్రదేశాల్లో మెరుపులతో కూడిన వర్షాలు పడే  అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, యానాం, ఉత్తర ఇంటీరియర్‌‌ కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌, కేరళ, మాహేలో కూడా వర్షాలు పడతాయని వెల్లడించిది. 

ఉత్తప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో సెప్టెంబర్‌‌ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, సెప్టెంబర్  17 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని రిలీఫ్‌ కమిషనర్‌‌ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో కూడా సెప్టెంబర్ 17 వరకు మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వెల్లడించింది. 

ఇటావా, ఔరైయా, గోండా, కన్నౌజ్,అయోధ్య, బస్తీ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, లక్నో, లఖింపూర్‌‌ ఖేరీలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున స్కూళ్లను మూసివేయాలని, వర్షాలు పడే టైమ్‌లో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు కోరారు. అన్ని ప్రైమరీ స్కూళ్లల్లో నిపుణ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఎన్‌ఏటీ) పరీక్షలు కూడా సోమవారం నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 

ఉత్తరాఖండ్‌..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, చంపావత్‌, నైనిటాల్‌, ఉధమ్  సింగ్ నగర్‌‌ జిల్లాల్లో సెప్టెంబర్‌‌ 13 (బుధవారం) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో 12 జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. 

తెహ్రీ, బాగేశ్వర్‌‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాల వల్ల కొడచరియలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల పలు ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో చంపావత్‌, ఉధమ్‌ సింగ్‌ నగర్‌‌లోని స్కూళ్లను మూసివేశారు.

రాజస్థాన్‌…

రాబోయే కొద్ది రోజుల్లో రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయ తెలిపింది. సెప్టెంబర్‌‌ 12, 13 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌లోని పలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, 24 గంటల్లో ధోల్‌పూర్‌‌, బన్‌స్వారా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ధోల్‌పూర్‌‌లో అత్యధికంగా 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా భరత్‌పూర్‌‌,జైపూర్‌‌, కోట, ఉదయ్‌పూర్‌‌, అజ్మీర్‌‌ డివిజన్‌లలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైందని వాతావరణ కార్యాలయం తెలిపింది. 

ఇతర రాష్ట్రాలకు వర్ష సూచన..

ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులతో అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే, తూర్పు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కోస్తా ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తెలంగాణలలో కూడా రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.నాగాలాండ్‌, మణిపూర్‌‌, మిజోరాం, త్రిపురలలో సెప్టెంబర్‌‌ 11 నుంచి 15 మధ్య వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ కార్యాలయం తెలిపింది.