కన్న కూతుర్ని కాలువలో పారేసిన  తండ్రి

మనం చాలా చోట్ల చిన్న పిల్లలను చెత్తబుట్టలలో పడేయడం, బుట్టలో పెట్టి నడిరోడ్డు మీద వదిలేయడం చూసే ఉంటాము. ఇలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక తండ్రి తన కన్న కూతుర్ని నార్వన బ్రాంచ్ కెనాల్ లో పారేస్తున్నప్పుడు, సరిగ్గా అదే సమయానికి అక్కడినుండి వెళ్తున్న శివ భక్తుడు చూసి ఆ చిన్నారిని కాపాడాడు.  జరిగిన సంఘటన: బల్కర్ సింగ్, అలాగే వారి రెండవ భార్య పెహోవా లో నివాసం ఉంటున్నారు. అయితే వీరికి ఇద్దరు […]

Share:

మనం చాలా చోట్ల చిన్న పిల్లలను చెత్తబుట్టలలో పడేయడం, బుట్టలో పెట్టి నడిరోడ్డు మీద వదిలేయడం చూసే ఉంటాము. ఇలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక తండ్రి తన కన్న కూతుర్ని నార్వన బ్రాంచ్ కెనాల్ లో పారేస్తున్నప్పుడు, సరిగ్గా అదే సమయానికి అక్కడినుండి వెళ్తున్న శివ భక్తుడు చూసి ఆ చిన్నారిని కాపాడాడు. 

జరిగిన సంఘటన:

బల్కర్ సింగ్, అలాగే వారి రెండవ భార్య పెహోవా లో నివాసం ఉంటున్నారు. అయితే వీరికి ఇద్దరు కూతుర్లు. ఈ మధ్యకాలంలోనే, భార్య భర్తల మధ్య గొడవ జరిగి, భార్య తన పుట్టింటికి వెళ్ళింది. భార్య తిరిగి రాకపోవడంతో భర్త కోపంతో తన ఇద్దరు కూతుళ్ళని కెనాల్ లో పారేయడానికి బయలుదేరాడు. ఒక అమ్మాయిని కెనాల్ నీళ్లల్లోకి తోసేసిన తర్వాత, ఇంకొక అమ్మాయిని నీళ్లల్లోకి తోసెయ్యబోతుండగా ఆ చిన్నారి ఏడ్చేసరికి పోలీసులు వస్తారని భయంతో అక్కడి నుండి ఫరారు అయ్యాడు పిల్లల తండ్రి.

అయితే అక్కడ జరుగుతుందంతా గమనించిన ఒక శివ భక్తుడు కెనాల్లో దూకి ఆ చిన్నారిని కాపాడాడు. తర్వాత వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసాడు. రావుగార్ ఊర్లోని కన్వరీయా సెంటర్ నుండి ఆ చినార్ని పోలీసులు తీసుకున్నారు. బల్కార్ సింగ్ ఇంటికి వచ్చి తన భార్యకి ఫోన్ చేసి ఈ సంఘటన గురించి చెప్పాడు.

విషయం తెలుసుకున్న భార్య మరుసటి రోజు ఇంటికి వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్లి అన్ని వివరాలు  చెప్పింది. విచారణ చేసి పోలీసులు బాల్కర్ సింగ్ ని అరెస్ట్ చేశారు. 

ఇలాంటి మూర్ఖపు పనులు చేయకూడదు: 

ఎంతో చక్కగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితాన్ని చిన్నచిన్న గొడవలు వల్ల చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది కుటుంబాలు. తన భార్య మీద కోపాన్ని తన ఇద్దరు చిన్న పిల్లల మీద చూపించడం అనేది నిజానికి అమానుషం. గొడవ పడిన అనంతరం ఏదో ఒక సర్ది చెప్పుకుని రాజీ పడాలి కానీ ఇలాంటి, దుర్మార్గపు పనులు ఎంచుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఒకవేళ ఆ పిల్ల చనిపోయి ఉండుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?? ఇప్పుడు భార్య మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపించడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. అసలు ఇలాంటి దుర్మార్గపు పనులు కలలోనైనా ఆలోచించకూడదు. కుటుంబాన్ని సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి తప్పిస్తే, ప్రాణాలు తీసి, కోపాన్ని, పగని తీర్చుకోవడం సరైన పద్ధతి కాదు. 

దేశం ఎటుపోతుంది: 

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో నేరాలు-ఘోరాలు ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. దేశంలో ఉంటున్న ఆడపిల్లలకు రక్షణ కొదవ అయిందని ఇలాంటి వార్తలు వింటేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా, తమ పనులు తమ చేసుకోవాలి అన్నా, పోకిరి వాళ్ళ వెకిలి చేష్టలు కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను కూడా విడిచిపెడుతున్నారు. 

మేమున్నాం అంటున్న షీ టీం: 

ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల ఆడపిల్లలకు గాని ఆడవాళ్లకు గాని అసలు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఆడవాలని వేధించడం, వెకిలి చేష్టలు వేయడం కొంతమందికి అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు షీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆడవాళ్లు ఎక్కడ ఉన్నా వారు ఒకవేళ వేధింపులకు గురి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు షీ టీం.