125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం కేసీఆర్

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఆయన జయంతి రోజే జరగడం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి ఆవిష్కరించారు. బౌద్ధ గురువులు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు ప్రజా ప్రతినిధులు తిలకించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా జనం పెద్ద సంఖ్యలో […]

Share:

భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఆయన జయంతి రోజే జరగడం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి ఆవిష్కరించారు. బౌద్ధ గురువులు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్, మంత్రులు ప్రజా ప్రతినిధులు తిలకించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. పూల వర్షాన్ని సీఎం కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా చప్పట్లతో స్వాగతించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ ‘జై భీమ్’ అంటూ నినాదాలు చేశారు.  దేశంలోనే అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఇదే కావచ్చు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని ఎత్తు 125 అడుగులు.  విగ్రహం మొత్తం ఎత్తు 175 అడుగులు, విగ్రహం మొత్తం బరువు 47 4 టన్నులు అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.  ఆర్మీచర్ నిర్మాణం కోసం 360 టన్నుల ఉక్కును ఉపయోగించారు. విగ్రహం తాపడం కోసం 114 టన్నుల కాంస్యాన్ని ఉపయోగించారు.  దీనికోసం మొత్తం 147 కోట్ల మేర వెచ్చించినట్లు సమాచారం. విగ్రహ పీఠం కింద మ్యూజియం, గ్యాలరీ, ఆడియో విజువల్ గది ఏర్పాటు చేశారు.

అంబేద్కర్ విగ్రహం కాదు. ఒక విప్లవం, ఆయన తెలంగాణ కలల సాకార దీపిక. బాబాసాహెబ్ మహానుభావుడు. ఆయన సిద్ధాంతం విశ్వజననీయం. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటినా దళితులకు అణగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో దళితుల అభివృద్ధి కోసం లక్షా పాతిక వేల కోట్లు ఖర్చు చేశామని, ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి తీరతామని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న వారిని గౌరవించుకునేలా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అవార్డు అందజేస్తుందని ప్రకటించారు.

అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ.. దేశంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని, మార్పు కోసం యుద్ధం చేయాల్సిన అవసర పరిస్థితి ఉందని ఆయన అన్నారు. దేశంలో మతపరమైన అల్ప సంఖ్యాక వర్గాలు మాత్రమే లేవని కులపరమైన మైనారిటీలు కూడా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో కార్యాచరణ మొదలుపెట్టే మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కోరారు.