మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో, మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరికొన్ని సంవత్సరాల్లో పూర్తి చేయనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, ఢిల్లీలో ఉన్న యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా వర్చువల్గా,108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి ఈ ఆదివారం శంకుస్థాపన చేశారు. తన చేతులు మీదుగా మొదలు పెట్టిన విగ్రహం త్వరలోనే పూర్తి కావాలని కోరుకున్నట్టు వెల్లడించారు. శ్రీరాముని విగ్రహం విశేషాలు:  ఈ విగ్రహం కట్టడానికి సుమారుగా 300 కోట్లు అవుతుందని, […]

Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో, మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరికొన్ని సంవత్సరాల్లో పూర్తి చేయనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, ఢిల్లీలో ఉన్న యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా వర్చువల్గా,108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి ఈ ఆదివారం శంకుస్థాపన చేశారు. తన చేతులు మీదుగా మొదలు పెట్టిన విగ్రహం త్వరలోనే పూర్తి కావాలని కోరుకున్నట్టు వెల్లడించారు.

శ్రీరాముని విగ్రహం విశేషాలు: 

ఈ విగ్రహం కట్టడానికి సుమారుగా 300 కోట్లు అవుతుందని, అది జైశ్రీరామ్ ఫౌండేషన్ అండర్ లో విగ్రహ పనులన్నీ పూర్తి అయ్యేలా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకుముందు గుజరాత్ లో, ఇదే తరహాలో భారీ బడ్జెట్ తో సర్దార్ పటేల్ స్టాట్యూ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్మాణం ప్రపంచంలోనే అరుదైన నిర్మాణంగా గుర్తించబడింది. అలాంటి డిజైన్ రూపకల్పన చేసిన ఆర్టిస్టులతో ప్రస్తుతం శ్రీరాముని విగ్రహాన్ని డిజైన్ చేయిస్తున్నట్లు తెలిపారు.

శ్రీరాముని ఆలయం కూడా దాదాపు పది కోట్ల ఖరీదైన స్థలంలో, ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న మంత్రాలయానికి ఆనుకొని, శ్రీరాముని విగ్రహానికి ఎదురుగా నిర్మాణానికి సిద్ధమవుతుంది. అయితే ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందుతుంది అని, ఎందుకంటే, రామాలయం నిర్మాణం కోసం ఎంపికైన చాలామంది కళాకారులు శిల్పి కలలో చాలా ప్రావీణ్యం కలవాలని చెప్పారు. ఏ వేలు అనే ఆర్కిటెక్ట్ సూచనలతో నిర్మాణాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆలయాలు వాటి ప్రాముఖ్యతలు: 

కేవలం శ్రీ రాముని విగ్రహ నిర్మాణం అదేవిధంగా రామాలయం కట్టడమే లక్ష్యం కాదని, భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అయితే ప్రణాళిక లిస్టులో, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, సింహాచలంలో నరసింహ స్వామి ఆలయం,  బద్రీనాథ్ ఆలయం, కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, కర్ణాటకలో నారాయణస్వామి ఆలయం, తమిళనాడులో ముషణం వరాహస్వామి ఆలయం మరియు మహారాష్ట్రలో వితోబా రుక్మిణి ఆలయం, ఇవి ముఖ్య ప్రణాళికలు అని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు వేల ప్రసిద్ధి ఆలయాలు ఉన్నట్లు తేలింది. వాటిలో ముఖ్యమైనవి మరియు ప్రధానమైనవి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సింహాచలంలో నరసింహ స్వామి ఆలయం మొదలగు ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి. మన భారతదేశంలో హిందూ ఆలయాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. మన భారతదేశా ఆలయాలకు మనదేశంలోనే కాకుండా మరెన్నో దేశాలలో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఎప్పటినుంచో వందల చరిత్రల గల ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఆలయాల నిర్మించిన చిత్ర శిల్ప కళాకారుల గురించి మరియు వాళ్ళ కళను గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.

భారతదేశంలో ఆలయాలను దర్శించుకోవడానికి మరియు సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉండే ఆలయాలకు మరియు వాటి చరిత్రకు ప్రత్యేక స్థానం కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ప్రతి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉండే సూర్య దేవుని ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయానికి పూరితమైన చరిత్ర కలదు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి చాలామంది ప్రజలు మరియు భక్తులు తరలి వెళ్తారు.

యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా తెలిపిన వివరాలు ప్రకారం, మరో రెండు సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో విగ్రహ నిర్మాణం పూర్తవుతుందని మరియు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా శ్రీరాముని  ఆలయాలు వస్తాయని. ఆ ప్రాంతం చాలా చాలా పవిత్రంగా మారబోతుందని, దాదాపు 300 కోట్ల రూపాయలను విగ్రహ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరాముని విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా చరిత్రను నిలుస్తుంది అన్నారు.