Asaduddin Owaisi: రాహుల్ ఒంటరితనంలో ఉన్నారు.. చికిత్స అవసరం..

ఘాటు వ్యాఖ్యలు చేసిన ఓవైసీ

Courtesy: Twitter

Share:

Asaduddin Owaisi: ఏఐఎంఐఎం(AIMIM) మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. గతంలో గెలిచిన 7 స్థానాలు తిరిగి గెలుస్తామని, అయితే ఈసారి పోటీకి దిగుతున్న మరో రెండు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)  ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంఐఎం(MIM) , బీఆర్ఎస్(BRS) రెండూ ఒకటేనని ఈ రెండు పార్టీలు బీజేపీకి(BJP) బీ టీం అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) మండిపడ్డారు. రాహుల్ గాంధీకి (Rahul Gandhi) 50 ఏళ్ల వయసు దాటిందని, ఇప్పుడాయన ఒంటరితనంతో బాధపడుతున్నారని, ఆయన వెంటనే చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని మూడు అంశాల్ని ఓవైసీ ప్రస్తావించారు.

ఏఐఎంఐఎం-బీఆర్‌ఎస్‌ను బీజేపీకి బీ టీమ్‌గా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మార్చుతున్నారు. దీనికి ఒవైసీ బదులిస్తూ.. ‘‘ఆర్టికల్ 370పై ఎందుకు రాహుల్‌ను ఎందుకు మాట్లాడరు? ట్రిపుల్ తలాక్ (Triple Talaq)పై ఎందుకు మాట్లాడరు? దేశవ్యాప్తంగా ముస్లింలపై మూకుమ్మడి హత్యలు జరుగుతున్నాయి, దానిపై ఎందుకు మాట్లాడరు? ఈ విషయాలపై మాట్లాడేందుకు రాహుల్ ఎందుకు భయపడుతున్నారు?’’ అని ఓవైసీ ప్రశ్నించారు.

ప్రతి హింసాకాండను రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఖండిస్తారని, అయితే రాజస్థాన్‌లో జునైద్(Junaid), నసీర్(Naseer) హత్యకు గురైనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లలేదని ఒవైసీ(Asaduddin Owaisi) నిలదీశారు. రాహుల్ నిజానికి సాఫ్ట్ హిందుత్వాన్ని అనుసరించడం లేదని, హిందుత్వ భావజాలాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై (Muslim reservations) రాహుల్ ఎందుకు మాట్లాడరని, ఒక విధంగా ఈ సమస్యలను ఆయన అవుట్సోర్స్ చేస్తారని అన్నారు.

రాహుల్ గాంధీకి (Rahul Gandhi) 50 ఏళ్లు నిండాయని హైదరాబాద్ ఎంపీ అన్నారు. ‘‘ఆయన ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. రాహుల్‌ను ఒంటరితనం తినేస్తోంది. ఈ ఒంటరితనాన్ని అధిగమించాలంటే రాహుల్ చికిత్స చేయించుకోవాలి. హైదరాబాద్‌లో(Hyderbad) చాలా మంది మంచి వైద్యులున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లాలో నేను చెబుతాను. రాహుల్ అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు’’ అని ఓవైసీ అన్నారు.

మోడీకి ఓవైసీ(Asaduddin Owaisi) , కేసీఆర్(KCR) లిద్దరు మోడీకీ ప్రాణస్నేహితులని కాంగ్రెస్​(Congress) పార్టీ విషప్రచారం చేస్తుందని, ఇలాంటి ప్రచారాలకు మజ్లిస్​ భయపడదని హెచ్చరించారు. ప్రియురాళ్ల కోసం చార్మినార్​, తాజ్​మహల్​, గోల్కొండ లను బాద్​షాలు నిర్మించారని, పేదోల బతుకులు బాగుపడాలన్న ఉద్దేశ్యంతో ఐటీ టవర్(IT Tower)​ లక్ష్యంగా మజ్లిస్​ పార్టీ కృషిచేస్తుందన్నారు.

ఐటీ హబ్​తో లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని మైనార్టీలకు భరోసా కల్పించారు. కాంగ్రెస్​ పార్టీ (Congress) ఆరు గ్యారంటీలంటూ విషప్రచారం చేస్తుందని, వాటి నమ్మే పరిస్థితుల్లో మైనార్టీలు లేరన్నారు. హైదరాబాద్​ నగరం పేరు మార్చాలనుకుంటున్న బీజేపీకి(BJP) సరైన రీతిలో బుద్ది చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​, బీజేపీలు బయటికి మాత్రం శత్రువులుగా చూపించేందుకు పోటీ పడుతున్నారని, లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్నారు.

సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ముస్లిం మైనార్టీలు నివాసం ఉంటున్న జల్​పల్లి మున్సిపాలిటీపై (Jalpally Municipality) ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఆమెను గెలిపించాలని మజ్లిస్​ పార్టీ బహిరంగంగానే మద్దతు తెలుపుతుందన్నారు. ప్రతి ముస్లిం కేసీఆర్​ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమం లో మజ్లిస్ పార్టీ జల్ పల్లి ఇంచార్జ్ అహ్మద్ సాది, మాజీ మండల ఉపాధ్యక్షులు ఓమర్ బామ్, జల్ పల్లి మున్సిపాలిటి చైర్మన్ అబ్దుల్లా సాది,జల్ పల్లి మున్సిపాలిటి బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) నవంబర్ 30న పోలింగ్(Polling) జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు కూడా అదే రోజున వస్తాయి. కాగా, ఏఐఎంఐఎం మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. గతంలో గెలిచిన 7 స్థానాలు తిరిగి గెలుస్తామని, అయితే ఈసారి పోటీకి దిగుతున్న మరో రెండు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని ఓవైసీ(Asaduddin Owaisi) ఆశాభావం వ్యక్తం చేశారు.