మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే మీ మోముకి జింక్ కావాల్సిందే..

యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్.. తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి గాయాలను త్వరగా నయం చేసే శక్తి ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం, శిరోజాల సంరక్షణలోనూ కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా అందంగా మెరిసిపోవాలని అనుకునేవారు మాత్రం జింక్ లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఎంచుకుంటే చాలా మంచిది జింక్ వలన కలిగే చర్మ ప్రయోజనాలు ఏమిటి.. జింక్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ […]

Share:

యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్.. తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి గాయాలను త్వరగా నయం చేసే శక్తి ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం, శిరోజాల సంరక్షణలోనూ కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా అందంగా మెరిసిపోవాలని అనుకునేవారు మాత్రం జింక్ లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఎంచుకుంటే చాలా మంచిది జింక్ వలన కలిగే చర్మ ప్రయోజనాలు ఏమిటి.. జింక్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇన్ని ప్రయోజనాలున్న జింక్ లభించే వివిధ ఆహార పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

చర్మ సంరక్షణలో ఏ విధమైన నిర్లక్ష్యం మంచిదికాదు. స్కిన్ కేర్ కోసం సరైన ప్రొడక్ట్‌ను ఎంచుకోవల్సి ఉంటుంది. చాలా రకాల చిట్కాలు కూడా చర్మ సంరక్షణలో దోహదపడతాయి. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..

చర్మ సంరక్షణలో కీలకంగా ఉపయోగపడేవి రెండు. ఒకటి మాయిశ్చరైజర్, రెండవది సన్‌స్క్రీన్. 

జింక్ మాయిశ్చరైజర్

 చర్మాన్ని తేమగా అంటే హైడ్రేట్‌గా ఉంచేందుకు మాయిశ్చరైజర్ వాడతాము. చలికాలంలో చర్మం సహజంగానే ఎండిపోతుంటుంది. అందుకే చలికాలంలో మాయిశ్చరైజర్ అధికంగా వినియోగిస్తుంటారు. రాత్రి నిద్రపోయే ముందు లేదా స్నానం తరువాత రాయాలి. జింక్ ఆక్సైడ్ కలిగి ఉన్న మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకుంటే, మీ ముఖంపై ఉన్న మొటిమలను తొలగిస్తుంది. అలాగే జింక్ కంటెంట్ కలిగి ఉన్న మాస్క్ సీరం, మాస్క్, మాయిశ్చరైజర్  లలో జింక్ సల్ఫేట్ ఎక్కువగా వాడతారు. వీటిని ఓవర్ నైట్ స్పాట్ రిడక్షన్ క్రీమ్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మొటిమలు వాటి వల్ల కలిగే నొప్పి, బాధను భరించడానికి కూడా ఈ క్రీమ్ అద్భుతంగా సహాయపడుతుంది. 

సన్‌స్క్రీన్

ఎండలో తిరిగేటప్పుడు ట్యానింగ్, హాని కలిగించే కిరణాల నుంచి రక్షించే క్రీమ్‌ని సన్‌స్క్రీన్ అంటారు. సూర్య కిరణాలు నేరుగా శరీరంలో ఏ భాగంపై పడతాయో ఆ భాగంపై సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ను సన్‌బ్లాక్, సన్‌బర్న్, సన్‌ట్యాన్ లోషన్‌గా కూడా పిలుస్తారు. జింక్ ఆక్సైడ్ ఒక పవర్‌ఫుల్ సన్‌స్క్రిన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది యువిఏ కిరణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందువలన జింక్ ఆక్సైడ్ సంస్కృతి రాసుకుంటే యు వి ఏ స్పెక్ట్రమ్‌ను అందించడానికి 20 నుంచి 25% ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా మినరల్ సన్‌స్క్రీన్‌లకు కూడా ఇది బాగా పని చేస్తుంది. సన్‌స్క్రీన్ ఉపయోగించిన తర్వాత మిగిలిపోయిన భాగాన్ని మొత్తాన్ని మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ రేణువులు ప్రోడక్ట్ చేయడానికి సహాయపడతాయి. చర్మ సంరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 

 మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రెండూ చర్మ సంరక్షణకు చాలా అవసరం. చర్మం డ్రైగా ఉన్నప్పుడు రెండూ వినియోగించవలసి ఉంటుంది. డ్రైగా లేకపోతే మాత్రం కేవలం సన్‌స్క్రీన్ వినియోగిస్తే సరిపోతుంది. ఈ రెండింటినీ ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేది గుర్తుంచుకోవాలి. మాయిశ్చరైజర్‌ను ఎప్పుడూ సన్‌స్క్రీన్ కంటే ముందు రాయాలి.

కళ్ళ కింద డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్లు జింక్ కంటెంట్ కలిగి ఉన్న అండర్ ఐ క్రీమ్‌ను లేదంటే సీరంను వాడితే డార్క్ సర్కిల్స్ త్వరగా పోయి మీ చర్మం మిలమిలా మెరిసిపోతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్లు కూడా జింక్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తో బాధపడుతున్న వారు జింక్ ఆక్సైడ్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.  చర్మ సంరక్షణలో జింక్ ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారి స్కిన్‌కి గ్లోని అందిస్తుంది. 

చికెన్, గుడ్లు,రెడ్‌మీట్‌, బీఫ్‌, షెల్‌ఫిష్‌, సాల్మన్‌ చేపలు,  మొదలైన వాటిలో జింక్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి సరిపడా జింక్‌ను పుష్కలంగా పొందవచ్చు. శాకాహారులైతే కొన్ని రకాల ఆహార పదార్థాలను మిల్లెట్స్, నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలో జింక్ స్థాయులను పెంచుకోవచ్చు.