Relationship: మీ రిలేషన్‌ ప్రేమ లేదా ఒంటరితనంపై ఆధారపడి ఉందా..?

Relationship : రిలేషన్‌షిప్‌ (relationship) సరైన మార్గంలోనే వెళ్తుందా అని తెలుసుకోవడానికి కొంతమంది అధ్యయనం చేశారు. రిలేషన్‌షిప్‌లో అంతర్లీనంగా తనకు తానుగా ప్రేరణ పొందుతారని తెలుసుకున్నారు.సంబంధం అనేది ప్రేమ.. ఒంటరితనంపై ఆధారపడి ఉంది అనే తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలను రెడీ చేశారు. వాటి ద్వారా మన రిలేషన్‌షిప్‌ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మనుషుల రిలేషన్‌షిప్‌లో ఉన్న చిక్కులను అన్వేషిస్తూ, కొంతమంది కొన్ని అంశాలను తీసుకొని అధ్యయనం చేశారు. ఇందులో రిలేషన్‌షిప్‌పై అంతర్లీనంగా తనకు తానుగా ప్రేరణ (Motivation) […]

Share:

Relationship : రిలేషన్‌షిప్‌ (relationship) సరైన మార్గంలోనే వెళ్తుందా అని తెలుసుకోవడానికి కొంతమంది అధ్యయనం చేశారు. రిలేషన్‌షిప్‌లో అంతర్లీనంగా తనకు తానుగా ప్రేరణ పొందుతారని తెలుసుకున్నారు.సంబంధం అనేది ప్రేమ.. ఒంటరితనంపై ఆధారపడి ఉంది అనే తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలను రెడీ చేశారు. వాటి ద్వారా మన రిలేషన్‌షిప్‌ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

మనుషుల రిలేషన్‌షిప్‌లో ఉన్న చిక్కులను అన్వేషిస్తూ, కొంతమంది కొన్ని అంశాలను తీసుకొని అధ్యయనం చేశారు. ఇందులో రిలేషన్‌షిప్‌పై అంతర్లీనంగా తనకు తానుగా ప్రేరణ (Motivation) పొందుతారని తెలుసుకున్నారు. ఎవరితోనైనా మీ రిలేషన్‌షిప్‌ నిజంగా భావోద్వేగ (Emotional) సంబంధమైనదా? లోతైన ఆప్యాయత (Affection) కలిగి ఉన్నదా? మీ ఆసక్తులను ఇతరులతో పంచుకోవడం వల్లనా? లేదా ఒంటరితనం వల్లన? అనేది తెలుస్తుంది. కొన్నికొన్ని సార్లు ప్రేమ (Love), ఒంటరితనం (Loneliness) మధ్య భయం కూడా ఉండవచ్చు. అంతేకాకుండా మంచి రిలేషన్‌షిప్‌ లేని సంబంధాల్లో అవి ఎందుకు అలా ఉన్నాయో నిజమైన కారణాన్ని గుర్తించడం చాలా కష్టం. అందుకే మీరు మీ రిలేషన్‌షిప్‌ను అంచనా వేయడానికి కొంత సమయం కేటాయించాలి. మీ మధ్య ఉన్నది ప్రేమా లేదా ఒంటరితనమా అనేది నిర్ణయించుకోవాలి. మీ సంబంధం ఒంటరితనంపై ఆధారపడి ఉందని మీరు తెలుసుకుంటే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.   

క్లింటన్ పవర్, రిలేషన్‌ షిప్‌ కౌన్సెలర్ , మ్యారేజ్ థెరపిస్ట్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో మీ రిలేషన్‌షిప్‌కు పునాది ప్రేమా (Love), ఒంటరితనమా (Loneliness) అని నిర్ణయించడంలో మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఇక్కడ పంచుకున్నారు.

మీరు ఎందుకు కలిసి ఉన్నారు..?

ప్రేమ: మీరు ఒకరికొకరు కలిసి ఉండటాన్ని నిజంగా ఆనందిస్తారు. ఒకరి ఆలోచనలను, కలలను, లక్ష్యాలను మరొకరు మద్దతు ఇస్తారు. బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. 

ఒంటరితనం: మీరు ఒంటరిగా ఉండటానికి భయపడతారు. మీరు రిలేషన్‌లో లేనప్పుడు లైఫ్‌ ఇన్‌కంప్లీట్‌గా ఉందని భావిస్తారు.

మీరు వేరుగా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

ప్రేమ: కచ్చితంగా మీరు మీ భాగస్వామిని కోల్పోతారు. కానీ, మీరు వేరుగా లేదా ఒంటరిగా ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటారు.

ఒంటరితనం: మీ పార్ట్‌నర్‌‌ మీ దగ్గర లేనప్పుడు ఏదో కోల్పోయినట్లుగా భావిస్తారు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నట్లు, ఆత్రుతతో ఉంటారు.

మీరు వివాదాలు/విభేదాలను ఎలా హ్యాండిల్‌ చేస్తారు?

ప్రేమ: మంచి ప్రవర్తనతో విభేదాలు, వివాదాలను పరిష్కరించుకుంటారు. అలాగే, పార్ట్‌నర్‌‌ కోణంలో కూడా ఆలోచించి, అతను/ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరూ కలిసి కూర్చొని, మాట్లాడుకొని సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటారు.

ఒంటరితనం: మీలో భయం ఉన్నందున మీరు వివాదాలకు దూరంగా ఉంటారు. వివాదాలు పెద్దవి అయితే విడిపోవడానికి దారి తీస్తుంది. అంటే మళ్లీ ఒంటరిగా ఉండేందుకు చాన్స్ ఉంది.

మీ ఫ్రెండ్స్‌ సంగతి ఏంటి?

ప్రేమ: లవ్‌లో రిలేషన్‌షిప్‌, ఫ్రెండ్షిప్‌ మధ్య సమానమైన బ్యాలెన్స్‌ ఉంటుంది. 

ఒంటరితనం: మీ ఫ్రెండ్స్‌ మిమ్మల్ని చూడలేరు. ఎందుకంటే మీ రిలేషన్‌పైనే మీ దృష్టంతా ఉంటుంది. ఒంటరితనంలో వేరే వాళ్లను పట్టించుకునే పరిస్థితి ఉండదు. 

మీ ఆత్మగౌరవం (Self Esteem) ఎలా ఉంటుంది?

ప్రేమ: మీ ఆత్మగౌరవం ధృడమైంది. మీ రిలేషన్‌షిప్‌లో స్వతంత్రంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నా.. కలిసి ఉన్నా..ఈ విషయంలో గుడ్‌ ఫీల్‌ ఉంటుంది.

ఒంటరితనం: మీ ఆత్మగౌరవం అనేది రోలర్ కోస్టర్ రైడ్. ఇది మీ రిలేషన్ షిప్‌ స్టేటస్‌తో ముడిపడి ఉంటుంది. మీరు ఎవరితోనైనా ఉన్నప్పుడు మాత్రమే మీ గురించి మంచి అనుభూతి చెందుతారు.

మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి?

ప్రేమ: మీరు మీ భాగస్వామితో భవిషత్యును ఊహించుకుంటారు. కానీ, మీకు మీ సొంత లక్ష్యాలు, కోరికలు కూడా ఉంటాయి.

ఒంటరితనం: మీ భవిష్యత్తుపై క్లారిటీ ఉండదు. మీ ప్లాన్స్‌ అన్నీ ఎక్కువగా మీ భాగస్వామి చుట్టూనే తిరుగుతాయి. 

మీరు లైఫ్‌లో అన్ని నెరవేర్చినట్లు భావిస్తున్నారా?

ప్రేమ: మీరు ప్రస్తుత రిలేషన్‌షిప్‌లో సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. అయితే, లైఫ్‌లో ఇతర అంశాల్లో కూడా మీరు సంతృప్తిని పొందాలని కోరుకుంటారు. ఒంటరితనం: మీరు మీ పార్ట్‌నర్‌‌తో ఉన్నప్పుడు మాత్రమే లైఫ్‌ గురించి ఆలోచిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఆలోచనలను మీరు రానివ్వరు.