బ్రేక్ ఫాస్ట్ లో ఇవి మాత్రం తీసుకోవద్దు.. 

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ అనేది తప్పకుండా చేయాలి.. ఉదయం మనం బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకునే ఆహారం మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ విషయంలో మాత్రం మనం పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.  బ్రేక్ ఫాస్ట్ విషయంలో జాగ్రత్త:  ఇప్పుడున్న ఉరుకులు పరుగులు జీవితంలో మన శరీరం ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించేందుకు ప్రత్యేకించి బ్రేక్ ఫాస్ట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని […]

Share:

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ అనేది తప్పకుండా చేయాలి.. ఉదయం మనం బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకునే ఆహారం మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ విషయంలో మాత్రం మనం పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 

బ్రేక్ ఫాస్ట్ విషయంలో జాగ్రత్త: 

ఇప్పుడున్న ఉరుకులు పరుగులు జీవితంలో మన శరీరం ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించేందుకు ప్రత్యేకించి బ్రేక్ ఫాస్ట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు కూడా మన తీసుకునే ఆహారం మీదే మన ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి ఉదయం మనం తీసుకునే కారం మనకి ఎనర్జీ ఇచ్చే వాటివై ఉండాలి. కాకపోతే మనం కొన్ని విషయాలలో బ్రేక్ ఫాస్ట్ క్రమం తప్పకుండా తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం పాడవుతున్నట్లు ఎక్కువగా కంప్లైంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే తప్పకుండా మీరు బ్రేక్ ఫాస్ట్ పాటించడం టైమింగ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం ఒకటే కాదని, ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఏ ఆహార పదార్థాలు తింటున్నామో, వాటి మీద కూడా మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 

అయితే మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ముఖ్యంగా మెగ్నీషియం, పొటాషియం, విటమిన్, ప్రోటీన్స్ వంటివి అధికంలో ఉండే వాటిని మనం చూజ్ చేసుకోగలగాలి.. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ విషయంలో మాత్రం పక్కన పెట్టడమే మంచిది అంటున్నారు నిపుణులు.. మనం క్రమం తప్పకుండా ఒకే సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పటికీ.. ఈ ఆహార పదార్థాలు మాత్రం మనం తప్పక అవాయిడ్ చేయాలి అంటున్నారు.. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.. 

మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇవి లేకుండా చూసుకోండి: 

పాన్ కేక్స్:

 చాలామంది ఆరోగ్యంగా ఉండేందుకు త్వరగా చిటికెలో బ్రేక్ ఫాస్ట్ అయిపోయేందుకు ఎక్కువగా ఎంచుకునేది పాన్ కేక్స్. అయితే ఈజీగా జీర్ణం అయిపోతుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో పాన్ కేక్స్ చేసుకోవాలని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. కానీ ఉదయం పాన్ కేక్స్ చేసుకోవడం మంచి విషయం కాదు అంటున్నారు నిపుణులు. అవి త్వరగా అరిగిపోవడమే కాకుండా, మనం లంచ్ టైం వరకు ఆకలితో ఉండాల్సిన పని ఉంటుందని, అంతేకాకుండా శరీరానికి కావలసిన ఎనర్జీ జనరేట్ చేయడంలో పాన్ కేక్ సరిపోదని, కాబట్టి మన బ్రేక్ ఫాస్ట్ లో పాన్ కేక్ అనేది చేసుకోకపోవడం మంచిది అంటున్నారు. 

కాఫీ లేదా టీ: 

ఉదయం లేవగానే మనలో చాలామందికి కాఫీ లేదంటే టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కాఫీలో మరియు టీ లో ఉండే అధిక షుగర్, కెఫిన్, నికోటిన్ పదార్థాలు కారణంగా ఉదయాన్నే మనం కాఫీ లేదా టీ తాగడం వల్ల మన కడుపులో అజీర్తి ప్రాబ్లం రావడం, ఎసిడిటీ వంటివి రావడం, అంతే కాకుండా డయాబెటిస్ వంటి ప్రాబ్లం రావడం కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అందుకనే ఉదయం లేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసే క్రమంలో అస్సలు కాఫీ లేదంటే టీ తీసుకోకపోవడం మంచిది. 

ఫ్రూట్ జ్యూస్: 

ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది ఫ్రూట్ జ్యూస్ తాగడం అలవాటుగా మార్చుకుంటారు కదా. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే క్రమంలోనే ఫ్రూట్ జ్యూస్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఉదయం పూట ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. అయితే ఫ్రూట్ జ్యూసెస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండకపోవడం మెయిన్ రీజన్ అని, అంతేకాకుండా ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందని, ఎందుకంటే బ్లడ్ షుగర్  లెవెల్స్ పెంచడంలో ఫ్రూట్ జ్యూస్ ముందు ఉంటాయని అంటున్నారు. అయితే జ్యూస్ తాగడం కన్నా డయాబెటిస్ ఉన్నవారు ప్రత్యేకించి ఫ్రూట్ తినడం మంచిది అని, పళ్ళ రసాలలో అయితే కచ్చితంగా షుగర్ అనేది ఎక్కువగా కలుపుకోవడం అనారోగ్యం పాలయ్యే అవకాశాలుంటాయి.