వంకాయల వల్ల ప్రయోజనాలు తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం కోసం అంతా ఆరాటపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక కొత్త అలవాట్లను చేసుకుంటున్నారు. మనం రోజూ తినే ఆహారాల విషయంలో కూడా అనేక రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో మరీ ముఖ్యమైన విషయాకి వస్తే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ అనారోగ్యం వలన మన డబ్బులు ఖర్చవడమే కాకుండా మన టైమ్ కూడా వృథా అవుతుంది. అలా కాకుండా […]

Share:

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం కోసం అంతా ఆరాటపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక కొత్త అలవాట్లను చేసుకుంటున్నారు. మనం రోజూ తినే ఆహారాల విషయంలో కూడా అనేక రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో మరీ ముఖ్యమైన విషయాకి వస్తే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ అనారోగ్యం వలన మన డబ్బులు ఖర్చవడమే కాకుండా మన టైమ్ కూడా వృథా అవుతుంది. అలా కాకుండా ఉండేందుకు అంతా ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి అనేక మంది అమాయకులను బలితీసుకుంటుంది. కొంత మంది పొరపాట్లు చేసి క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. కానీ మరికొంత మందైతే ఎటువంటి పొరపాట్లు చేయకపోయినా కానీ క్యాన్సర్ వస్తుంది. అటువంటి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ అనేక రూపాల్లో మన మీద అటాక్ చేస్తుంది. అంతే కాకుండా ఈ క్యాన్సర్ చికిత్సకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదీ కాక ఈ చికిత్స మరీ కష్టంగా కూడా ఉంటుంది. అందుకోసమే మొదటే ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కొంత మంది ఈ ప్రయత్నాలలో విజయం సాధిస్తే మరికొంత మంది మాత్రం ఆశించిన మేర రాణించలేక పోతుంటారు. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన మన శరీరానికి ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందు కోసమే మన శరీరానికి ఎటువంటి ఆహారాలు ముఖ్యమో తెలుసుకుని మనం వాటిని డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. 

ఎముకల బలం కోసం.. 

మన శరీరంలో బోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి స్ట్రాంగ్ గా ఉంటే రక్తహీనత తగ్గుతుంది. రక్తహీనత తక్కువగా ఉన్నపుడు ఆటోమేటిగ్గా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అందుకోసం వంకాయ చాలా సహాయం చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట. ఇది బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను ప్రోత్సహిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో అధిక బరువుతో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా తమ శరీర బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలా బరువు తగ్గించుకోవాలని ట్రై చేసే వారు ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. 

ఫైబర్ ఎక్కువ.. 

వంకాయలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అది మాత్రమే కాకుండా ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. తద్వారా మనకు కొవ్వు వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాల బెడద తగ్గుతుంది.  ఈ ఆహారం పోషకాలతో చాలా సమృద్ధిగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వంకాయల్లో మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి మూలకాలు విరివిగా ఉంటాయి. అలాగే రాగికి కూడా ఇది గొప్ప సోర్స్ అందుకోసమే దీనిని తీసుకోవడం వలన మన ఎముకలు స్ట్రాంగ్ గా తయారు అవుతాయి. దీనిని మనం నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. వంకాయలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటమే దీనికి ముఖ్య కారణం. వంకాయ వంటి ఆహారాల్లో లభించే పాలీఫెనాల్స్ లేదా సహజ మొక్కల సమ్మేళనాలు చక్కెర శోషణను తగ్గిస్తాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని పెంచి మనకు ఎంతో సహాయం చేస్తాయి. మానవ రక్తంలో చెక్కెరను తగ్గించేందుకు ఇవి రెండూ ఎంతో ఉపయోగపడతాయి. వంకాయలు ఆంథోసైనిన్‌ లలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడి ఉంటాయి. బయోయాక్టివ్ సమ్మేళనాల హోస్ట్‌తో అందించబడిన వంకాయ వంటకం క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వంకాయలోని సోలాసోడిన్ రామ్నోసైల్ గ్లైకోసైడ్స్ అనే సమ్మేళనం కణితి కణాల మరణానికి కారణమవుతుందని మరియు కొన్ని రకాల క్యాన్సర్‌లు పునరావృతమయ్యే అవకాశం తగ్గిస్తుందని కొన్ని నివేదికలలో స్పష్టం అయింది. అందుకోసమే మార్కెట్లో చాలా తక్కువ ధరకు చౌకగా లభించే వంకాయను మన డైట్ లో తీసుకుని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఈ మాటను ఒకరిద్దరు కాకుండా అనేక మంది నిపుణులు కూడా అంగీకరించారు.