ఎప్పుడైనా కదులుతున్న డ్రెస్ చూసారా?

అయితే ప్రస్తుతం ఈ డ్రెస్ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ డ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే డిజైనర్ ఇలాంటి కదులుతున్న డ్రెస్ తయారు చేసేందుకు ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ని ఉపయోగించాడంట. చూస్తుంటేనే చాలా అద్భుతమైన ఆలోచన చేసినట్లు ఉంది కదా..  డ్రెస్ విశేషాలు చూద్దాం:  ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో చూసిన, ఈ డ్రెస్ గురించే మాటలు. ఈ డ్రెస్ […]

Share:

అయితే ప్రస్తుతం ఈ డ్రెస్ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ డ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే డిజైనర్ ఇలాంటి కదులుతున్న డ్రెస్ తయారు చేసేందుకు ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ని ఉపయోగించాడంట. చూస్తుంటేనే చాలా అద్భుతమైన ఆలోచన చేసినట్లు ఉంది కదా.. 

డ్రెస్ విశేషాలు చూద్దాం: 

ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో చూసిన, ఈ డ్రెస్ గురించే మాటలు. ఈ డ్రెస్ ప్రస్తావన అసలు తగ్గట్లేదు. అసలు ఈ డ్రెస్ లో అంత విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఈ డ్రెస్ డిజైన్ చేసిన డిజైనర్ ఒక స్పెషల్ టెక్నిక్ ఉపయోగించి ఈ డ్రెస్ ని తయారు చేయడం జరిగింది. డిజైనర్ స్వయంగా తాను తయారు చేసిన డ్రెస్ వేసుకొని పోజులు ఇచ్చాడు. అయితే డిజైనర్ డ్రెస్ వేసుకొని పూజలు ఇస్తున్న సమయంలో డ్రెస్ దానంతట అదే కదులుతున్న దృశ్యాలు, ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కనిపించాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంతో మంత్రముగ్ధులవుతున్నారు. 

నిజానికి డిజైనర్ ఈ డ్రెస్ తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఫిజిక్స్ ను  ఉపయోగించి కైనటిక్ ఫ్యాషన్ ని కనిపెట్టాడు. అంటే తను తయారు చేస్తున్న డ్రెస్ కైనటిక్ ఎనర్జీ ఉపయోగించుకుని కదులుతుందన్నమాట. అయితే ప్రస్తుతం ఈ అద్భుతమైన డ్రెస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. అంతేకాదు ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో మంచి మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన డ్రెస్ ఒక్కసారి వేసుకున్న సరిపోతుంది, అంటూ మురిసిపోతున్నారు చాలామంది. అంతేకాకుండా ఈ డ్రెస్ లో ఉపయోగించిన కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది అంటున్నారు కొందరు. 

కదిలే డ్రెస్ కొత్తేమీ కాదు: 

అయితే ప్రతి సంవత్సరం డిజైనర్ తమ కొత్త రూప కల్పనలతో అద్భుతమైన డ్రెస్సులతో ప్రేక్షకుల్ని అలరించుకోవడం కొత్తేమీ కాదు. అయితే వింటర్ హాటె కోచర్ షో 2023లో ప్రదర్శించిన డ్రెస్ గురించి దాని డిజైనర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే 2020 లో కూడా కామరూన్ హ్యూగస్ అనే వ్యక్తి న్యూయార్క్ డిజైనర్, తను కూడా హైటెక్ డ్రెస్సులు సృష్టించి ఆ డ్రెస్సులు కూడా వాటిక అవే కదిలేలా సృష్టించాడు. తాను కరోనా సమయంలో డ్రెస్సులు మీద ఎంతగానో రీసెర్చ్ చేసి 2020 లో టిక్ టాక్ లో తన కొత్త డిజైనర్ దుస్తులను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతేకాకుండా అద్భుతమైన మూవింగ్ డ్రెస్సెస్ తయారు చేసిన ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ కూడా పెరిగారు. 

అందుకే కదిలే డ్రెస్సులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కొత్తేమీ కాదు. కైనటిక్ ఎనర్జీ ద్వారా కదిలే డ్రెస్సులను తయారుచేసి ప్రపంచానికి పరిచయం చేసిన డిజైనర్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రపంచ దేశాలలో ఫ్యాషన్ వీక్ జరిగేటప్పుడు ఇలాంటి అద్భుతమైన డ్రెస్ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది? ఫెయిరీ టేల్స్ లో కదులుతున్న డ్రెస్సుల్లా కనిపిస్తున్న వీటిని వేసుకోవడానికి ఆత్రుతగా ఉన్నది కదా.. మరి మన భారతదేశంలో కూడా ఇలాంటివి వస్తాయేమో ఎదురు చూద్దాం..