మీ ముఖాన్ని సబ్బుతో కడుపుతున్నారా..? ఒక్కసారి ఈ కారణాలు తెలుసుకోండి.!

సబ్బులతో ముఖం కడుక్కోవాలా? అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం కాంతివంతంగా మార్చుకోవడానికి  మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తుంటాం. చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు రకరకాల ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటాం. కానీ, కొందరు ముఖానికి సబ్బు మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే సబ్బును ముఖానికి నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సున్నితమైన చర్మాన్ని మన చేతులతో మనమే సబ్బు రూపంతో పాడు చేస్తున్నాం. […]

Share:

సబ్బులతో ముఖం కడుక్కోవాలా?

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం కాంతివంతంగా మార్చుకోవడానికి  మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తుంటాం. చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు రకరకాల ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటాం. కానీ, కొందరు ముఖానికి సబ్బు మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే సబ్బును ముఖానికి నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సున్నితమైన చర్మాన్ని మన చేతులతో మనమే సబ్బు రూపంతో పాడు చేస్తున్నాం. ముఖానికి సబ్బు ఎందుకు వాడకూడదు? సబ్బు వలన కలిగే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పొడిబారుతుంది:

సబ్బులో కాస్టిక్ సోడా, కృత్రిమ సువాసనలు ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి. శరీరంలోని ఇతర భాగాల కంటే మన ముఖం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. శరీరానికి ఉపయోగించే సబ్బుని ముఖానికి కూడా వాడితే.. ఇది చర్మానికి హాని కలిగించవచ్చు. సబ్బుతో ముఖం కడుక్కుంటే చర్మం పొడి బారుతుంది. 

చికాకు, దురద:

సబ్బులో సర్ఫ్యాక్టెంట్ ఉంటుంది. ఇది మన ముఖ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫేషియల్ సబ్బును ఎక్కువగా ఉపయోగించడం వల్ల చికాకు, దురద , చర్మం మీద మంటలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. సబ్బు మీ చర్మంలోని సహజ తేమను తొలగిస్తుంది. అదే విధంగా తరచుగా సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటే, ముఖం మీద త్వరగా అకాల వృద్ధాప్య సంకేతాలను చూపిస్తుంది. ఇంకా మీ చర్మం పొడి వారి నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా రోజు సబ్బుతో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల.. చర్మం బిగుతుగా, పొడిబారుతుంది. చర్మంలోని సహజ నూనెలను నిలుపుకోవాలంటే.. ముఖంపై ఎక్కువ సబ్బును అప్లై చేయకపోవడమే మంచిది. 

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్:

సబ్బులో ఆల్కలీన్ ఉంది. సబ్బుతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం పిహెచ్ స్థాయి దెబ్బతింటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పీహెచ్ స్థాయిని బాలన్స్ చేయడం చాలా ముఖ్యం. పీహెచ్ బ్యాలెన్స్ కారణంగా చర్మం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా నివారించవచ్చు. మీరు శరీరానికి వాడే సబ్బుని.. ముఖానికి కూడా వాడితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. సబ్బులో సువాసనలు వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు.. రకరకాల రసాయనాలను, కృత్రిమ రంగులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి సున్నితమైన మీ ముఖ చర్మాన్ని చికాకు పరుస్తాయి. మొటిమలు, ముడతలు వంటివి వస్తాయి. వీటికి బదులుగా క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్పోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ లాంటివి ఉత్తమ ఎంపిక. 

చర్మానికి హానికరం: 

పారబెన్, ఫార్మల్డిహైడ్ వంటి హానికర రసాయన వల్ల చర్మానికి హాని కలుగుతుంది. చర్మంపై సన్నని గీతాలు, ముడతలు పడతాయి .ఇంకా చర్మం పొడిబారిపోతుంది. సబ్బును ముఖానికి ఎక్కువ సేపు రుద్దితే చర్మం నిర్జీవంగా  మారిపోతుంది. చర్మం దాని మృదుత్వాన్ని, గ్లోను కోల్పోతుంది.

అపరిశుభ్రత: 

ఫేస్ వాష్‌ను మీ చేతి వేళ్లకు పెట్టి ముఖమంతా అప్లై చేయొచ్చు. కానీ సబ్బును అలా చేయటానికి కష్టమవుతుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ కూడా కాదు. వాస్తవానికి సబ్బు మనల్ని శుభ్రంగా ఉంచవు. సబ్బుకు మురికి బ్యాక్టీరియా గ్రహించే గుణం ఉంటుంది. ఇలాంటి దాన్ని ముఖానికి రాస్తే అక్కడ బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఇది మూసుకుపోయిన రంధ్రాలకు కారణమవుతుంది. ఫలితంగా బ్లాక్ హెడ్స్, మొటిమలు, వైట్ హెడ్స్ రావచ్చు. సబ్బుకు బదులు ఫేస్ వాష్, క్లెన్సర్, టోనింగ్ వంటివి ఉపయోగించడం మంచిది.