Vitamin D: విటమిన్ డీ లోపిస్తే ఏం జరుగుతుంది..

Vitamin D: నేటి రోజుల్లో ఆరోగ్యం మీద అనేక మంది ద్రుష్టి సారిస్తున్నారు. మనకు ఆరోగ్యం ప్రసాదించే వాటిలో డీ విటమిన్ (Vitamin D)  కూడా ఒకటి. మనకు డీ విటమిన్ (Vitamin D)  కనుక తక్కువ అయితే అనేక సమస్యలు వస్తాయి.అందుకోసమే డీ విటమిన్ (Vitamin D)   ను మోతాదుకు తగిన విధంగా మనం తీసుకోవాలి. ప్రకృతి లో మనకు తగినంత మోతాదులో డీ విటమిన్ (Vitamin D)   దొరుకుతుంది. అయినా కానీ […]

Share:

Vitamin D: నేటి రోజుల్లో ఆరోగ్యం మీద అనేక మంది ద్రుష్టి సారిస్తున్నారు. మనకు ఆరోగ్యం ప్రసాదించే వాటిలో డీ విటమిన్ (Vitamin D)  కూడా ఒకటి. మనకు డీ విటమిన్ (Vitamin D)  కనుక తక్కువ అయితే అనేక సమస్యలు వస్తాయి.అందుకోసమే డీ విటమిన్ (Vitamin D)   ను మోతాదుకు తగిన విధంగా మనం తీసుకోవాలి. ప్రకృతి లో మనకు తగినంత మోతాదులో డీ విటమిన్ (Vitamin D)   దొరుకుతుంది. అయినా కానీ ఎవరైనా డీ విటమిన్ (Vitamin D)   లోపంతో బాధపడుతూ ఉంటే వారు సప్లిమెంట్స్ (Supplements) తీసుకోవడం ద్వారా డీ విటమిన్ (Vitamin D)   పొందేందుకు వీలుంటుంది.  కావున ఎవరు కూడా నెగ్లెక్ట్  (Neglect) చేయకుండా తగినంత మోతాదులో డీ విటమిన్ ను తీసుకోవాలి. లేకపోతే మనకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. హే.. డీ విటమిన్ తో అంతగా ఏమవుతుందిలే అని అనుకుంటే మాత్రం మనం అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకోసమే డీ విటమిన్ (Vitamin D)   ను మనం తగినంత మొత్తంలో మన శరీరానికి అందించాలి. 

అక్కడి నుంచే ఎక్కువగా.. 

మనకు ఎక్కువగా డీ విటమిన్(Vitamin D)   లభించేది ఉదయం వచ్చే సూర్యరశ్మి (Sun) నుంచి. మనకు చాలా మొత్తంలో సూర్య రశ్మి నుంచి డీ విటమిన్(Vitamin D)   లభిస్తుంది. అందుకోసమే ఉదయం (Morning Sun Rise) పూట సూర్యరశ్మిని మనం తీసుకోవాలి. ఎవరైనా ఉదయం పూట సూర్యరశ్మిని (Morning Sun Rise) తీసుకోవడం వీలుకాకపోతే వారు డీ విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవాలి.ఇలా కూడా మనం మన శరీరానికి తగినంత మొత్తంలో డీ విటమిన్ (Vitamin D)   అందించేందుకు వీలుంటుంది. ఈ విటమిన్ కేవలం సూర్యరశ్మి లోనే కాకుండా గుడ్లు (Eggs), మొక్కలు, జిడ్డుగల చేపలు, ఎర్ర మాంసం మొదలైన వాటి రూపంలో లభిస్తుంది. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక కారణాల వలన విటమిన్ డీ లోపం ఉండే వారి సంఖ్య పెరుగుతోంది.

కారణాలివే.. 

విటమిన్ డీ (Vitamin D)   లోపం ఉన్న వారి సంఖ్య పెరిగేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. ఎటువంటి పని చేయకుండా ఇంట్లోనే కూర్చోవడం. ఇక పోతే మరోది.. ఎక్కువ సన్‌ స్క్రీన్ ధరించడం, విటమిన్ డీ లోపానికి (Deficiency) కారణాలు అవుతున్నాయి. మీకు తెలిసినట్లుగా, ఎముక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే కాల్షియం శోషణతో సహా వివిధ విధులను నిర్వహించడానికి శరీరానికి విటమిన్ అవసరం. మీరు అన్ని సమయాలలో అలసిపోతూ మరియు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే, మీరు మీ విటమిన్ డీ స్థాయిలను తనిఖీ చేసుకోవాలి. విటమిన్ డీ చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. సూర్యరశ్మి నుంచి UV-B కి బహిర్గతం అయిన తర్వాత ఇది మన శరీరంలోనే సంశ్లేషణ చేయబడుతుంది. విటమిన్ డీ అనేది ఎముక పెరుగుదల మరియు జీవక్రియ ప్రక్రియలో పాల్గొనే ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది సంశ్లేషణ చేయబడి మార్చబడుతుంది. అవయవాలు, మూత్రపిండాలు (Kidney) మరియు కాలేయాల మధ్య దాని క్రియాశీల రూపం.

లోపం ఉంటే ఏమవుతుంది.. 

మీకు విటమిన్ డీ (Vitamin D)  లోపం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే మీకు అనేక సమస్యలు ఎదురవుతాయి. కావున మీరు విటమిన్ డీ(Vitamin D)  ని తగిన మోతాదులో శరీరానికి అందజేయాలి. విటమిన్ డీ యొక్క ప్రధాన మూలం సూర్యుడు, దీనిలో మానవ శరీరం సూర్యరశ్మిని ఉపయోగించి సంశ్లేషణ చెందుతుంది. ఇంటి లోపల ఉండటం మరియు ఎండకు దూరంగా ఉండటం వలన, చాలా మంది విటమిన్ డీ లోపం యొక్క ముప్పును ఎదుర్కొంటున్నారు.ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చోవడానికి ఇష్టపడే వ్యక్తులు సూర్యరశ్మికి గురికాకుండా ఉంటారు. ఇది విటమిన్ డీ స్థాయిలకు ఆటంకం కలిగిస్తుంది. చర్మాన్ని టానింగ్ నుంచి రక్షించడానికి సన్‌ స్క్రీన్ లోషన్‌ ను ధరించడం కూడా ఈ విటమిన్ లోపం మీకు ఏర్పడడానికి కారణం అవుతుంది. .విటమిన్ డీ కొవ్వులో కరిగే విటమిన్ అయినందున శరీరంలో శోషించబడకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది కొవ్వును పూర్తిగా నివారించడం వలన విటమిన్ డీ లోపం ఏర్పడవచ్చు. విటమిన్ డీ లోపం ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలు దీని వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు. కావున విటమిన్ డీని చాలా చక్కగా ఉపయోగించుకోవాలని.. అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అనేక మంది వైద్యులు (Doctors) చెబుతున్నారు. కావున విటమిన్ డీ లోపం ఏర్పడకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఉచితంగా సూర్యరశ్మి ద్వారా దొరికే విటమిన్ డీని తీసుకోకుండా అనవసరంగా సఫర్ అవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. హే.. విటమిన్ డీ లేకపోయినా ఏమవుద్ది అని అస్సలుకే అనుకోవద్దు.. ఎందుకంటే మన శరీరంలో అనేక అవయవాలు సక్రమంగా పని చేసేందుకు ఈ విటమిన్ డీ(Vitamin D)   చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం దీనిని నెగ్లెక్ట్ చేయకూడదు.