ఆయుర్వేద వాస్తవాలు.. చల్లని అల్పాహారాన్ని తీసుకుంటే ప్రమాదమా.?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కొంతమంది చల్లని పదార్థాలు తీసుకునే అలవాటు ఉంటుంది. ఉదయం అల్పాహారంలో చల్ల చల్లని ఆహార పదార్థాలు తీసుకోకపోతే ఏదో వెలితిగా ఉన్నట్లు వారికి అనిపిస్తుంది. వేడివేడి అల్పాహారానికి బదులు చల్లని గడ్డ పెరుగు లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం లాంటివి తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది కూల్ కూల్ గా జ్యూసులు లాంటివి లాగించేస్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం, అల్పాహారం కు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు […]

Share:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కొంతమంది చల్లని పదార్థాలు తీసుకునే అలవాటు ఉంటుంది. ఉదయం అల్పాహారంలో చల్ల చల్లని ఆహార పదార్థాలు తీసుకోకపోతే ఏదో వెలితిగా ఉన్నట్లు వారికి అనిపిస్తుంది. వేడివేడి అల్పాహారానికి బదులు చల్లని గడ్డ పెరుగు లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం లాంటివి తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది కూల్ కూల్ గా జ్యూసులు లాంటివి లాగించేస్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం, అల్పాహారం కు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే అల్పాహారంలో తీసుకోవాలని చెబుతున్నారు‌. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. అల్పాహారానికి సంబంధించి ఆయుర్వేదంలో కొన్ని వివరణలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అలవాట్లు ఆచరించండి.. 

ప్రతిరోజు కనీసం ఒక గంట ధ్యానం వ్యాయామం కోసం వెచ్చించండి..

 శరీర కదలికలు అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయడం చాలా ముఖ్యం. శరీర భాగాలలో కదలికలను తీసుకురావడం వలన శరీరంలోనే భాగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. మన కడుపు ప్రేగులు, పెద్ద పేగు నుండి ఏదైనా వ్యర్ధాలు ఉంటే వ్యర్ధాలను ఖాళీ చేయడానికి ఇవి దోహదపడతాయి. 

 ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తీసుకోండి..

ఖాళీ కడుపుతో రెండు వందల మిల్లీలీటర్ల గోరువెచ్చని తీసుకుంటే జీవక్రియను ఉత్తేజ పరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ విషయాన్ని పదేపదే ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. పరగడుపున గోరువెచ్చటి నీటిని తీసుకుంటే అనూహ్యమైన ఫలితాలు కలుగుతాయి. 

 రాత్రిపూట నానబెట్టిన గింజలు లేదంటే వేడివేడి సూప్ తీసుకోండి..

రాత్రిపూట నానబెట్టిన  తృణ ధాన్యాలు, మొలకలు నట్స్ వంటివి ఉదయం అల్పాహారంలో తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. లేదంటే ఉదయం వేడివేడిగా రాగి జావా, ఓట్స్ సూప్ వంటివి తీసుకుంటే మన శరీరంలోని అన్ని కణాలను యాక్టివేట్ చేస్తాయి.

వేడి వేడి అల్పాహారం ఎందుకు తీసుకోవాలంటే.. 

రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయం అల్పాహారానికి మధ్యలో సుమారు 8 నుంచి 10 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో శరీరం మొత్తం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తరువాత మనం తీసుకునే ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  ఉదయం మనం తీసుకునే ఆహారమే ఆరోజు మనం ఎంత చురుకుగా ఉంటామో నిర్ణయిస్తుంది. మనం తీసుకునే ఆహారం వేడివేడిగా ఉంటే ఆ రోజంతా మనం ఎక్కువ ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది.  అదే చల్లని పదార్థాలు కనుక తీసుకుంటే శరీరంలోని కొన్ని అవయవాలు నిదానంగా పనిచేయడానికి ఇష్టపడతాయి . దాంతో ఆ రోజంతా నీరసంగా, డల్ గా ఉంటుంది. అందువలన ఆయుర్వేద నిపుణులు ఉదయం వేడి వేడి ఆహార పదార్థాలు అల్పాహారంలో తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

రోజంతా మనిషి యాక్టివ్ గా ఉండాలంటే అతని శరీర జీవక్రియ చురుకుగా పని చేయాలి. ఇందుకోసం అల్పాహారం అనేది చాలా ముఖ్యం . ఆ అల్పాహారం మనం ఆ రోజుల్లో తీసుకునే భోజనం మొత్తాన్ని జీర్ణం చేసుకునేలా, పేగులను సిద్ధం చేయాలి. ఇందుకోసం తేలికైనా వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకరకంగా వేడి అల్పాహారం అనేది వార్మ్ అప్ ఎక్ససైజ్ లాంటిది. శరీరాన్ని తగినంత వేడిగా ఉంచుతుంది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ఒక రకంగా అది మండుతున్న మంటపై నీళ్లు చల్లడం లాంటిదే. అందువలన చల్లటి ఆహార పదార్థాలు కాకుండా వేడివేడిగా ఉడికించిన ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. వేడివేడిగా ఉడికించిన చిక్కుళ్ళు, ఉడికించిన పల్లీలు, వెజిటేబుల్స్ సూప్స్ వంటివి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.