చలికాలంలో అలర్జీకి కారణమదే..

శీతాకాలంలో, కాలుష్యంతో కూడిన కాలుష్యాన్ని విలోమం అని పిలిచే ఒక దృగ్విషయం ఉంది, దీని కారణంగా చల్లని వాతావరణంలో అలెర్జీలు సర్వసాధారణం. అలర్జీ.. మనకు ఏదైనా పర్టిక్యులర్ వస్తువు, కానీ వాతావరణం కానీ పడకపోవడాన్ని అలర్జీ అని అంటారు. అతనికి డస్ట్ అలర్జీ ఉందట.. ఆమెకు స్మోక్ అలర్జీ ఉందట.. అనే పదాలను మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ అలర్జీ సమస్య ఉన్న వారు చలికాలంలో వివిధ రకాల ఇన్​ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంటారు. వీరికి చలికాలంలో […]

Share:

శీతాకాలంలో, కాలుష్యంతో కూడిన కాలుష్యాన్ని విలోమం అని పిలిచే ఒక దృగ్విషయం ఉంది, దీని కారణంగా చల్లని వాతావరణంలో అలెర్జీలు సర్వసాధారణం.

అలర్జీ.. మనకు ఏదైనా పర్టిక్యులర్ వస్తువు, కానీ వాతావరణం కానీ పడకపోవడాన్ని అలర్జీ అని అంటారు. అతనికి డస్ట్ అలర్జీ ఉందట.. ఆమెకు స్మోక్ అలర్జీ ఉందట.. అనే పదాలను మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ అలర్జీ సమస్య ఉన్న వారు చలికాలంలో వివిధ రకాల ఇన్​ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంటారు. వీరికి చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా అలర్జీతో బాధపడే వారు మామూలు కాలాల్లో తీసుకున్న జాగ్రత్తల కంటే ఎక్కువ జాగ్రత్తలను చలికాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. హా.. ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే మాత్రం వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. 

చలికాలం వచ్చిందో..

చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది మందంగా ఉండే ఉన్ని దుస్తులను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి ధరించడం వలన చలి ఎక్కువగా ఉండదని చాలా మంది భావిస్తుంటారు. ఇది కొంత వరకు నిజమే అయినా కానీ, అలర్జీతో బాధపడే వారికి ఇవి మరిన్ని బాధలను తెచ్చిపెడతాయి. స్వెటర్స్​లో తవిటి పురుగులు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఈ పురుగులు అలర్జీ ఉన్న వారికి త్వరగా జలుబు, దగ్గు వచ్చేలా చేస్తాయి. అందువల్ల అలర్జీ ఉన్న వారు ఈ పురుగుల బారిన పడకుండా చూసుకోవడం చాలా అవసరం. అలర్జీతో బాధపడే వారిలో వాపు ప్రక్రియ నిరంతరం కనిష్ట స్థాయిలో ప్రేరేపితమై (ట్రిగ్గర్) ఉంటుంది. ఇక వారికి చల్లగాలి తగిలితే కనిష్ట స్థాయిలో ఉన్న వాపు ప్రక్రియ ఇంకాస్త ఎక్కువవతుంది. అప్పుడు చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్ తలెత్తినా కానీ అది మరింత అధికమవుతుంది. కావున ఇలా జరగకుండా చూసుకుని.. అలర్జీ ఇబ్బందుల నుంచి బయటపడాలి. లేకపోతే అలర్జీ వల్ల వచ్చే ఇబ్బందులు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అలర్జీ వల్ల వచ్చే సమస్యలు ఇతరులకు చాలా తక్కువగానే కనిపించినా కానీ ఆ బాధలు అనుభవించే వారికి తెలుస్తాయి. అలర్జీ వల్ల ఎక్కువగా జలుబు, ముక్కుకారడం వంటి వ్యాధులు అటాక్ చేస్తాయి. ఇక చలికాలంలో ఇవి వచ్చాయంటే ఆ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అలర్జీలకు చికిత్స లేదు. అయినప్పటికీ, లక్షణాల నుండి ఉపశమనం కలిగించే OTC మరియు ప్రిస్క్రిప్షన్ మందులు ఉన్నాయి. అలెర్జీ ట్రిగ్గర్‌లను నివారించడం లేదా వాటితో సంబంధాన్ని తగ్గించడం అలెర్జీ ప్రతిచర్యలను నిరోధించడంలో సహాయపడుతుంది. కాలక్రమేణా, ఇమ్యునోథెరపీ అలెర్జీ ప్రతిచర్యల తీవ్రతను తగ్గిస్తుంది. 

కోపం ఎక్కువే..

అలర్జీతో బాధపడే వారిలో కోపం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా పలకరించినా కానీ, వారు కోపంగానే రియాక్ట్ అవుతారు. ఇది చూసిన ఇతరులు ఇలా ఇతడేంటి కోప్పడుతున్నాడని అనుకుంటారు. కానీ వారి మాట స్వభావమే అలా ఉంటుంది. ఇక వారికి చల్లగాలి తాకితే మరో స్థాయిలో కోపం ఉంటుంది. అలర్జీతో బాధపడేవారిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తుంటుంది. అందువల్లే ఈ అలర్జీ అనే సమస్య ఉత్పన్నం అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మామూలుగా రియాక్ట్ అయితే వారు మామూలుగానే ఉంటారు. ఎలా రియాక్ట్ కావాలనే విషయం వారి చేతిలో ఉండదు. అందుకోసమే అలర్జీ వచ్చిన వారు చాలా విషయాలకు మౌనంగా ఉండడమే మంచిది. లేకపోతే అనవసరంగా వారు మాటలు పడాల్సి వస్తుంది. అందుకే అలర్జీతో బాధపడే వారు చలికాలంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.