చ‌పాతీల కంటే వైట్ రైస్ ఎప్పుడు బెస్ట్?

వైట్ రైస్ గురించి చెప్పిన రాశి చౌదరి:  న్యూట్రిషియనిస్ట్ రాషి చౌదరి మాటల్లో, ఐబీఎస్, పిసిఒడి లాంటి వాటితో బాధపడేవాళ్లు గోధుమలతో చేసిన చపాతీ తినడం కంటే రైస్ తినడమే బెటర్ అని అంటున్నారు.వైట్ రైస్ అనేది చాలా రోజులుగా మన ఆహారంలో ఒకటిగా ఉంది. మనం తినడానికి ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నాం. దీని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ ని మిల్ లో పాలిష్ చేశాక దాంట్లో ఉన్న ఫైబర్ దాదాపుగా […]

Share:

వైట్ రైస్ గురించి చెప్పిన రాశి చౌదరి: 

న్యూట్రిషియనిస్ట్ రాషి చౌదరి మాటల్లో, ఐబీఎస్, పిసిఒడి లాంటి వాటితో బాధపడేవాళ్లు గోధుమలతో చేసిన చపాతీ తినడం కంటే రైస్ తినడమే బెటర్ అని అంటున్నారు.వైట్ రైస్ అనేది చాలా రోజులుగా మన ఆహారంలో ఒకటిగా ఉంది. మనం తినడానికి ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నాం. దీని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ ని మిల్ లో పాలిష్ చేశాక దాంట్లో ఉన్న ఫైబర్ దాదాపుగా పోతుంది. దాంతోపాటు  రైస్ లో న్యూట్రీషియన్స్ కూడా పోతాయి. ఇందులో ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్ డైట్ కి అస్సలు సరిపోదు. కానీ మనం తగ్గాలంటే వైట్ రైస్ మానేయాలా? న్యూట్రీషియనిస్ట్ రాశి చౌదరి చెప్పిన సమాధానం మనల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాశి చౌదరి ఐబీఎస్, పీసీఓడి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు గోధుమలను తినడం కంటే వైట్ రైస్ తినడమే బెటర్ అని చెప్పింది.వైట్ రైస్ తింటే మీ వ్యాధి లక్షణాలు అన్ని తగ్గుముఖం పడతాయని తను చెప్పింది. వైట్ రైస్ వల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పింది.

వైట్ రైస్ ఆరోగ్యానికి మంచిదేనా? :

వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనం ఎనర్జిటిక్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అరుగుదల సమస్యలు ఉన్న వాళ్లకు వైట్ రైస్ కరెక్ట్ సొల్యూషన్. వైట్ రైస్ వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్, బి విటమిన్ లాంటివి మన బాడీకి అందుతాయి. వైట్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. సిలియాక్ డిసీజ్ ఉన్నవాళ్లకు వైట్ రైస్ అద్భుతమైన సొల్యూషన్. ఐబీఎస్, పిసిఒడి ఉన్న వాళ్ళు కూడా వైట్ రైస్ తినొచ్చు.కానీ దీన్ని ఒక లిమిట్ లో తీసుకుంటే మనకు మన శరీరానికి మంచిది. డైట్ లో ఉన్నవాళ్లు రాత్రిపూట ఎక్కువగా చపాతీలు తింటారు. దీనికి కారణం చపాతీలు తింటే మన బరువు అదుపులో ఉంటుంది అందుకే అలా చేస్తారు. వైట్ రైస్ విషయానికొస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం బరువు తగ్గలేం. కానీ వైట్ రైస్ తినడం వల్ల మనకు చాలా ఎనర్జీ ఉంటుంది. వైట్ రైస్ పడనివాళ్లంటూ ఎవరు ఉండరు. ఇది ప్రతి ఒక్కళ్ళకు అరుగుతుంది. దీన్ని తిన్న తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందికి చపాతీలు అరగవు అలాంటివాళ్లు వైట్ రైస్ హ్యాపీగా తినొచ్చు. వైట్ రైస్ లో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మామూలుగా మనం పొలం నుండి వడ్లను సపరేట్ చేశాక చాలా పాలీషింగ్స్ ఉంటాయి. ఈమధ్య ఒక్క పట్టు బియ్యం కూడా బాగా వాడుకలో ఉంది. ఒక్కపట్టు బియ్యంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వైట్ రైస్ కంటే దీంట్లో పోషకాలు ఎక్కువ కానీ ఇది కొంతమందికి అరగదు. అందుకే ఎక్కువమంది వైట్ రైస్ వాడుతున్నారు.ఇది మనకు మన శరీరానికి సరిపోతుంది. పిసిఒడి, ఐబీఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్.ఇప్పుడు చాలామంది ఎక్కువగా దీన్నే వాడుతున్నారు. దీన్ని కంట్రోల్లో తిన్నంతవరకు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఆహారాన్ని మితంగా తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.