నీళ్లు తాగేందుకు.. అస్సలు అలా చేయకండి!

దాహం వేసినప్పుడు ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసి నిమిషాల వ్యవధిలో చల్లటి నీళ్లు తాగుతాం. దాహం తీరుతుంది, కానీ అది మన శరీరానికి చాలా హాని చేస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నీటి పరిమాణాన్ని పెంచడం అవసరం, అయితే ఎంత నీరు త్రాగాలి అనేది కూడా గుర్తుంచుకోవాలి. నీరు ఎప్పుడు, ఎంత మోతాదులో తాగాలి, నీరు త్రాగడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోండి. నీరు.. మన మానవ శరీరానికి ఎంతో అవసరమైన పదార్థం. కానీ చాలా […]

Share:

దాహం వేసినప్పుడు ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసి నిమిషాల వ్యవధిలో చల్లటి నీళ్లు తాగుతాం. దాహం తీరుతుంది, కానీ అది మన శరీరానికి చాలా హాని చేస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నీటి పరిమాణాన్ని పెంచడం అవసరం, అయితే ఎంత నీరు త్రాగాలి అనేది కూడా గుర్తుంచుకోవాలి. నీరు ఎప్పుడు, ఎంత మోతాదులో తాగాలి, నీరు త్రాగడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోండి.

నీరు.. మన మానవ శరీరానికి ఎంతో అవసరమైన పదార్థం. కానీ చాలా మంది సరిగ్గా నీళ్లను తాగరు. హే.. ఇప్పుడు దాహం కావట్లేదుగా తర్వాత కాసేపయినాక తాగుదాం లే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలుకే మంచిది కాదని అనేక మంది వైద్యులు చెబుతున్నారు. దాహం వేసినా లేకున్నా రోజు తీసుకోవాల్సిన మోతాదులో నీటిని తీసుకోవాలంటున్నారు. అలా సరైన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. 

అప్పుడు తప్పకుండా తాగండి

మనలో చాలా మంది హెల్తీగా ఉండడం కోసమని, అధిక బరువును తగ్గించుకోవడం కోసమని వ్యాయామాలు చేస్తుంటారు. ఇలా వ్యాయామం చేసిన తర్వాత తప్పకుండా నీటిని తాగాలట. ఎందుకంటే వ్యాయామాలు చేసినపుడు చెమట రూపంలో మన శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుందని, అందుకే తప్పకుండా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. అలాగే నీటిని తాగడం వలన మెదడు పని తీరు కూడా మెరుగవుతుంది. వ్యాయామాలు చేసిన తర్వాత దాహం వేయకపోయినా సరే వాటర్ తాగడం మంచిది. ఒక వేళ గ్రౌండ్​లో వ్యాయామాలు చేసేందుకు బయటకు వెళ్లినా కానీ ఒక బాటిల్​లో వాటర్ తీసుకెళ్లడం మంచిది. వాటర్ తాగితే మన శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఒక వేళ కనుక మన శరీరం డీ హైడ్రేట్​ అయితే మరలా తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా తగిన మోతాదులో నీటిని తాగడం చాలా మంచిది. 

హుషారుగా ఉండడం కోసం..

రోజంతా హుషారుగా ఉండడం కోసం పొద్దున నిద్ర లేచిన తర్వాత మొదటగా ఒక గ్లాసెడు నీళ్లు తాగడం మంచిది. ఇంకా ఇందులో కాస్త నిమ్మరసం కలుపుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజంతా హుషారుగా ఉండొచ్చు. అంతే కాకుండా వేళ కాని వేళలో ఆకలి వేస్తున్నట్లు అనిపించినా.. నీటిని తాగడం ఉత్తమం. ఇలా నీటిని తాగడం వలన అనవసరంగా తినడాన్ని అరికట్టొచ్చు. అంతే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన చెత్తను (మలం) బయటకు వెళ్లేందుకు కూడా నీరు అనేక రకాలుగా సాయం చేస్తోంది.

రోజుకు 8 గ్లాసులు పక్కా..

రోజుకు కనీసం 8 గ్లాసుల మంచినీటిని తాగాలని చాలా మంది వైద్యులు సిఫారసు చేస్తారు. అయితే మన శరీరానికి కరెక్టుగా ఎంత నీరు అవసరం అనే విషయం అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎటువంటి ఉష్ణోగ్రతలో ఉన్నాం. మన శరీర ఆరోగ్యం ఎలా ఉందని, ఇలా అనేక అంశాల మీద ఈ విషయం ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రోజుకు సరైన మోతాదులో నీటిని తీసుకోవడం చాలా అవసరం. నీటిని తరచూ తాగడం వలన మన శరీరంలో కొన్ని డిజార్డర్స్ రాకుండా చూసుకోవచ్చు.