మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే ఈ మందులు వేసుకోండి…

డయాబెటిస్‌కు ఇన్సులిన్‌ను అత్యుత్తమ ఔషధంగా చెప్పవచ్చు. దాదాపు ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. అయితే, చక్కెర మాత్రలలో బిగ్యునైడ్, మెగ్లిటినైడ్, గ్లిపిజైడ్ మరియు మెట్‌ఫార్మిన్ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మధుమేహం అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ షుగర్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ ఇట్టే తెలిసిపోతుంది. మరేం లేదు మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్ మోతాదును మించి పెరగడాన్నే మధుమేహం(షుగర్) అని అంటారు. ఈ వ్యాధి కనుక అటాక్ అయిందంటే […]

Share:

డయాబెటిస్‌కు ఇన్సులిన్‌ను అత్యుత్తమ ఔషధంగా చెప్పవచ్చు. దాదాపు ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. అయితే, చక్కెర మాత్రలలో బిగ్యునైడ్, మెగ్లిటినైడ్, గ్లిపిజైడ్ మరియు మెట్‌ఫార్మిన్ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.

మధుమేహం అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ షుగర్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ ఇట్టే తెలిసిపోతుంది. మరేం లేదు మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్ మోతాదును మించి పెరగడాన్నే మధుమేహం(షుగర్) అని అంటారు. ఈ వ్యాధి కనుక అటాక్ అయిందంటే చాలా విషయాలలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఎంత పెద్ద డేంజరో షుగర్ అనే మాటే చెబుతుంది. షుగర్ కనుక అటాక్ అయితే మనం తినే జాబితా, తినాల్సిన పదార్థాల జాబితా పూర్తిగా మారిపోతుంది. అయినా కానీ షుగర్ తగ్గుతుందనే గ్యారంటీ లేదు. అందుకోసమే షుగర్ అటాక్ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతగా వ్యాయామాలు చేస్తే అంత మంచిది. షుగర్ వచ్చిన తర్వాత ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎన్ని మందులు వాడినా ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే నేటి రోజుల్లో చాలా మంది వ్యాయామాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంతే కాకుండా ఎక్కువగా జంక్ ఫుడ్ తినకుండా చిరు ధాన్యాలను ఏరికోరి మరీ తింటున్నారు. జంక్​ఫుడ్ తింటే ఒబేసిటీతో పాటుగా డయాబెటిస్ కూడా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. మధుమేహానికి కూడా మందులున్నాయి కానీ ఎన్ని మందులు వేసుకున్నా కానీ అవి కేవలం వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా మాత్రమే చూస్తాయి. అంతే కానీ వ్యాధిని పూర్తిగా నయం చేయలేవు. అందుకోసమే షుగర్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఈ మందులే వేసుకోవాలి

షుగర్ వచ్చినపుడు వ్యాయామాలు తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తారు. వ్యాయామాలతో పాటుగా మెట్ ఫార్మిన్ అనే మందును కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తారు. మెట్‌ఫార్మిన్ (ఫోర్టామెట్, గ్లుమెట్జా, ఇతరులు) సాధారణంగా టైప్ 2 డయాబెటిస్‌కు సూచించిన మొదటి ఔషధం. ఇది ప్రధానంగా కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా మరియు ఇన్సులిన్‌కు మీ శరీరం యొక్క సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా పనిచేస్తుంది, తద్వారా మీ శరీరం ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగిస్తుంది. అయినప్పటికి కూడా షుగర్ కంట్రోల్​లోకి రాకపోతే.. రెండో మందును కూడా తీసుకోమని చెబుతారు. సిటాగ్లుటైడ్, లిరాగ్లుటైడ్, గ్లిమిపిరైడ్, ఇన్సులిన్ గ్లార్గైన్ యూ–100 వంటి మందులలో ఏదో ఒక మందును తీసుకోమని చెబుతారు. ఈ అన్ని మందులు కూడా గ్లూకోజ్ లెవెల్స్​ను తగ్గించేందుకు తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

అయినా కానీ..

పైన పేర్కొన్న మందులను శాస్త్రవేత్తలు ఐదేళ్ల పాటు పరిశీలించారు. ఈ పరిశీలనలో వారు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ మందులలో ఏ మందు వేసుకున్నా గ్లూకోజ్ పరిమాణం తగ్గేందుకు సహాయపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు కానీ, ఈ మందులలో ఏ మందులు వాడినా కానీ గ్లూకోజ్ నిర్ణీత మోతాదుకి చేరుకోలేదని గుర్తించారు. అంతే కాకుండా లిరాగ్లుటైడ్ వాడిన వారికి జీర్ణసమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. షగర్ వచ్చినపుడు ఆయావ్యక్తులకు అనుగుణంగా మందులను ఎంపిక చేసుకోవాలని, అలాంటపుడే మంచి రిజల్ట్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మందులను వేసుకుంటే వేసుకున్నా కానీ పెద్ద ప్రయోజనం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక మరవకూడని మరో విషయం కూడా ఉంది. ఏ వ్యాధి వచ్చినా కానీ ఏ మందులు వేసుకుంటున్నా కానీ ముందు వాటిని వైద్యుడికి చూపెట్టిన తర్వాతనే వాడడం మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.