రిలేషన్ షిప్ లో మీరు ఎప్పుడైనా మైక్రో చీటింగ్ ని గుర్తించారా ?

ఒక వ్యక్తితో మనం రిలేషన్ లో ఉన్నప్పుడు చీటింగ్ కి గురైన సందర్భాలు చాలానే ఉంటాయి. వాటి వల్ల గొడవలు జరిగి రిలేషన్ షిప్ బ్రేక్ అయినా సందర్భాలు మన కామన్ జీవితాలలో తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి.  అయితే రీసెంట్ గా మైక్రో చీటింగ్ గురించి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. దీని గురించి మీరెప్పుడు విని కూడా ఉండరు, ఇది ఒక రకమైన మోసం. ఇందులో ఉన్న గమ్మతు ఏమిటంటే మనం మైక్రో చీటింగ్ కి […]

Share:

ఒక వ్యక్తితో మనం రిలేషన్ లో ఉన్నప్పుడు చీటింగ్ కి గురైన సందర్భాలు చాలానే ఉంటాయి. వాటి వల్ల గొడవలు జరిగి రిలేషన్ షిప్ బ్రేక్ అయినా సందర్భాలు మన కామన్ జీవితాలలో తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి.  అయితే రీసెంట్ గా మైక్రో చీటింగ్ గురించి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. దీని గురించి మీరెప్పుడు విని కూడా ఉండరు, ఇది ఒక రకమైన మోసం. ఇందులో ఉన్న గమ్మతు ఏమిటంటే మనం మైక్రో చీటింగ్ కి గురైన విషయాన్నీ కూడా కనిపెట్టలేము, అలా ఉంటుంది ఈ మోసం. ఈ మైక్రో చీటింగ్ లో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ లో ఎలాంటి నిజాయితీ ఉండదు. అతడు/ఆమె జీవిత భాగస్వామి తో కాకుండా మూడవ వ్యక్తి వైపు మొగ్గు చూపితే దీనిని మైక్రో చీటింగ్ అంటారు. అతడు/ ఆమె వేరే వ్యక్తి తో భావోద్వేగ పూరితమైన అనుబంధం కలిగి ఉంటే దానిని కూడా మైక్రో చీటింగ్ గా పరిగణిస్తారు. మీకు ఇంకా దీని గురించి స్పష్టం గా అర్థం కాకపోతే, ఇప్పుడు మేము మీకోసం వివరంగా చెప్తాము వినండి.

భార్య భర్తల మధ్య తరచూ గొడవలు పడడానికి కారణం మైక్రో చీటింగ్ వల్లే అని అనుకోవచ్చు. అతడు/ ఆమె వేరే వ్యక్తిని ఇష్టపడినప్పుడు వారితోనే మనం ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటాము. మీరు కట్టుకున్న భాగస్వామికి చిన్నగా దూరం అవుతూ శత్రువులుగా మారిపోయి విడాకులు తీసుకునే వరకు వెళ్తారు. ఇటీవల కాలం లో విడాకులు ఇలాంటి విషయాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని కూర్చొని పరిష్కరించుకొని దాంపత్య జీవితాన్ని కొనసాగించే ఛాయస్ కూడా ఉంటుంది, కానీ నేటి తరం యువతీ యువకులు ఎంత తొందరగా అయితే రిలేషన్ లో పడిపోతున్నారో, ఇక అంతే తొందరగా విడిపోతున్నారు. ఇలాంటి వాటికి మూల కారణం మైక్రో చీటింగ్ అనే అంటున్నారు చాలా మంది నిపుణులు. 

మైక్రో చీటింగ్ ని పసిగట్టడం ఎలా :

ఈ మైక్రో చీటింగ్ ని పసిగట్టే మార్గం ఏమిటంటే అతడు / లేదా ఆమె తమ భాగస్వామి కి సంబంధించిన రోజువారీ కార్యాచరణ ని చాలా శ్రద్దగా గమనించడమే. మన లైఫ్ పార్టనర్ రోజు మొత్తం ఫోన్ కాల్స్ చేస్తూ, చాటింగ్ చేస్తూ ఉన్నట్టు అయితే సదరు వ్యక్తు మైక్రో చీటింగ్ ని పాల్పడ్డట్టు లెక్క. 

ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్లడం :

తమ జీవిత భాగస్వామి బోర్ కొట్టడం వల్లనో, లేదా అతడు/ఆమె మీద విరక్తి కలగడం వల్లనో, కలిసి బయటకి సరదాగా వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడము. ఇది మైక్రో చీటింగ్ కి ఉదాహరణ అనే చెప్పొచ్చు. 

మాజీ ప్రియుడు/ప్రేయసి తో రహస్య సంబంధాలు కొనసాగించడం:

ఎప్పుడైనా ఇంట్లో పెద్ద గొడవ జరిగినప్పుడు మన జీవిత భాగస్వామి మీద చాలా కోపం వచేస్తాది. ఆ క్షణం లో మనకి పాత సంబంధాలు గుర్తుకు వచ్చి మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని గుర్తు తెచుకుంటాము. గుర్తు తెచ్చుకొని సైలెంట్ గా అయితే ఉండము కదా, మెసేజి కానీ , కాల్ కానీ చేస్తాము. అప్పటి నుండి ఆ వ్యక్తితో రహస్యం గా మరో రిలేషన్ ని ప్రారంభిస్తాము. దీనినే మైక్రో చీటింగ్ అని అంటారు.

డేటింగ్ యాప్స్ :

మనం ఎంతగానో నమ్మే మన లైఫ్ పార్టనర్ మొబైల్ లో ఇంకా డేటింగ్ యాప్స్ కనుక ఉన్నట్లు అయితే అది కచ్చితంగా మైక్రో చీటింగ్ అనే చెప్పాలి. ఈ అతి చిన్న మోసాన్ని గుర్తించడం చాలా సులభం, కానీ ఇతరుల వ్యక్తిగత మొబైల్ ని ముట్టుకోవడం తప్పు కనుక మనకి సంస్కారం అడ్డు వచ్చి ఇలాంటివి పెద్దగా పట్టించుకోము.