క్యాన్స‌ర్‌కు దారి తీస్తున్న ఏంటి ఈ ఆస్ప‌ర్టేమ్

ప్రస్తుతం ఈ ఆస్ప‌ర్టేమ్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఆస్ప‌ర్టేమ్ అనేది కూల్ డ్రింక్స్, డెజర్ట్‌లు, షుగర్ ఫ్రీ జ్యూసుల్లో మరియు అనేక రకాల తాగే పానీయాల మిశ్రమాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రిజర్వేటివ్స్లో ఈ పదార్థం కలపడం జరుగుతుంది, పానీయాలు మాత్రమే కాకుండా అస్పర్టమేను చక్కెరకు బదులుగా ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా జీరో కేలరీలు ఉంటాయి. ఆస్ప‌ర్టేమ్ ఒక ప్రసిద్ధ చెందిన ఆర్టిఫిషల్ స్వీటెనర్,ఇప్పుడు ఇది వచ్చే నెలలో […]

Share:

ప్రస్తుతం ఈ ఆస్ప‌ర్టేమ్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఆస్ప‌ర్టేమ్ అనేది కూల్ డ్రింక్స్, డెజర్ట్‌లు, షుగర్ ఫ్రీ జ్యూసుల్లో మరియు అనేక రకాల తాగే పానీయాల మిశ్రమాలలో ఉపయోగిస్తూ ఉంటారు.

ఎక్కువగా ప్రిజర్వేటివ్స్లో ఈ పదార్థం కలపడం జరుగుతుంది, పానీయాలు మాత్రమే కాకుండా అస్పర్టమేను చక్కెరకు బదులుగా ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా జీరో కేలరీలు ఉంటాయి. ఆస్ప‌ర్టేమ్ ఒక ప్రసిద్ధ చెందిన ఆర్టిఫిషల్ స్వీటెనర్,ఇప్పుడు ఇది వచ్చే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత  క్యాన్సర్కు కారణమయ్యే ఒక పదార్థంగా ప్రకటించబడుతుంది.  ముఖ్యంగా ఇతర షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ మాదిరిగా ఇందులో చేదు అనేది మనకి కనిపించదు. నివేదిక ప్రకారం, ఆస్ప‌ర్టేమ్ ఒక క్యాన్సర్ కారకంగా గుర్తించబడుతుందని, అనేక ఇతర సమస్యలకు కారణంగా వెల్లడిస్తారని పేర్కొంది.

ఆస్ప‌ర్టేమ్ ఉపయోగించే ఉత్పత్తుల లిస్ట్:

డైట్ కోక్ కోకా-కోలా

తక్కువ షుగర్ ఉండే మార్స్ చూయింగ్ గమ్

జెల్-ఓ షుగర్‌ఫ్రీ జెలటిన్ డెజర్ట్ మిక్స్

జీరో షుగర్ టీ, జ్యూస్,మరియు డ్రింక్స్ 

షుగర్ ట్విన్ 1 స్వీటెనర్ ప్యాకెట్లు

జీరో క్యాలరీలకు సమానమైన స్వీటెనర్లు

షుగర్ ఫ్రీ పిప్పరమెంటు గమ్స్ 

కార్సినోజెన్ అంటే ఏమిటి?: 

క్యాన్సర్ను ప్రేరేపించే పదార్థాలు ఉన్న ఈ కార్సినోజెన్ నిజానికి మానవులకు క్యాన్సర్‌ను కలిగిస్తాయి అని తెలుసు. 

కార్సినోజెన్‌లలో 4 క్యాటగిరిస్ ఉన్నాయి: 

కార్సినోజెనిక్, బహుశా కార్సినోజెనిక్ క్యాటగిరిలోకి వచ్చేది, కార్సినోజెనిక్కి సమానంగా ఉండే మరొక పదార్థం. ఆస్ప‌ర్టేమ్ బహుశా క్యాన్సర్కి కారణం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇది కార్సినోజెనిక్కి సమానంగా క్యాన్సర్ నీ ప్రేరేపించే గుణాలు కలిగి ఉన్న పదార్థం కాబట్టి ఇది మూడో క్యాటగిరిలోకి వస్తుంది.

క్యాన్సర్‌కు కారణమయ్యే ఇతర పదార్థాలు ఏమిటి?: 

వడ్రంగి పనులు

ట్రెడిషనల్ ఆసియా కూరగాయలు

ప్రింటింగ్ ప్రక్రియలలో వెలువడే పదార్థాలు

డ్రై క్లీనింగ్‌లో వెలువడే పదార్థాలు

రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలు

అస్పర్‌టేమ్‌ను కూడా నిజానికి ఈ వర్గంలో చేర్చే అవకాశం ఉంది.

కార్సినోజెనిక్‌గా గుర్తించిన పదార్థాలు: 

ఆస్ప‌ర్టేమ్ క్యాన్సర్ కారకంగా వర్గీకరించబడే అవకాశం ఉంది. కొన్ని క్యాన్సర్ ముప్పు తెచ్చిపెట్టే అంశాలు- అంటే అవి క్యాన్సర్‌కు కారణమవుతాయని, రుజువు చేసే తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. 

మద్యం

వాయు కాలుష్యం

బొగ్గు కాలుస్తున్నప్పుడు వెలువడే వ్యర్థ పదార్థాలు

పొగాకు ధూమపానం

ప్రాసెస్ చేసిన మాంసం వినియోగం

X-రే మరియు గామా-రేడియేషన్

వడ్రంగి చేస్తున్నప్పుడు చెక్క దుమ్ము

నల్లమందు వినియోగం

ఫార్మాల్డిహైడ్

యువి కిరణాలు

ఆస్ప‌ర్టేమ్ అంటే ఏమిటి?:

ఆస్ప‌ర్టేమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఒక స్వీటెనర్. WHOలో భాగమైన క్యాన్సర్ పరిశోధన విభాగం అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తీసుకున్న నిర్ణయం అనేది, ఇప్పుడు చాలా పరిశ్రమలకు దెబ్బగా మారింది, కానీ కొన్ని వైపుల నుంచి ఈ వార్తను కొట్టివేసి, నియంత్రణ సంస్థలచే అస్పర్టమే ఉపయోగం సురక్షితమని ప్రకటించబడింది. 

ఇది నిజానికి ఆలోచింపదగ్గ విషయం. ఎన్నో ఏళ్ళుగా చాలామంది విషపూరితమైన పదార్థాలను రోజూ తీసుకునే ఆహారంలో కలుస్తున్నాయని వార్తలను వినిపిస్తూనే ఉన్నారు మన వింటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు, ఆర్టిఫిషియల్ షుగర్గా పేరొందిన అస్పర్టమే ఇప్పుడు ఎంతవరకు హాని కలిగిస్తుంది అనేది, వచ్చే నెల WHO తీసుకునే నిర్ణయాన్ని బట్టి తేలిపోతుంది. కానీ మానవులకు హాని చేసే ఇటువంటి పదార్థాలను వాడి సొమ్ము చేసుకుంటున్న కొన్ని ప్రముఖ సంస్థల మీద ఫైర్ అవుతున్నారు పబ్లిక్.