అసలు విటమిన్ డి లోపానికి కారణాలేమిటి?

మన దేశంలో విటమిన్ డేట్ఫిషియన్సీ వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు 68 శాతం మంది విటమిన్ డి డెఫిషియన్సీ వళ్ళ సఫర్ అవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. మహా పట్టణాల్లో కాక మారుమూల గ్రామాల్లో కూడా ఈ డెఫిషియన్సీ డి వల్ల బాధపడుతున్న వారు ఉన్నట్లు చెప్పారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లు కొన్ని శరీరం  మార్పుల వల్ల మనం గుర్తించవచ్చును. విటమిన్ డి డెఫిషియన్సీ కి ముఖ్య కారణాలు మనం ధరించే దుస్తులు, మన […]

Share:

మన దేశంలో విటమిన్ డేట్ఫిషియన్సీ వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు 68 శాతం మంది విటమిన్ డి డెఫిషియన్సీ వళ్ళ సఫర్ అవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. మహా పట్టణాల్లో కాక మారుమూల గ్రామాల్లో కూడా ఈ డెఫిషియన్సీ డి వల్ల బాధపడుతున్న వారు ఉన్నట్లు చెప్పారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లు కొన్ని శరీరం  మార్పుల వల్ల మనం గుర్తించవచ్చును.

విటమిన్ డి డెఫిషియన్సీ కి ముఖ్య కారణాలు మనం ధరించే దుస్తులు, మన చర్మం రంగు, మన జీవించే విధానం కాలుష్యం మరియు జన్యు సిద్ధత వీటికి ముఖ్య కారణాలని డాక్టర్ అపర్ణ బోనశాలి తెలిపారు. మనం విటమిన్ డి డెఫిషియన్సీ తో బాధపడుతున్నట్లు కొన్ని సూచనల ద్వారా మనం వాటిని తెలుసుకోవచ్చని దానికి  సరైన చికిత్స తీసుకోవాలని చెప్పారు.

న్యూట్రిసినిస్ట్ చెప్పిన దాని ప్రకారం విటమిన్ డిఫిషియన్సీ ఉన్నవారికి ఎక్కువగా అలసట, నీరసం ,ఎక్కువ పని చేయలేకపోవడం, కొద్దిగా జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. మీకు ఎక్కువగా అలసట గాని లేదా నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఉంటే కనుక మనలో కూడా విటమిన్ డి డిఫిషియన్సీ ఉండే సూచనలు ఉండొచ్చని తెలిపారు.

తరచూ అనారోగ్యము:

విటమిన్ డి డిఫిషియన్సీ ఉన్న వాళ్లకి తరచూ అనారోగ్యం పాలవుతారు. వాళ్లకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వాళ్లకు రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా ఉండదు. తరచూ నీరసం మరియు వివిధ రకాలైన సవాళ్లు వస్తాయి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫ్లూ వచ్చిందంటే వాళ్లు మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వారిలో కనిపిస్తాయి.

ఎముకల మరియు కండరాల నొప్పి:

విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వారికి వారి కండరాలు మరియు ఎముకలు చాలా నీర్శించిపోతాయి. ఏ పని చేయడానికి అయినా శరీరం సహకరించదు. మన శరీరంలో ఉన్న ఎముకలు కండరాలు మనం పని చేయడానికి ఉపయోగపడవు.

విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వారిలో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, కొవ్వు తగ్గడం, ఏ పని మీద దృష్టి పెట్టకపోవడం లాంటివి విటమిన్ డి డిఫిషియన్సీకి లక్షణాలు.

నిర్లక్ష్యం వద్దు: 

విటమిన్ డెఫిషియన్సీ ఉన్నవారు వెంటనే చికిత్స తీసుకోవాలి. దానిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మధుమేహాన్ని, గుండె జబ్బుల్ని మరియు ఎముక సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇది జన్యు సిద్ధత వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లు గుర్తించవచ్చును.

డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పిన దాని ప్రకారం, విటమిన్ డి డిఫిషియన్సీ తగ్గలంటే, ఎక్కువగా సన్ లైట్ లోకి వెళ్తే ఉపయోగకరమని మరియు విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని చెప్పారు. ఉదాహరణకు చేపలు, గుడ్లు, పాలు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ డి కి సంబంధించినవని మనకి ఉపయోగకరమని చెప్పారు.

భారతదేశంలో 60 శాతం పైగా జనాలలో ఈ డెఫిషియన్సీ ఉన్నట్లు డాక్టర్లు మరియు నిపుణులు తెలిపారు. ఈ డెఫిషియన్సీ నుంచి మనం వెంటనే తగిన చికిత్స పొందాలని, లేదంటే అది చాలా వ్యాధులకు మరియు ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుందని  నిపుణులు సూచిస్తున్నారు.