పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఈ చక్కటి చిట్కాలు మీకోసం..

ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలను జుట్టు రాలడం కూడా ఒకటి.. నల్లని ఒత్తయిన కురులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయాలను పాటిస్తే ఖచ్చితంగా జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు అనేక రకాల కేశాల సమస్యలు కూడా దూరమవుతాయి.. బరువు తగ్గే సమయంలో మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.  అలాంటప్పుడు ప్రోటీన్, బయోటిన్ డ్రింక్ , విటమిన్స్, మినరల్స్ […]

Share:

ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలను జుట్టు రాలడం కూడా ఒకటి.. నల్లని ఒత్తయిన కురులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయాలను పాటిస్తే ఖచ్చితంగా జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు అనేక రకాల కేశాల సమస్యలు కూడా దూరమవుతాయి.. బరువు తగ్గే సమయంలో మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.  అలాంటప్పుడు ప్రోటీన్, బయోటిన్ డ్రింక్ , విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ డైట్‌లో భాగం చేసుకోవాలి. ఆ వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోటీన్: మనం ఎంతైతే బరువు ఉంటామో.. ఆ బరువుకి ఒక శాతం వంతు ప్రోటీన్ ను ప్రతిరోజు మన డైట్ లో తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందించడం వల్ల బరువు తగ్గుతాము. అదేవిధంగా ప్రోటీన్ తీసుకోవడం వలన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

బయోటిన్: 

జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు బయోటిన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బయోటిన్ డ్రింక్ కనుక ప్రతిరోజు తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతోని అనడంలో సందేహం లేదు.. దీనిని 15 రోజుల పాటు తీసుకోవాలి..

నువ్వులు , నల్ల ద్రాక్ష, డేట్స్, పిస్తా, గుమ్మడి గింజలు,  బాదం, ఎండు ఖర్జూరాలు,  వాల్ నట్స్, పుచ్చ గింజలు,  జీడిపప్పు  , అంజీర -1, వీటన్నింటిని ఒక చెంచా చొప్పున తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి.  ఉదయం ఇది నానిన తర్వాత వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో ఎటువంటి చక్కెర అనేది కలుపుకోవల్సిన అవసరం లేదు. దీనిని ఇలాగే తీసుకోవాలి. 

ఈ బయోటిన్ డ్రింకును 15 రోజుల పాటు వరుసగా తీసుకొని మరో వారం రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుసగా తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు ఊడటం, రాలడం కూడా తగ్గుతుంది. అంతేకాదు మీ కండరాల బలం కూడా పెరుగుతుంది. 15 రోజులపాటు ఈ బయోటిన్ డ్రింక్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..

గుంటగలగరాకు: 

గుంటగలగర ఆకు చెట్టు వేర్లతో సహా తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని మొత్తాన్ని మెత్తగా నూరుకోవాలి. ఈ చెట్టు మిశ్రమం ఒక కప్పు అయితే దానికి నాలుగు కప్పుల నువ్వుల నూనె లేదంటే నాలుగు కప్పుల కొబ్బరి నూనెను కలిపి సన్నని సెగ మీద మరిగించాలి. ఈ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయే వరకు మరిగించాలి. ఆ తరువాత ఈ నూనెను వడపోసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెతో జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు మర్దన చేసుకోవాలి. ఈ నూనెను రాసుకోవడం వలన చిన్న వయసులోనే మెరిసిన జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలిపోవడం ఆగిపోయి జుట్టుకి బలాన్ని అందిస్తుంది. కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోకుండా కూడా చేస్తుంది.

వారంలో రెండు రోజులు ఈ నూనె రాసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. గుంటగలగర చెట్టు వేర్ల భాగాన్ని తీసుకొని శుభ్రంగా నూరి ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు ఉన్న చోట రాస్తే.. పేనుకొరుకుడు సమస్య త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా ఆ ప్లేస్‌లో కొత్త జుట్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒత్తిడి: 

మీ జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన కారణం మీ ఒత్తిడి, స్ట్రెస్, ఆందోళన. మీరు సమయానికి తినడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా మీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. మీ జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడే. అందువలన మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి.

సమయానికి నిద్ర: 

శరీరానికి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం టైం కి నిద్రపోవడం చాలా ముఖ్యమైన విధి. ఈరోజుల్లో ఈ పనిని మాత్రం ఎవ్వరు సరిగ్గా నిర్వర్తించడం లేదు. సరియైన సమయానికి నిద్రకపోవడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది, ఊడిపోతుంది. మీ జుట్టు పలచగా సన్నగా ఉంటోంది, అంటే మీరు సరిగ్గా నిద్రపోకపోవడం కూడా ఒక కారణం అవ్వచ్చు. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.