బరువును తగ్గించే చిట్కాలు

బరువు పెరుగుతున్నారని దిగులుగా ఉన్నారా? వర్క్ అవుట్ చేస్తే సరి. మరి ఎప్పుడు చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? వర్క్ అవుట్ చేయడానికి రోజులోని ఏ సమయాలు ఎలా ఉపయోగపడతాయో ఈరోజు బాగా తెలుసుకుందాం. మీరు వ్యాయామ చేసే సమయం అనేక విధాలుగా మీ రోజుని ప్రభావితం చేస్తుంది. అయితే అందరికీ ఒకే విధంగా ఉండదు, వ్యక్తిగత ప్రాధాన్యతలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సిర్కాడియన్ రిథమ్‌, అంటే 24-గంటల రోజులో మనం అనుసరించే శారీరక, మానసిక ప్రవర్తన ఇంటిమేట్ […]

Share:

బరువు పెరుగుతున్నారని దిగులుగా ఉన్నారా? వర్క్ అవుట్ చేస్తే సరి. మరి ఎప్పుడు చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? వర్క్ అవుట్ చేయడానికి రోజులోని ఏ సమయాలు ఎలా ఉపయోగపడతాయో ఈరోజు బాగా తెలుసుకుందాం. మీరు వ్యాయామ చేసే సమయం అనేక విధాలుగా మీ రోజుని ప్రభావితం చేస్తుంది. అయితే అందరికీ ఒకే విధంగా ఉండదు, వ్యక్తిగత ప్రాధాన్యతలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సిర్కాడియన్ రిథమ్‌, అంటే 24-గంటల రోజులో మనం అనుసరించే శారీరక, మానసిక ప్రవర్తన ఇంటిమేట్ చేసే ఒక సైకిల్ లాంటిది. సిర్కాడియన్ రిథమ్‌, ఇంకా నిద్రపోయే విధానాలు వంటి కారణాల వల్ల మీ శరీర శక్తి ఆధారపడుతుంది. మీ దినచర్యకు సరిపోయే సాధ్యమయ్యే వ్యాయామ సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. 

సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోవటం: 

మీ రోజు వారీ పనులు ఎలా షెడ్యూల్‌ చేయుకుంటారో అలాగే వర్క్ అవుట్ చేసుకునే సమయాన్ని కేటాయించి క్రమంగా ఫాలో అయితే, అనవసరం ఐన కొవ్వు తో పాటు టెన్షన్లు కూడా పోతాయి. ఈ షెడ్యూల్‌ చేసుకోవటం చెప్పినంత తేలిక కాదు అనేది ఎంత నిజమో, ప్రతి రోజు క్రమంగా, స్థిరంగా పాటించడం కూడా కొన్ని రోజులు కష్టంగా ఉండవచ్చు. దీర్ఘకాలంలో మాత్రం ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో ఇంప్రూవ్మెంట్ మనం రోజు చూడొచ్చు. అయితే వర్క్ అవుట్ షెడ్యూల్‌ చేసుకోవటానికి రోజులోని ఏ సమయాలను ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.. 

వ్యాయామం కోసం 7 స్లాట్లు: 

1. ఉదయం (6-9 AM): మీ రోజును వ్యాయామంతో ప్రారంభించి ఆస్వాదించే ఉత్సాహం ఉన్నవారు ఈ సమయం లో మొదలు పెట్టొచ్చు. ఉదయాన్నే పని చేయడం వల్ల మన శరీర మెటబాలిజం బాగుంటుంది, రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది, రోజంతా సానుకూలంగా ఉంటుంది. 

2. లేట్ మార్నింగ్ (10-11 AM) : కొంచెం ఆలస్యంగా రోజుని ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం. ఈ సమయానికి, శరీరం వేడెక్కుతుంది, ఫ్లెక్సిబిల్ అయ్యి మజిల్ బలం పెరుగుతుంది. 

3. భోజన సమయం (12-2 PM): కొంతమంది తమ భోజన విరామంలో వ్యాయామం చేయడం సౌకర్యంగా ఉంటుంది అనుకుంటారు. ఇలా చేస్తే పని వత్తిడి నుండి విరామంగా కూడా ఉపయోగపడుతుంది, మిగిలిన రోజు మొత్తం ఉత్సాహంగా జరిగేలా చేస్తుంది. 

4. మధ్యాహ్నం (3-5 PM) : మధ్యాహ్న సమయంలో సహజంగా శరీరంలో వ్యాయామం చేసే శక్తి ఎక్కువగా ఉంది అనుకున్నవారికి ఈ స్లాట్ అనుకూలంగా ఉంటుంది. అధిక-తీవ్రత ఉన్న వ్యాయామాలు లేదా ఒక టీమ్ గా వ్యాయామం చేసే వారికి ఇది మంచి సమయం, ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా  ఉంటుంది, కాబట్టి ఈ సమయం మెరుగైన పనితీరుకు దారితీస్తుంది. 

5. తొలి సాయంత్రం (5-7 PM) :చాలా మందికి, సాయంత్రం ప్రారంభం అయ్యే సమయం అనుకూలం. రోజంతా పని చేసిన తర్వాత, రోజు ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదనంగా, ఈ టైమ్ స్లాట్ లో పార్టనర్స్ తో వ్యాయామం చేయడానికి బాగుంటుంది లేదా ఆఫీస్ అయ్యాక గ్రూప్ ఫిట్‌నెస్ క్లాసులకు వెళ్లే అవకాశాన్ని ఇస్తుంది. 

6. సాయంత్రం (7-9 PM) : నిద్రవేళకు దగ్గరగా వర్కవుట్‌ను ఇష్టపడే వారికి, సాయంత్రం ఆలస్యంగా వ్యాయామం చేసే సమయం ఉన్న వారికి ఇది మంచి ఎంపిక. అయితే నిద్రవేళకు, శరీరం అలసిపోతేనే మంచి నిద్ర పడుతుంది కాబట్టి వ్యాయామం చేసినా కాస్త సమయం (సుమారు గంట) గ్యాప్ ఉండేలా చూసుకోండి. 

7. రాత్రి ఔల్స్ (10 PM-అర్ధరాత్రి) : కొంతమందికి వాళ్ల పనుల వలన అర్థరాత్రి అయితే కానీ వ్యాయామం చేయదానికి అనుకూలించదు, వాళ్ళకోసం ఒత్తిడిని తగ్గించడానికి, శక్తిని పెంచడానికి ఇది మంచి సమయం అయినప్పటికీ, వ్యాయామం పూర్తి చేసిన తర్వాత తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని మర్చిపోకండి. 

చివరికి చెప్పేది ఏమిటంటే, మీరు మీ జీవనశైలి, లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలకు సరిపోయే దినచర్యతో పాటు వ్యాయామం కోసం సమయం కేటాయించి స్థిరంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళగలిగితే, మీ శరీరం అనుకూలిస్తుంది. మీ శరీర అవసరతలను తెలుసుకోండి, ఇప్పటివరకు మనం చూసిన స్లాట్‌లలో మీకు ఏది అనుకూలమో చూసుకొని మీ శరీరాన్ని దృఢంగా మార్చుకోండి.