వెండి ఉంగరాన్ని ధరిస్తే మీరే ఐశ్వర్యవంతులు.. ఆరోగ్యం కూడా మీ వెంటే..

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి చేతికి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. కొంతమంది ఇత్తడి,  వెండి,  బంగారం ఉంగరాలను ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వెండి బృహస్పతి, చంద్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. మీ చిటికెన వేలుకు వెండి ఉంగరాన్ని ధరిస్తే ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ఉంగరం ధరించడం వలన కలిగే ఆధ్యాత్మిక,  ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. జ్యోతిష్యంలో అత్యంత ముఖ్యమైన చంద్రగ్రహం.. మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.  […]

Share:

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి చేతికి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. కొంతమంది ఇత్తడి,  వెండి,  బంగారం ఉంగరాలను ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వెండి బృహస్పతి, చంద్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. మీ చిటికెన వేలుకు వెండి ఉంగరాన్ని ధరిస్తే ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ఉంగరం ధరించడం వలన కలిగే ఆధ్యాత్మిక,  ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిష్యంలో అత్యంత ముఖ్యమైన చంద్రగ్రహం.. మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.  అలానే భావోద్వేగాలు, అంతర్దృష్టి, జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇది మానసిక సామర్థ్యాలను, స్పిరిచువల్ గ్రోత్, స్పృహను కూడా పెంచుతుంది. అందుకే చంద్రునితో సంబంధం ఉన్న వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల సైకిక్ ఎబిలిటీస్ పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం సాధ్యమవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. వెండి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. భద్రతాభావాన్ని పెంపొందిస్తుందని పెద్దలు నమ్ముతారు. వెండి ఉంగరం లేదా ఆభరణాలు ధరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.  

వెండిని ధరిస్తే ప్రశాంతతను, సంతోషకరమైన, ఆహ్లాదకరమైన మానసిక స్థితిని అందిస్తుంది. మనలో కలిగే కోపాన్ని శాంతపరిచీ ఇంకా మీ మానసిక ప్రశాంతతను అందిస్తుందని పెద్దలు నమ్ముతారు. ఈషా భట్నాగర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకల్ట్ సైన్స్ యొక్క టారో రీడర్.. చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరించడం వల్ల కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తుందని తెలిపారు. వెండి ఉంగరం లేదా ఆభరణాలు ధరించడం వల్ల ప్రతికూల శక్తులను దూరం చేసి ఇంకా మనలో భద్రత భావాన్ని పెంపొందిస్తుంది.

ఇది ధరించడం వలన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దగ్గు, జలుబు, కీళ్లనొప్పులు, అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు తగ్గిస్తుంది. రక్తనాళాల అడ్డంకులను తొలగిస్తుంది.   

దీనిని ధరించడం వలన విషపూరితమైన పదార్ధాలను నివారించడంలో వెండి మనకు ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని కలిగిస్తుంది.  ఇతర లోహలకు వలె, వెండి టాక్సిన్స్ ని అనేక ఇతర రసాయనాలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిస్పందించడంతో రంగు మారుతుంది. ఉదాహరణకు మీ వెండి ఆభరణాలు ఎక్కువసేపు ధరించినప్పుడు నీలం రంగులోకి మారితే, ఇది మీ శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది. నీలిరంగు వెండి ఆభరణాన్ని చూడటంతో ఉప్పు చిరుతిళ్లను తగ్గించుకోవడానికి రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. 

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్దిష్ట రకం వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల చేతుల్లో ఆర్థరైటిస్ యొక్క కొన్ని లక్షణాలను తగ్గించవచ్చని నిరూపించారు. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో సాధారణంగా కనిపించే వేలి కీళ్లలో హైపర్‌ ఎక్స్‌టెన్షన్‌ను నివారించడంతో పాటు, ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెండి స్ప్లింట్‌లను ధరించడం వల్ల నొప్పి తగ్గుతుందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. వెండి ఆభరణాలను ధరించడం వల్ల ఎర్రబడిన కీళ్లలో స్థిరత్వం ఇంకా చలన పరిధిని పెంపొందించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.